Siluva Paatau Telugu lo – 10 గొప్ప సిలువ పాటలు Christian Lyrics & Chords 

Siluva Paatalu -1

యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకే
యెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే
1. నదివోలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే
2. నేడె నీ పాపములొప్పుకో – నీ పాపపు డాగులు తుడుచుకో
నీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో
3. పాప శిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువె సహించెను
నలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని
Lyrics in English:
Yesu chavonde siluvapai – Nee korake Naa Korake
Yenta goppa srama norchenu – Nee korake Naa Korake
1.Nadi vole Yesu rakthamu – Siluvalo nundi pravahinche
Paapamu kadigi malinamu tudiche – Aa prasastha rakthame
2.Nede nee paapamuloppuko – Nee paapapu daagunu tuduchuko
Nee atma tanuvula shuddhi parachuko – Kreesthu Yesu rakthamulo
3.Paapa siksha ponda tagiyuntimi – Mana siksha prabhuve sahinchenu
Nalugagottabade podavabade neekai – Angeekarinchu Yesuni

Jesus Siluva Paatalu -2

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
అమూల్యమైన రక్తము యేసు రక్తము(2)
1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము(2)
సంధి చేసి చేర్చును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము(2)
2. సమాధాన పరచును యేసు రక్తము(2)
సమస్యలన్ని తీర్చును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము(2)
3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము(2)
దుర్ణితినంత బాపును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
నిబంధన నిలపును రక్తము – యేసు రక్తము(2)
4. రోగములను బాపును – యేసు రక్తము(2)
దురాత్మల పారద్రొలును -యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
శక్తి బలము నిచ్చును-యేసు రక్తము(2)

Silvalo Naakai Kaarchenu – Yesu Rakthamu (2)
Shilanaina Nannu Maarchenu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Amoolyamaina Rakthamu – Yesu Rakthamu (2)
1.Samakoorchu Nannu Thandritho – Yesu Rakthamu (2)
Sandhi Chesi Cherchunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Aikyaparachunu Thandritho – Yesu Rakthamu (2)
2.Samaadhaana Parachunu – Yesu Rakthamu (2)
Samasyalanni Theerchunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Sampoorna Shaanthinichchunu – Yesu Rakthamu (2)
3.Neethimanthuluga Cheyunu – Yesu Rakthamu (2)
Durneethi Nantha Baapunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Nibandhana Nilupunu Rakthamu – Yesu Rakthamu (2)
4.Rogamulanu Baapunu – Yesu Rakthamu (2)
Duraathmala Paaradrolunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Shakthi Balamu Nichchunu – Yesu Rakthamu (2)

Kreesthu Siluva Paatalu -3

Siluve naa saranaayenu ra
సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా = సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే /
1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు – విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే /
2. సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే /
3. సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప = కలుషమెల్లను బాపఁగఁ జాలును రా /నీ సిలువే /
4. పలు విధ పధము లరసి – ఫలిత మేమి గానలేక = సిలువయెదుటను నిలచినాడను రా /నీ సిలువే /
5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా = దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా /నీ సిలువే /
రచన: చెట్టి భానుమూర్తి

Lyrics in English:
Siluve naa saranaayenu ra – nee – siluve naa sara naayenuraa – Siluva yande mukti balamun – joochiti raa /nee siluve/
1. Siluvanu vraali Yesu – Palikina palukulandu – Viluvaleni premaamrutamun groliti raa /nee siluve/
2. Siluvanu joochukoladi – Silasamaanamaina manasu = Naligi karigi neeraguchunnadiraa.. /nee siluve/
3. Siluvanu darachi tarachiti – Viluva kandaga raani nee krupa = Kalushamellanu baapaga jaalunu raa /Nee siluve/
4. Palu vidha padhamu larasi – Phalitamemi gaana leka = Siluva yedutanu nilachinaadanu raa / Nee siluve/
5. Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuva = Durita dooruda nee dari jeriti rua / Nee siluve/

Yesu Siluva Paatalu -4

పల్లవి: సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు (2X)
1. నాదు పాప గాయములను – మాపగోరి సిల్వపై
నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి
/సిలువయందె/
2. తండ్రి కుమార శుద్దాత్మలదేవ – ఆరాధింతు ఆత్మతో
హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం
/సిలువయందె/

Siluvalona Nilachi Yesu song Lyrics
సిలువలోన నిలిచి యేసు – పిలిచె నిన్నే క్రైస్తవా /2/
విలువకందని నీదు ప్రేమ – తలువగా నా తరముకాదు /సిలువ/
1. దేవుని కుమారుడనియు -ధరణినేలే రాజరాజని /2/
కోరాడ దెబ్బలు కొట్టుచు – క్రీస్తు నల్లరి జేసిరా /సిలువ/
2. ఎన్ని శ్రమలనొందిన – మన్నించు తండ్రి వీరలన్ /2/
అన్న యేసుని సిలువ గాధ – వినుమా నా ప్రియ క్రైస్తవ /2/సిలువ/
3. నా కలుషములకై యేసువా – నలిగిపోతివ సిలువలో /2/
విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్
నే విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్ /సిలువ/

Siluva Paatalu Telugu lo-5

siluvapai o snehituda
సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా /2/
నా పాపముకై నా దోషముకై బలియైన నా యేసయ్య /2/సిలు/
1. నా కొరకు త్యాగమూర్తివై బహు విలువైన నీ రక్తము /2/
ధారలుగా నా భారముగా చిందించావులే నా యెదుట /2/
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము/2/సిలు/
2. కఠినముగా ఈ లోకము నీదేహాన్ని దాహంతో నలిపారుగా /2/
మౌనముగా మనసు గాయముతో కరిగిపోయావులే నా యెదుట /2/
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము /2/సిలు/
Lyrics in English:
Siluvapai o snehituda..
Ninnentagaano himsinchitiraa.. /2/
Naa paapamukai – Naa doshamukai
Baliyeina na Yesayya.. /2/Siluvapai/
1. Naa koraku tyaagamurthivai
Bahu viluvaina nee rakthamu
Dhaaraluga – naa bhaaramuga
chindinchaavule naa yeduta /2/
Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/
2. Kathinamuga ee lokamu
Nee dehaanni daahamto nalipaaruga /2/
mounamuga mansu gaayamuto
Karigipoyaavule naa yeduta /2/
Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/

