మట్టల ఆదివారము – Palm Sunday Telugu Songs Images Wishes Message

మట్టల ఆదివారము శుభాకాంక్షలు from suvarthaswaram.com

Palm Sunday telugu Song Lyrics

ఇదిగో నీ రాజు వచ్చుచుండె – సియోనుకుమారి
ఇదిగో నీ రాజు వచ్చుచుండె – సియోనుకుమారి
సంతోషించు – యెరుషలేం కుమారి ఉల్లసించు
1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు – వచ్చు చుండె
2. రక్షణగల వాడుగ – అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యేరుషలేం – వచ్చు చుండె
3. సాత్వికుండు యీభువిన్ – అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై వచ్చుచుండె
4. దీనపరుడు నీ ప్రభు – ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై – వచ్చుచుండె
5. ఇలను గాడిదనెక్కియే – బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు – వచ్చుచుండె
6. దావీదు కుమారుడు – దేవుడు పాపులకు
జయగీతములతో – వచ్చుచుండె
7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము
యేసుడిల వచ్చుచుండె – హల్లెలూయ

Palm Sunday telugu Message from Old testment & New testment of BIBLE

జెకర్యా 9: 9
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.

యోహాను 12: 12
మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు యెరూష లేమునకు వచ్చుచున్నాడని విని

యోహాను 12: 13
ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి.
యోహాను 12: 14
సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు

యోహాను 12: 15
అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.
యోహాను 12: 16
ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి.

 


Lent Day -26 Sramala Dinaalu 31/03/2022 Telugu Christian Quotes

యెహోవా, ….నా ఆశ్రయదుర్గము నీవే. (కీర్త 142:5)
సమస్తమును మీవి, మీరు క్రీస్తువారు; క్రీస్తు దేవునివాడు. (1కొరిం 3:22,23)మన రక్షకుడునైన యేసుక్రీస్తు … తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. (తీతు 2:13,14) క్రీస్తు … సంఘమును ప్రేమించి,అది కళంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని … దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. (ఎఫె 5:25-27) యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను.
(కీర్త 34:2)ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి యున్నాడు.కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. (యెష 61:10)
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిదేదియు నాకక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. (కీర్త 73:25,26)నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును. యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము.నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను. (కీర్త 16:2,5,6)

ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. (సామె 14:12)
తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. (సామె 28:26)
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. (కీర్త 119:105) మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించు కొనుటకై నీ నోటిమాటనుబట్టి నన్ను నేనుకాపాడుకొనియున్నాను. (కీర్త 17:4)
నీ మధ్యను ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని పుట్టి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల, అతడు నీతో చెప్పిన …మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాటవిని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను. (ద్వితీ 13:1-4)
నీకు ఉపదేశము చేసెదను.నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. (కీర్త 32:8)

Aha Mahatmaha Sharanya- Good Friday Yedu Maatalu Song Lyrics Chords

aha mahatmaha song lyrics telugu english

Devudu Palikina Edu maatalu Song for Good Friday

This song is from Andhra Kraisthava Keerthanalu written by పంతగాని పరదేశి about the words of Christ on the cross. సందర్భం: క్రీస్తు శ్రమలు మరణము. the details regarding the song are given here రాగం: హిందుస్తానీ కాపీ తాళం: రూపకము.

 

Andhra Kraisthava Keerthanalu Song 196

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా||
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా||
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా||
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా||
నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా||
దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా||
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా||

అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||

AHA MAHATMA HA SARANYA LYRICS

క్రీస్తు శ్రమలు – మరణములు

క్రీస్తు సిలువమీద పలికిన యేడు మాటలు Song =====Aha mahathma ha saranya ha vimochaka English Lyrics

Aha Mahathmaha Sharanyaa- ha vimochaka

dhroha rahitha champeninuna dhoshamekada ll aha ll

1. veeralanu shaminchu thandri- neramemiyun

korithitula ninnu jhampu- krura janulakai ll aha ll

2.neevu naatho paradaisuna- nede yundhuvu

paavanunda itlu baliki-paapigaachithi ll aha ll

3. amma nee suthundatanchu mari-yammatho baliki

krammara nee janani anchu-garthanudivithi ll aha ll

4. naa deva deva emi vda- naadithivanuchu

srideva sutha palikithivi srama-cheppa shakyamaa ll aha ll

5. dappigonu chunnaanatanchu-cheppithivigadha

ippagidhi nee baadha nondha-emi neeku haaa ll aha ll

6. srama prammadhamulanu goppa-shabdha metthihaa

samaapthamaina danchu delipisamasithivigadhaa ll aha ll

7. appaginthu thandri neeku- naathma nanchunu

goppa aarbhaatambuchesi-koolipothivaa ll aha ll

 

 

