సువార్తస్వరము గురించి

సువార్తస్వరము గురించి

దేవుని మహా కృపను బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడని మనము దేవుని నామాన్ని తెలియచేయాలని సర్వలోకానికి సృష్టికర్తను పరిచయం చేయడమే మాకు ఉన్న అభిలాష

దీనికోసమే మా వెబ్ సైట్ ను ముందుకి తీసుకొని వచ్చాను. ఎంతోమంది మా సువార్త స్వర్ణ ద్వారా రక్షణ పొందాలనే దేవనూర్ ఎదగాలని కోరుకుంటున్నాను దేవుడిచ్చే జీవజలములు తాగుదాం రండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యేసు మన దేవుని ప్రకటిద్దాం రండి.

‘ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగినవారము’ (1 కొరిం 8:6). ‘మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము’ (విలా 3:40-41)
విశ్వం లేక సృష్టిలోని ప్రతి ప్రశ్నకు ఒక్కటే జవాబు. ఆ జవాబే దేవుడు! ఒక పాత్ర లోపల ఉన్నదాని పరిమాణం కంటే, ఆ పాత్ర ఎప్పుడైనా పెద్దగానే ఉంటుంది. అందుకే భక్తుడైన యోబు తనతో తర్కిస్తున్న మేధావులతో అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. ‘దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? .. నీవేమి యెరుగుదువు?’ (యోబు 11:78) ‘ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా’ (యోబు 26:14) ‘ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. మనము ఆయనను ఎరుగము’ (యోబు 36:26)
అవును. యిది ముమ్మాటికీ నిజం. దేవుడు మానవ ఊహలకు మించినవాడు. ఆయనను గూర్చి పూర్తిగా యెరిగిన మానవుడు ఎవడూ లేదు. ‘తండ్రి ఎవడో, కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడు. (లూకా 10:22)
సమస్త సృష్టిని, అటు పిమ్మట ఆదామును దేవుడు సృజించాడు. ఆదాము దేవునికి కుమారుడు. (లూకా 3:38) దేవుడు ఆదాముతో సంభాషించిన తరువాత, ‘ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను (బహుగా) ఆనందించు చున్నాను’ (మత్త 17:5) అని యేసు ప్రభువును గూర్చి దేవుడు ప్రకటించినట్లుగా, యివే మాటలు దేవదూతల సమూహానికి దేవుడు చెప్పియుండవచ్చు. వాస్తవానికి, మానవ సృష్టి యొక్క మూలోద్దేశము యిదే. ‘మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి యున్నాను’ (కీర్తనలు 82:6)