Siluva Paatalu in Telugu language – 6

సిలువలోన నిలిచి యేసు – పిలిచె నిన్నే క్రైస్తవా /2/
విలువకందని నీదు ప్రేమ – తలువగా నా తరముకాదు /సిలువ/
1. దేవుని కుమారుడనియు -ధరణినేలే రాజరాజని /2/
కోరాడ దెబ్బలు కొట్టుచు – క్రీస్తు నల్లరి జేసిరా /సిలువ/
2. ఎన్ని శ్రమలనొందిన – మన్నించు తండ్రి వీరలన్ /2/
అన్న యేసుని సిలువ గాధ – వినుమా నా ప్రియ క్రైస్తవ /2/సిలువ/
3. నా కలుషములకై యేసువా – నలిగిపోతివ సిలువలో /2/
విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్
నే విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్ /సిలువ/

Good Friday Siluva Paatalu Telugu lo- 7

Siluvalo saagindi yaatra Telug worship song lyrics
సిలువలో సాగింది యాత్రా – కరుణామయుని దయగల పాత్ర #2#
ఇది ఎవరికోసమో… ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే # సిలువలో#
1. పాలు గారు దేహము పైన – పాపాత్ముల కొరడాలెన్నో#2#
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి #2#
నోరు తెరువలేదాయే ప్రేమా… బదులు పలుకలేదాయె ప్రేమ#2#
2. చెళ్ళుమని కొట్టింది ఒకరు – ఆ మోముపైన ఊసింది మరియొకరు#2#
బంతులాడినారు – బాధలలో వేసినారు #2#నోరు తెరువ#
3. వెనుకనుంచి తన్నింది ఒకరు- తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు#2#
గేలి చేసినారు – పరిహాసమాడినారు#2# నోరు తెరువ#
4. దాహమని అడిగింది ప్రేమా – చెడు దాహం ఇచ్చింది లోకం#2#
చిరకనిచ్చినారు – మరి భారిసెతో గుచ్చారు #2# నోరు తెరువ#

Jesus Christ on Cross – Feel good Siluva Paatalu Telugu lo- 8

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా 2
వెలియైన యేసయ్యా- బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా #సిలువలొ#
1. నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు2
కొరడాలు చెళ్ళని చీల్చెను – నీ సుందర దేహమునే2
తడిపెను నీ తనువును – రుధిర౦పు ధారాలే2#వెలి#
2. వధకు సిద్దమైన గొర్రెపిల్లవోలె
మోమున ఉమ్మివేయ – మౌని వైనావే2
దూషించి అపహిసి౦చి హింసించిరా నిన్ను2
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా2#వెలి#

Emotional Good Friday Songs Telugu lo- 9

సిలువ శ్రమలు నాకై ఓర్చితివా – కలువరి గిరి మెట్టపై
సిలువ శ్రమలు నాకై ఓర్చితివా…
కలువరి గిరి మెట్టపై – కలుషమెల్లను బాపగ
ఇల వేల్పుగా బలిఐతివా
సిలువ శ్రమలు నాకై ఓర్చితివా..
1. దారి తెలియని దీన ప్రజలను – దరికి చేర్చి బ్రోచినావ /2/
కారుచీకటి తెరలు తొలిగే సిలువలో /2/
నుర్వి జనుల జీవజ్యోతిగా /సిలువ/
2. మానవాళిని ఆదరించిన – మాన్యుడా ఓ పూజ్యుడా /2/
అనవరతము తలతు నీదు సిలువను /2/
కన్నతండ్రివి నీవని /సిలువ/

Sad Good Friday Siluva Paatalu Telugu lo- 10

సిలువ చెంత చేరిన నాడు – కలుషములను కడిగివేయు2
పౌలు వలెను సీల వలెను2 – సిద్దపడిన భక్తులజూచి2
1. కొండలాంటి బండలాంటి- మొండి హృదయంబు మండిచును
పండి యున్న పాపులనైన – పిలచుచుండే పరముచేర2
2. వంద గొర్రెల మందలోనుండి – ఒకటి తప్పి ఒంటరి యాయె
తొ౦బది తొమ్మిది గొర్రెల విడచి 2- ఒంటరియైన గొర్రెను వెదకెన్2
3. తప్పిపోయిన కుమారు౦డు – తండ్రిని విడచి తరలిపోయె2
తప్పు తెలసి తిరిగి రాగా2 – తండ్రి యతని చెర్చుకొనెను 2
4. పాపి రావా పాపము విడచి – పరిశుద్దుల విందులో చేర2
పాపుల గతిని పరికించితివా 2- పాతాలంబే వారి అంతము2