ఆహా మహాత్మ హా శరణ్యా – హ విమోచకా = ద్రోహ రహిత చంపె నినునా దోషమేగదా! /యాహా/
1. వీరలను క్షమించు తండ్రి – నేర రేమియున్ = కోరి తిటుల నిన్నుఁ జంపు -క్రూర జనులకై /యాహా/
2. ”నీవు నాతో బరదైసున – నేడె యుందువు” = పావనుండ యిట్లు బలికి – పాపి గాచితి /వాహా/
3. “అమ్మా! నీ సుతుఁడ” టంచు మరి -యమ్మాతో బలికి = క్రమ్మర “నీ జనని” యంచుఁ – గర్త నుడితివి /వాహా/
4. “నా దేవ దేవ యేమి విడ – నాడితి” వనుచు = శ్రీదేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా /యాహా/
5. “దప్పికొనుచున్నా న” టంచుఁ – జెప్పితివి గద = యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా! /యాహా/
6. శ్రమ ప్రమాదములను గొప్ప – శబ్ధ మెత్తి హా = “సమాప్తమైన” దంచు దెలిపి – సమసితివి గదా /యాహా/
7. “అప్పగింతు దండ్రి నీకు – నాత్మ” నంచును = గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా /యాహా/

 

 

Credentials:
రచన: పంతగాని పరదేశి
సందర్భం: క్రీస్తు శ్రమలు మరణము
రాగం: హిందుస్తానీ కాపీ
తాళం: రూపకము

Andhra Kraisthava KeerthanaluGood FridayPanthagani ParadhesiRajaji PrasadRavi Kumarక్రీస్తు శ్రమలు – మరణములు  ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచకా

ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచకా Meaning -Line to line Explanation of Song

 

Lent Day -25 Sramala Dinaalu 30/03/2022 Telugu Bible Vakyalu

దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము.దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము. (2కొరిం 6:10)
మనము … దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడు చున్నాము. అంతే కాదు … అతిశయ పడుదము. (రోమా 5:2-4) నాకు చాల అతిశయము కలదు.ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. (2కొరిం 7:4)మీరు విశ్వసించుచు …చెప్ప నశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. (1 పేతు 1:9)
వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. (2కొరిం 8:2)శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. (ఎఫె 3:9-10)
ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? (యాకో 2:5) అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. (2కొరిం 9:8)

రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును.రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. (కీర్త 41:3)
వారి యావద్బాధలో ఆయన బాధనొందెను.ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను.ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను.పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. (యెష 63:9)నీవు ప్రేమించువాడు కాయిలాపడి యున్నాడు. (యోహా 11:3)నా కృప నీకు చాలును.బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది.కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే అతిశయపడుదును. (2కొరిం 12:9)
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. (ఫిలి 4:13)మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. (2కొరిం 4:16)
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. (అ కా 17:28)సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే.శక్తిహీనులకు ఆయనే బలాభివృద్ధి కలుగజేయును. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవ్వనస్థులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. (యెష 40:29-31)శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము.నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును. (ద్వితీ 33:27)

Lent Day -24 Sramala Dinaalu 29/03/2022 Telugu Bible Portion

నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. (యోహా 17:15)
మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులు. … మీరు లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు. (ఫిలి 2:14,16)మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. (మత్త 5:13-16)
నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని. (ఆది 20:6)ప్రభువు నమ్మదగినవాడు.ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును. (2థెస 3:3) దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు. (నెహె 5:15)మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము ఆయనమనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. (గల 1:14) తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వ యుగములును కలుగును గాక. ఆమేన్. (యూదా 24,25)

యెహోవాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. (సామె 29:25)
యెహోవా మహా ఘనత నొందియున్నాడు. ఆయన ఉన్నతస్థలమున నివసించు చున్నాడు. (యెష 33:5) యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశములను మించి మహోన్నతమై యున్నది.ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్పమీద నుండి బీదలను పైకెత్తువాడు. (కీర్త 113:4,7,8)
దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సహా మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడియున్నారు. క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ కూర్చుండబెట్టెను. (ఎఫె 2:4,5,7)
తన స్వకీయకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసుద్వారా కనుపరచబడియున్న దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. (రోమా 8:32,38,39)

Lent Day -23 Sramala Dinaalu 28/03/2022 Telugu Christian Whatsapp Status

Lent Day -23 Sramala Dinaalu 1 wallpaper whatsapp status

దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు; పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు.(సంఖ్యా 23:19)
ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయ యైనను లేదు. (యాకో 1:17)యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. (హెబ్రీ 13:8)
ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. (కీర్త 91:4)
దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. (హెబ్రీ 6:17,18)
నీ దేవుడైన యెహోవా తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును, వేయితరములవరకు కృపచూపువాడునై యున్నాడు. (ద్వితీ 7:9) ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్య మయములై యున్నవి. (కీర్త 25:10)ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో,ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. (కీర్త 146:5,6)

శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతగానివాడవగుదువు. (సామె 24:10)
సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు ఆయనే బలాభివృద్ధి కలుగజేయును. (యెష 40:29)నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది. (2కొరిం 12:9)అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తర మిచ్చెదను.శ్రమలో నేనతనికి తోడైయుండెదను. అతని విడిపించెదను. (కీర్త 91:15)శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము. నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును. ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టును. (ద్వితీ 33:27)
కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారి కొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును కానరారైరి. (కీర్త 69:20)
ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై … దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. అతడు ఏమియు తెలియనివారి యెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూప గలవాడై యున్నాడు. అటువలె క్రీస్తు, … కుమారుడై యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, …తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారకుడాయెను. (హెబ్రీ 5:1,2,5-10)నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను.మన వ్యసనములను వహించెను.(యెష 53:4)

Lent Day -23 Sramala Dinaalu 1 wallpaper whatsapp status