What are LENT Days – LENT Season Meaning – Telugu

శ్రమల కాలం (Lent Days)
ఈ బుధవారంతో ఉపవాసకాలం మొదలవుతుంది. ఈ శ్రమల దినములను అందరూ ఆచరిస్తూ, ఎక్కువ సమయం ప్రార్ధనలో గడుపుతూ, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ, ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమల కాలం ఎంతో ఉపయోగపడును. ఈ రోజు మార్చి 1 మొదలుకొని ఈస్టర్ వరకు ఏప్రిల్ 14 వరకు గల ఈ 40 దినాలనే శ్రమల కాలం అంటారు. మధ్యలో గల ఆదివారాలు లెక్కించరు. ఇవి 40రోజులే ఎందుకు అంటే బైబిల్ లో 40 కి చాలా ప్రాముఖ్యత ఉంది.
▶ నోవహు కాలములో జలప్రళయం 40 దినాలు.
▶ మోషే దైవ సన్నిధిలో గడిపినది 40 దినాలు.
▶ ఏలీయా 40 రోజులు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడు.
▶ మోషే సినాయి కొండ మీద 40 రోజులు గడిపి 10 ఆజ్ఞలు పొందాడు.
▶ అరణ్య యాత్ర 40 సంవత్సరాలు.
▶ కనాను లో వేగులవారు పర్యవేక్షణ 40 దినాలు
▶ నినివే వారికీ హెచ్చరిక 40 దినాలు
▶ గోల్యాతును ఇశ్రాయేలీయులు ఎదుర్కొనినది 40 దినాలు.
▶ యేసుక్రీస్తు దేవుని పరిచర్యకు ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నారు.
📝 ఇందును బట్టి క్రీ.శ. 6వ శతాబ్దములో పోప్ ది గ్రేట్ గ్రెగరి (Gregory the Great) లెంట్ కాలమును క్రమపరచెను. మన ఆచారము ప్రకారము యేసు క్రీస్తు శ్రమల కాలము తరువాత సిలువ మరణం పొందలేదు. లెంట్ డేస్ తరువాత దేవుని పరిచర్య ప్రారంభించెను.
📝 Lent అను పదము Anglo-Saxon పదమైన Leneten నుండి పుట్టినది. Leneten అను పదానికి చీల్చు, పగులగొట్టు, చిగురించుటకు ఆరంభం, వసంతకాలం అను అర్ధాలు ఉన్నాయి. లెంట్ కాలము అనగా ఉపవాస కాలము అని అర్ధముగా చెప్పుకొనుచున్నాము.
📝 ఉపవాసకాలం అనుమాట సంస్కృత పదము నుండి పుట్టినది. ఇది రెండు ధాతువుల సమ్మేళనం. ఉప+వాసము. ఉప = తగ్గి, వాసము = నివాస స్థలము అనగా తగ్గి నివసించుట లేదా పస్తుండుట.
📝 భస్మము లేక బూడిద (Ash) అనునది అగ్నినుండి గాని యజ్ఞములో దహించబడిన జంతువు నుండి మిగిలిన అవశేషము బూడిద అంటారు. అబ్రాహాము సొదొమ, గొమొఱ్ఱ పట్టణములో నుండి లోతు కుటుంబమును రక్షించుటకు ప్రభువుతో మొర విడినది బూడిదయు ధూళిననునది అంటే తగ్గింపు జీవితమునకు గుర్తు.
📝 శ్రమ దుఃఖ విషయములకు బైబిల్ లో గోనెపట్ట కట్టుకొనుట, బూడిదలో కూర్చుండుట, బూడిద రాసుకొనుట, తలపై చల్లుకొనుట మొదలగునవి గుర్తుగా చెప్పబడినవి. “ప్రతిదినము దేవాలయములో అర్పింపబడు బలుల అవశేషము ప్రతి సాయంత్రము పట్టణము నుండి బయట పారవేయబడుదురు. ఇందుకు బూడిద వేయబడు లోయ కలదు (యిర్మీయా 31:40)
గోనె పట్ట కట్టుకొనిన కొందరు:
▶ నీనివే పట్టణస్థులు (యోనా 3:6)
▶ ఆహాబు (1రాజులు 21:27)
▶ బెన్హదుదు సేవకులు (1రాజులు20:32)
▶ ఇశ్రాయేలీయుల రాజు (2రాజులు 6:36)
▶ యాకోబు (ఆది 37:34)
▶ మొర్దెకై (ఎస్తేరు 4:1)
▶ దానియేలు (దానియేలు 9:2)
📝 లెంట్ లో ఉపవాసముండుట క్రైస్తవ సంఘానికి ఒక సవాలు.ఉపవాస కాలము తరువాత విశ్వాసికి నూతనోత్తేజము, నూతన బలము కలుగును. దేవునికి సమీపస్థులగుటకు ఇది ఒక మార్గము. నెసైయా (Nestia) అను గ్రీకు పదము నుండి ఉపవాసము అను అర్ధము వచ్చును. యూదా జనాంగము సోమవారం, గురువారం ఉపవాసము ఉందురు. పరిసయుడు వారమునకు రెండు పర్యాములు ఉపవాసము ఉందురు. ఈస్టర్ పండుగకు సిద్దబాటుగా ఉపవాసము ఉండు ఆచారము సనాథనముగా ఉండునట్లు తెలియచున్నది. దీని గురించిన ప్రస్తావన ఇరేబియాస్ (Irenaesus 97-202 AD) మరియు టెర్టుల్లియన్ ( Tertullian 186-220 ) అనువారు వ్రాసిన గ్రంధములలో ఈ విషయము కనిపించును.
బైబిల్ లో ఉపవాసము ఉన్న కొందఱు:
▶ యేసుప్రభువు (మత్తయి 4:2)
▶ నెహెమ్య (నెహె 1:4)
▶ ఎస్తేరు (ఎస్తేరు 4:15-17)
▶ మొర్దెకై. (ఎస్తేరు 4:16)
▶ నీనివే వారు (యోనా 3:5-10)
▶ దావీదు (2సమూ 12:16)
▶ దానియేలు (దాని 9:3)
ఉపవాసమనగా,
ఉ = ఉపేక్షించుకొని,
ప = పరీక్షించుకొని,
వా = వాక్య,
స = సందేశముతో,
ము = ముందుకు సాగుట.
ముగింపుగా లెంట్ కాలము సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఆత్మీయతకు దోహదపడు ఉపవాసకాలముగా మనం గుర్తించుచున్నాము. ప్రభువు మానవుడై మన రక్షణకై శ్రమపడిన విధమును జ్ఞాపకము చేసుకొని ఈ ప్రత్యేక దినమును మనము జ్ఞాపకము చెసుకొనుట మనకెంతో ఆశీర్వాదము. పరలోకానికి దారి సిలువ దగ్గరినుండే మొదలవుతుంది. సిలువను నామకర్ధముగా ధ్యానిస్తే దానిలో దాగి ఉన్న యేసయ్య ప్రేమను మనం చూడలేము. మనము ఆ శ్రమలను ఉపవాసము ద్వారా నలుగగొట్టబడి ప్రార్ధనతో ధ్యానిస్తే ఆ సిలువ విజయం మనం పొందగలం. అలా ఈ ఉపవాస కాలములోనైనా దేవునికి దగ్గర కావాలని, ప్రార్ధనతో సిద్ధబడాలి అని కోరుకుంటూ……..

source: FB Bible Mission Gooty

By your blood – Lent Days Songs

By Your blood I can enter the holiest place,

To the throne of my Father and King.

There I find Your acceptance, mercy and grace,

And my life is renewed again.

 

Far away from the stress and the turmoil of life,

I now come to seek Your face.

In the house of the Lord where Your presence is found,

I now come to worship You.

 

I see the King upon the throne,

Jesus, full of majesty.

I will fall down at Your feet,

I will worship You alone.

 

In the light of Your presence I find deepest joy,

There is no other place I would be.

To behold Your beauty is all my desire,

You’re the one my heart longs for,

You’re the one my heart longs for.

దేవుని నామములు-1 Names Of God యెహోవా దేవుని నామములు

ఏల్ బేతేల్ – బేతేలు దేవుడు – దేవుని నివాసము యొక్క ప్రభువు – El Bethel – The God of the House of God (ఆది 35:7)

ఎలోహీ కాసెద్ది – కృపగల నా దేవుడు – Elohe Chaseddiy – God of Mercy (కీర్త 59:10)

ఏల్ ఎలోహీ ఇశ్రా ఏల్ – ఇశ్రాయేలు దేవుడగు దేవుడు –  ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవునికి, ఇశ్రాయేలు దేవుడైన ఏలోహీమ్, ఇశ్రాయేలు బలవంతుడైన దేవుడు, ఇశ్రాయేలు దేవుని శక్తి, ఇశ్రాయేలు దేవుడు (ఏలోహీమ్) ఆయనే.

 

El Elohe Yisra’el – God, the God of Israel (ఆది 33:20; కీర్త 68:8)
ఏల్ ఎలియోన్ – సర్వోన్నతుడగు దేవుడు – El Elyon – The Most High God (ఆది 14:18)

ఏల్ ఎమునః – నమ్మదగిన దేవుడు – El Emunah – A Faithful God (ద్వితీ 7:9)

ఏల్ గిబ్బార్ – బలవంతుడైన దేవుడు – El Gibbor – The Mighty God (యెష 9:6) 

ఏల్ హకబోద్ – మహిమగల దేవుడు – El Hakabodh – The God of Glory (కీర్త 29:3)

ఏల్ హయ్యయే – నా జీవదాతయైన దేవుడు – El Hayyay – God of My Life (కీర్త 42:8)

ఏల్ హీ – జీవముగల దేవుడు – El He – The Living God (యెహో 3:10)

ఏల్ కానా – రోషముగల దేవుడు – El Kana – A Jealous God (నిర్గ 20:5)

ఏలోహీమ్ కెదోషిం – పరిశుద్ధ దేవుడు – Elohim Kedoshim – A Holy God (యెహో 24:19)

ఏల్ కెన్నో – రోషముగల దేవుడు – El Kenno’ – A Jealous God (యెహో 24:19)

ఎలోహీ మ ఒజీ – నాకు దుర్గమైన దేవుడు – Elohe Ma’ozi – God of My Strength (కీర్త 43:2)

ఎలోహీ మకాసే లాను – నా ఆశ్రయము దేవుడే – Elohim Machaseh Lanu – God Our Refuge (కీర్త 62:8)

ఎలి మలేఖి – నా రాజగు దేవుడు – Eli Malekhi – God of My King (కీర్త 2:6)

ఏల్ మరోమ్ – మహోన్నతుడైన దేవుడు – El Marom – God Most High (కీర్త 57:2)

ఏల్ నమకోత్ – ప్రతిదండన చేయు దేవుడు – El Nakamoth – God That Avengeth (కీర్త 18:47)

ఏల్ నోసె – పాపము పరిహరించు దేవుడు – El Nose’ – God That Forgave (కీర్త 99:8)

ఎలోహెను ఒలామ్ – సదాకాలము మనకు దేవుడు – Elohenu ‘Olam – The Everlasting God (కీర్త 48:14)

ఎలోహీ ఓజెర్ లి – దేవుడే నాకు సహాయకుడు – Elohim ‘Ozer Li – God My Helper (కీర్త 54:4)

ఏల్ రా’ యి – నన్ను చూచుచున్న దేవుడు – El Ra’i – Thou God Seest Me (ఆది 16:13)

ఏల్ సెల – నా ఆశ్రయ దుర్గమైన దేవుడు – El Sela – God, My Rock (కీర్త 42:9)

ఏల్ షద్దాయ్ – సర్వశక్తిగల దేవుడు – El Shaddai – The Almighty God (ఆది 17:1,2)

ఏల్ సిమ్కాత్ గిల్ – ఆనంద సంతోషములు కలుగజేయు దేవుడు – El Simchath Gill – God My Exceeding Joy (కీర్త 43:4)

ఏలోహీమ్ త్సెబావోత్ – సైన్యములకు అధిపతియగు దేవుడు – Elohim Tsebaoth – God of Hosts (కీర్త 80:7)

ఎలోహీ తిషు’అతి – నా రక్షణ కర్తయైన దేవుడు – Elohi Tishu’athi – God of My Salvation (కీర్త 18:46; 51:14)

ఎలోహీ త్సదేకి – నా నీతికి ఆధారమగు దేవుడు – Elohe Tsadeki – God of My Righteousness (కీర్త 4:1)

ఎలోహీ యా’కోబ్ – యాకోబు దేవుడు – Elohe Yaa’kob – God of Jacob (కీర్త 20:1; 46:7)

ఎలోహీ ఇశ్రా’ ఏల్ – ఇశ్రాయేలు దేవుడు – Elohe Yisra’el – God of Israel (కీర్త 59:5)

ఏలోహీమ్ బాషామయి – ఆకాశమందు దేవుడు Elohim Bashamayi – God in Heaven (యెహో 2:11)

యెహోవా దేవుని నామములు

యెహోవా – నేను యెహోవాను -Jehovah (Yahweh or Yehovah) – The LORD (నిర్గ 6:29)

అదోనాయ్ యెహోవా – ప్రభువైన యెహోవా – Adonai Jehovah (Yahweh or Yehovah) – The LORD God (ఆది 15:2) సర్వాధికారియైన ప్రభువు (Sovereign-Lord)

యెహోవా ఆదోన్ కల్ హారెట్స్ – సర్వలోక నాధుడగు యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Adon Kal Haarets – The LORD, The Lord of All the Earth (యెహో 3:13)

యెహోవా బానా – సృజించిన యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Bana – The LORD Creator (యెష 40:28)

యెహోవా కాత్సహి – యెహోవా నా ప్రాణదుర్గము – Jehovah (Yahweh or Yehovah) Chatsahi – The LORD My Strength (కీర్త 27:1)

యెహోవా కెరాబ్ – యెహోవా .. ఔన్నత్యము కలిగించు ఖడ్గము – Jehovah (Yahweh or Yehovah) Cherab – The LORD .. The Sword (ద్వితీ 33:29)

యెహోవా ఎలీ – యెహోవా నా దేవుడు – Jehovah (Yahweh or Yehovah) Eli – The LORD My God (కీర్త 18:2)

యెహోవా ఏల్యాన్ – యెహోవా మహోన్నతుడు – Jehovah (Yahweh or Yehovah) Elyon – The LORD Most High (కీర్త 38:2)

యెహోవా ఎజ్’లమీ – యెహోవా నా ఆశ్రయము – Jehovah (Yahweh or Yehovah) ‘Ez Lami – The LORD My Strength (కీర్త 28:7)

యెహోవా గదోర్ మిల్కానియా – యుద్ధ శూరుడైన యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Gador Milchaniah – The LORD Mighty in Battle (కీర్త 24:8)

యెహోవా గనాన్ – మా కేడెము యెహోవా వశము – Jehovah (Yahweh or Yehovah) Ganan – The LORD Our Defence (కీర్త 89:18)

యెహోవా గో’ఏల్ – యెహోవా నా విమోచకుడు – Jehovah (Yahweh or Yehovah) Go’el – The LORD My Redeemer (యెష 49:6; 60:16)

యెహోవా హాషోపెట్ – న్యాయాధిపతియైన యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Hashopet – The LORD The Judge (న్యాయా 11:27)

యెహోవా హోషే యాహ్ – రక్షణార్ధమైన యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Hoshe’ah – The LORD Save (కీర్త 20:9)

యెహోవా ‘ఇమ్మెకు – యెహోవా నీకు తోడైయున్నాడు – Jehovah (Yahweh or Yehovah) ‘Immeku – The LORD is with you  (న్యాయా 6:12)

యెహోవా ఇజోజ్ హకబోత్ – బలశౌర్యములు గల యెహోవా –  Jehovah (Yahweh or Yehovah) Izoz Hakaboth – The LORD Strong and Mighty (కీర్త 24:8)

యెహోవా జీరే – యెహోవా యీరే – యెహోవా చూచుకొనును, యెహోవా వీక్షించును, యెహోవా అనుగ్రహించును – Jehovah (Yahweh or Yehovah) Jireh – The LORD will provide (ఆది 22:14) 

యెహోవా కబోధి – యెహోవా నీవే నాకు అతిశయాస్పదము – Jehovah (Yahweh or Yehovah) Kabodhi – The LORD My Glory (కీర్త 3:3)

యెహోవా కన్నా – ఆయన నామము రోషముగల యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Kanna – The LORD whose name is Jealous (నిర్గ:34:14)

యెహోవా కరేన్ యిషి – యెహోవా నా రక్షణ శృంగము – Jehovah (Yahweh or Yehovah) Karen Yishi – The LORD The Horn of My Salvation (కీర్త 18:2)

యెహోవా మక్సి – యెహోవా మా ఆశ్రయము – Jehovah (Yahweh or Yehovah) Machsi – The LORD My Refuge (కీర్త 91:9)

యెహోవా మగేన్ – యెహోవా నీకు సహాయకరమైన కేడెము – Jehovah (Yahweh or Yehovah) Magen – The LORD of the Shield (ద్వితీ 33:29)  

యెహోవా మా’ఓజ్ – యెహోవా నా ఆశ్రయ దుర్గము – Jehovah (Yahweh or Yehovah) Ma’oz – The LORD  My Fortess (యిర్మి 16:19)

హమాలేక్ యెహోవా – రాజైన యెహోవా – Hamelech Jehovah (Yahweh or Yehovah) – The LORD the King (కీర్త 98:6)

యెహోవా మెలేక్ ఒలాం – యెహోవా నిరంతరము రాజు – Jehovah (Yahweh or Yehovah) Melech ‘Olam – The LORD King for Ever (కీర్త 10:16)

యెహోవా మేఫాల్ద్ – యెహోవా నన్ను రక్షించువాడు – Jehovah (Yahweh or Yehovah) Mephald – The LORD My Deliverer (కీర్త 18:2)

[యెహోవా మెగద్దిషెం – Jehovah (Yahweh or Yehovah) Megaddishcem – The LORD Our Sanctifier – మమ్మును పరిశుద్ధపరచు యెహోవా (నిర్గ 31:13)

యెహోవా మెత్సోదాంతి – యెహోవా నా కోట – Jehovah (Yahweh or Yehovah) Metsodhanthi – The LORD .. My Fortess (కీర్త 18:2)

యెహోవా మిస్కబ్బి – యెహోవా నా ఉన్నత దుర్గము – Jehovah (Yahweh or Yehovah) Misqabbi – The LORD My High Tower (కీర్త 18:2)

యెహోవా నహెహ్ – మొత్తువాడనగు యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Naheh – The LORD that Smiteth (యెహె 7:9)

యెహోవా నిస్సీ (ధ్వజము) – Jehovah (Yahweh or Yehovah) Nissi – యెహోవాయే నా పతాకము, యెహోవా నా స్పష్టమైన చిహ్నము, యెహోవాయే నాకు బుద్ధిచెప్పువాడు. The LORD Our Banner (నిర్గ 17:15)

The Apostles’ Creed – in Hindi Punjabi English Italian

The Apostles’ Creed In English 

English (Original):
“I believe in God, the Father Almighty,
Maker of heaven and earth;
And in Jesus Christ, His only Son, our Lord;
Who was conceived by the Holy Spirit,
Born of the virgin Mary,
Suffered under Pontius Pilate,
Was crucified, dead, and buried;
He descended to hell;
The third day He rose again from the dead;
He ascended into heaven,
And sitteth on the right hand of God the Father Almighty;
From thence He shall come to judge the quick and the dead.
I believe in the Holy Spirit;
The holy catholic Church;
The communion of saints;
The forgiveness of sins;
The resurrection of the body;
And the life everlasting. Amen.”

The Apostles’ Creed In  Hindi:

“मैं ईश्वर में विश्वास करता/करती हूँ, पिता, सर्वशक्तिमान,
आकाश और पृथ्वी के निर्माता;
और यीशु मसीह, उसके एकमात्र पुत्र, हमारे प्रभु;
जिनका ध्यान, पवित्र आत्मा के द्वारा धारण किया गया था,
जो पवित्र माता मरीयम से उत्पन्न हुआ था,
पॉंटियस पिलेट के अधीन परिश्रमी का समापन हुआ,
वही था, जिसने सिर पर बोझ कसा और बुराई में मर गया;
वह दूसरे दिन मृत्यु से फिर जीवित हो गया;
उसने स्वर्ग में प्रवेश किया,
और सर्वशक्तिमान ईश्वर के दाहिने हाथ पर बैठा हुआ है;
वहां से वह जीवों और मृतकों की न्याय करने आएगा।
मैं पवित्र आत्मा में,
पवित्र कैथोलिक चर्च में,
संतों के संगठन में,
पापों के क्षमा करने में,
शरीर के पुनरुत्थान में,
और अनंत जीवन में विश्वास करता/करती हूँ। आमीन।”

The Apostles’ Creed In Punjabi:

“ਮੈਂ ਰੱਬ ‘ਚ ਆਪਣਾ ਵਿਸ਼ਵਾਸ ਰੱਖਦਾ/ਰੱਖਦੀ ਹਾਂ, ਪਿਤਾ, ਸਰਬ-ਸ਼ਕਤੀਮਾਨ,
ਆਕਾਸ ਅਤੇ ਧਰਤੀ ਦੇ ਸੰਰਚਨਹਾਰ;
ਅਤੇ ਯੀਸੂ ਕਰਿਸਤ ਨੂੰ, ਉਸਦਾ ਇੱਕ ਹੀ ਪੁੱਤਰ, ਸਾਡੇ ਪ੍ਰਭੂ;
ਜਿਸਨੂੰ ਪਵਿੱਤਰ ਆਤਮਾ ਦੇ ਦੁਆਰਾ ਜਨਮ ਲਿਆ ਗਿਆ ਸੀ,
ਜੋ ਪਵਿੱਤਰ ਬੀਬੀ ਮਰੀਆਮ ਤੋਂ ਪੈਦਾ ਹੋਇਆ ਸੀ,
ਪੌਂਟੀਅਸ ਪਿਲੇਟ ਦੇ ਅਧੀਨ ਸੁਤਾਇਆ ਗਿਆ ਸੀ,
ਵਿਚੋਂ ਉਸਨੇ ਕ੍ਰੁਸਿ ਉੱਤੇ ਕੇਢੀ ਮੜ੍ਹ ਲਈ ਸੀ,
ਵੱਡੀ ਸਜਾ ਸਾਹਮਣੇ ਆਈ ਸੀ;
ਉਹ ਪਾਤਾਲ ਵਿੱਚ ਗਿਆ ਸੀ;
ਤੀਸਰੇ ਦਿਨ ਉਸ ਨੇ ਮੌਤ ਤੋਂ ਜਿੰਦਾ ਹੋਣਾ ਸ਼ੁਰੂ ਕੀਤਾ;
ਉਸਨੇ ਸਵਰਗ ਵਿੱਚ ਚੜਨਾ ਸੀ,
ਅਤੇ ਸਰਬ-ਸ਼ਕਤੀਮਾਨ ਰੱਬ ਦੇ ਦੱਹਿਣੇ ਹੱਥ ਤੇ ਬੈਠਿਆ ਹੋਇਆ ਸੀ;
ਓਥੇ ਤੋਂ ਉਸ ਨੇ ਜ਼ਿੰਦਗੀ ਅਤੇ ਮੌਤ ਦੇ ਜੀਵ ਅਤੇ ਮ੍ਰਿਤਕ ਦੀ ਨਿਆਂਬ ਕਰਨ ਲਈ ਆਉਣਾ ਹੈ।
ਮੈਂ ਪਵਿੱਤਰ ਆਤਮਾ ਵਿੱਚ ਵਿਸ਼ਵਾਸ ਰੱਖਦਾ/ਰੱਖਦੀ ਹਾਂ,
ਪਵਿੱਤਰ ਕੈਥੋਲਿਕ ਗਿਰਜਾ,
ਸੰਤਾਂ ਦੀ ਸੰਗਤ;
ਗੁਨਾਹਾਂ ਦੀ ਕਿਰਪਾ;
ਸਰੀਰ ਦੀ ਦੁਬਾਰਾ ਜੀਵਨ;
ਅਤੇ ਅਨੰਤ ਜੀਵਨ ‘ਚ ਵਿਸ਼ਵਾਸ ਰੱਖਦਾ/ਰੱਖਦੀ ਹਾਂ। ਆਮੀਨ।”

The Apostles’ Creed In Italian:

“Credo in Dio, Padre onnipotente,
creatore del cielo e della terra;
e in Gesù Cristo, suo unico Figlio, nostro Signore;
concepito di Spirito Santo,
nato da Maria Vergine,
patito sotto Ponzio Pilato,
fu crocifisso, morì e fu sepolto;
discese agli inferi;
il terzo giorno risuscitò da morte;
salì al cielo,
siede alla destra di Dio Padre onnipotente;
di là verrà a giudicare i vivi e i morti.
Credo nello Spirito Santo;
la santa Chiesa cattolica;
la comunione dei santi;
la remissione dei peccati;
la risurrezione della carne;
la vita eterna. Amen.”

The Apostles’ Creed in Malayalam + Nicene Creed in Malayalam

Apostles creed in malayalamApostles creed in malayalam Nicene creed

The Apostles’ Creed in Malayalam (Vishwaasa Pramaannam)
വിശ്വാസപ്രമാണം – The Apostles’ Creed

സര്‍വ്വശക്തനായ പിതാവും ആകാശത്തിന്‍റെയും ഭൂമിയുടെയും സ്രഷ്ടാവുമായ ദൈവത്തില്‍ ഞാന്‍ വിശ്വസിക്കുന്നു .അവിടുത്തെ ഏകപുത്രനും ഞങ്ങളുടെ കര്‍ത്താവുമായ ഈശോ മിശിഹായിലും ഞാന്‍ വിശ്വസിക്കുന്നു .ഈ പുത്രന്‍ പരിശുദ്ധാത്മാവാല്‍ ഗര്‍ഭസ്ഥനായി കന്യാമറിയത്തില്‍ നിന്നു പിറന്നു .പന്തിയോസ് പീലാത്തോസിന്‍റെ കാലത്ത് പീഡകള്‍ സഹിച്ച് ,കുരിശില്‍ തറയ്ക്കപ്പെട്ട് ,മരിച്ച് അടക്കപ്പെട്ടു ;പാതാളത്തില്‍ ഇറങ്ങി ,മരിച്ചവരുടെ ഇടയില്‍നിന്നു മൂന്നാം നാള്‍ ഉയിര്‍ത്തു ;സ്വര്‍ഗ്ഗത്തിലെക്കെഴുന്നള്ളി ,സര്‍വ്വശക്തിയുള്ള പിതാവായ ദൈവത്തിന്‍റെ വലതു ഭാഗത്ത് ഇരിക്കുന്നു ;അവിടെനിന്ന് ജീവിക്കുന്നവരെയും മരിച്ചവരെയും വിധിക്കാന്‍ വരുമെന്നും ഞാന്‍ വിശ്വസിക്കുന്നു .പരിശുദ്ധാത്മാവിലും ഞാന്‍ വിശ്വസിക്കുന്നു .വിശുദ്ധ കത്തോലിക്കാ സഭയിലും ,പുണ്യവാന്മാരുടെ ഐക്യത്തിലും ,പാപങ്ങളുടെ മോചനത്തിലും ,ശരീരത്തിന്‍റെ ഉയിര്‍പ്പിലും നിത്യമായ ജീവതത്തിലും ഞാന്‍ വിശ്വസിക്കുന്നു . ആമ്മേന്‍ .

Sarvashakthanaaya pithaavum, aakaashathinteyum bhoomiyudeyum Srushtaavumaaya eka daivatthil njan vishwasikkunnu.
Aviduthe ekaputhranum, njangalude karthaavumaaya eesho mishihaayilum njan vishvasikkunnu.
Ee puthran parisudhaathmaavinaal garbhasthanaayi, kanyakaa mariyatthil ninnu pirannu.
Panthiyos Pilaathosinte kaalathu peedakal sahichu, kurishil tharakkappettu, marichu, adakkappettu, paathaalangalil irangi.
Marichavarude idayil ninnum moonnaam naal uyarthu.
Swargathilekku ezhunnalli. Sarvashakthiyulla Pithavinte valathu bhaagathu irikkunnu.
Avidunne jeevikkunnavareyum marichavareyum vidhikkuvaan varumennum njan viswasikkunnu.
Parishudhaathmaavilum njan vishwasikkunnu.
Vishudha katholikkaa sabhayilum, punyavaanmaarude aikkyathilum,
Paapangalude mochanatthilum,
Shareeratthinte uyirppilum,
Nithyamaaya jeevithatthilum njan viswasikkunnu. Aamen.

Nicene Creed in Malayalam

നിഖ്യാ വിശ്വാസപ്രമാണം

സർവ്വശക്തനും പിതാവുമായ ഏക ദൈവത്തിൽ ഞങ്ങൾ വിശ്വസിക്കുന്നു

ദൃശ്യവും അദൃശ്യവുമായ സകലത്തിന്‍റെയും സ്രഷ്ടാവിൽ ഞങ്ങൾ വിശ്വസിക്കുന്നു. ദൈവത്തിന്‍റെ ഏക പുത്രനും സകല സൃഷ്ടികൾക്കുമുമ്പുള്ള ആദ്യജാതനും യുഗങ്ങൾക്കെല്ലാംമുൻപ് പിതാവിൽനിന്നും ജനിച്ചവനും, എന്നാൽ സൃഷ്ടിക്കപെടാത്തവനും, ഏക കർത്താവുമായ ഈശോമിശിഹായിൽ ഞങ്ങൾ വിശ്വസിക്കുന്നു. അവിടുന്നു സത്യദൈവത്തിൽ നിന്നുള്ള സത്യദൈവവും, പിതാവിനോടുകൂടെയുള്ള ഏക സത്തയുമാകുന്നു. അവിടുന്നു വഴി പ്രപഞ്ചം സംവിധാനം ചെയ്യപ്പെടുകയും, എല്ലാം സൃഷ്ടിക്കപ്പെടുകയും ചെയ്തു. മനുഷ്യരായ നമ്മുക്കുവേണ്ടിയും, നമ്മുടെ രക്ഷക്കുവേണ്ടിയും, അവിടുന്നു സ്വർഗത്തിൽ നിന്നിറങ്ങി, പരിശുദ്ധാത്മാവിനാൽ കന്യകാമറിയത്തിൽ നിന്നു ശരീരം സ്വീകരിച്ചു മനുഷ്യനായി പിറന്നു. പന്തിയോസ് പീലാത്തോസിന്റെ കാലത്തു, പീഡകൾ സഹിക്കുകയും, സ്ലീവായിൽ തറക്കപ്പെട്ടുമരിക്കുകയും, സംസ്ക്കരിക്കപ്പെടുകയും, എഴുതപ്പെട്ടിരിക്കുന്നപോലെ മൂന്നാം ദിവസം ഉയർത്തെഴുന്നേൽക്കുകയും ചെയ്‌തു. അവിടുന്നു സ്വർഗത്തിലേക്ക് എഴുന്നുള്ളി, പിതാവിന്‍റെ വലതുഭാഗത്തിരിക്കുന്നു. മരിച്ചവരെയും ജീവിക്കുന്നവരെയും വിധിക്കുവാൻ, അവിടുന്നു വീണ്ടും വരുവാനിരിക്കുന്നു. പിതാവിൽനിന്നും – പുത്രനിൽനിന്നും – പുറപ്പെടുന്ന സത്യാത്മാവും ജീവദാതാവുമായ ഏക പരിശുദ്ധാത്മാവിലും ഞങ്ങൾ വിശ്വസിക്കുന്നു. ഏകവും പരിശുദ്ധവും ശ്ലൈഹികവും സർവ്വത്രികവുമായ സഭയിലും ഞങ്ങൾ വിശ്വസിക്കുന്നു . പാപമോചനത്തിനുള്ള ഏക മാമ്മോദിസായും ശരീരത്തിന്‍റെ ഉയിർപ്പും നിത്യായുസ്സും ഞങ്ങള്‍ ഏറ്റുപറയുകയും ചെയ്യുന്നു. ആമ്മേൻ.

Jesus Bible Quotes Images in Telugu for Sick HOPE & Dying -1

Jesus bible quotes images in telugu for sick and dying

Hello brothers and sisters in Jesus Christ. Praise the Lord. We wish you a  speedy  recovery

ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి ఆదరణ వాక్యాలు ఎంతో అవసరం మన దేవుడు మన కోసం ఉన్నాడని మనము నమ్మి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకుని ఈ కఠిన పరిస్థితులను నుంచి బయట పడదాం మన రక్తసంబంధులు, మన ఇంటి వారు, మన స్నేహితులు, మనకి తెలిసిన వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఎంతో కృంగి పోతాం మనం కృంగిపోకుండా దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని పోరాడే గెలిపిద్దాం గెలుద్దాం

యాకోబు 5:14

మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు, ప్రభువు నామమున అతనికి నూనె రాచి, అతని కొరకు ప్రార్థన చేయవలెను.

Jesus bible quotes images in telugu for sick and dying

మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు, ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన, మనఃపూర్వకమైనదై, బహు బలము గలదై యుండును.

 

 

Aadarana Bible vaakyaalu Telugu for hope

యాకోబు 5:13

మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.

 

యాకోబు 5:15

విశ్వాస సహితమైన ప్రార్థన, ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసినవాడైతే, పాప క్షమాపణ నొందును.

యాకోబు 5:16

bible quotes images in telugu for sick

James 5:16

16 Therefore confess your sins to each other and pray for each other so that you may be healed. The prayer of a righteous person is powerful and effective.

Holy Bible Verses Telugu on healing hope

 

James 5:13

Is anyone among you in trouble? Let them pray. Is anyone happy? Let them sing songs of praise.

James 5:14

Is anyone among you sick? Let them call the elders of the church to pray over them and anoint them with oil in the name of the Lord.

James 5:15

And the prayer offered in faith will make the sick person well; the Lord will raise them up. If they have sinned, they will be forgiven.

నైసియా విశ్వాస సూత్రము (Nicene Creed) & అపోస్తలుల విశ్వాస సూత్రము

THE NICENE Apostles CREED in English & Telugu

THE NICENE CREED IN TELUGU

నైసియా విశ్వాస సూత్రము (Nicene Creed):
పరలోక భూలోకములకును, దృశ్యాదృశ్యములైన అన్నిటికిని సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రియైన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
2 ఆయన అన్ని లోకములకన్న ముందు, తన తండ్రినుండి జన్మించినవాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైనదేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించినవాడును, తండ్రితో ఏకత్వము గలవాడునైయున్నాడు.
3 సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును, మన రక్షణ కొరకును, పరలోకమునుండి దిగివచ్చి, పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియయందు శరీరధారియై, మనుష్యుడాయెను. ఆయన మనకొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను.
4 ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి, పరలోకమునకెక్కి, తండ్రి కుడిచేతివైపున కూర్చుండియున్నాడు. ఆయన సజీవులకును, మృతులకును తీర్పుతీర్చుటకు మహిమతో తిరిగివచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను.
5 ఆయన ప్రభువును, జీవమిచ్చువాడును, తండ్రి నుండియు కుమారునినుండియు, బయలుదేరువాడును, తండ్రితోను, కుమారునితోను కూడ ఆరాధింపబడి, మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికినవాడునై యున్నాడు.
6 మరియు సార్వత్రికమును, అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాపవిమోచనము కొరకైన ఒక్కటే బాప్తీస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్ధానము కొరకును, రాబోవు యుగము యొక్క జీవము కొరకును ఎదురుచూచుచున్నాను. ఆమేన్.

THE NICENE Apostles CREED in English & Telugu

THE NICENE CREED in English & Telugu

I believe in one God, the Father almighty, maker of heaven and earth and of all things visible and
invisible.
And in one Lord Jesus Christ, the only-begotten Son of God, begotten of the Father before all ages, God
of God, Light of Light, very God of very God, begotten not made, being of one substance with the Father,
through Whom all things were made: Who for us men and for our salvation came down from heaven, was
incarnate by the Holy Spirit of the virgin Mary, and was made man: Who for us, too, was crucified under
Pontius Pilate, suffered, and was buried: the third day He rose according to the Scriptures, ascended into
heaven, and is seated on the right hand of the Father: He shall come again with glory to judge the living
and the dead, and His kingdom shall have no end.
And in the Holy Spirit, the Lord and Giver of life, Who proceeds from the Father and the Son: Who
together with the Father and the Son is worshiped and glorified: Who spoke by the prophets.
And I believe one holy, Christian, and apostolic Church.
I acknowledge one baptism for the remission of sins, and I look for the resurrection of the dead and life of
the age to come.
Amen.

THE APOSTLES CREED IN TELUGU

అపోస్తలుల విశ్వాస సూత్రము:
1 పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును, మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
2 ఈయన పరిశుద్ధాత్మ వలన, కన్యయగు మరియ గర్భమున ధరింపబడి, ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి, సిలువ వేయబడి, చనిపోయి, పాతిపెట్టబడి, అదృశ్య లోకములోనికి దిగెను.
3 మూడవ దినమున తిరిగి లేచి, పరలోకమునకెక్కి, సర్వశక్తిగల తండ్రియైన దేవుని కుడిచేతి వైపున కూర్చుండియున్నాడు. సజీవులకును, మృతులకును తీర్పుతీర్చుటకు అక్కడనుండి ఆయన వచ్చును.
4 పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, పునరుత్ధానమును, నిత్యజీవమును నమ్ముచున్నాను. ఆమేన్.

THE APOSTLES CREED in English

I believe in God the Father Almighty, Maker of heaven and earth.
And in Jesus Christ, His only Son, our Lord; Who was conceived by the Holy Spirit; Born of the Virgin
Mary; Suffered under Pontius Pilate; Was crucified, dead and buried; He descended into Hell; The third
day He rose again from the dead; He ascended into heaven; And sitteth on the right hand of God the
Father Almighty; From thence He shall come to judge the living and the dead.
I believe in the Holy Spirit; The Holy Christian Church, the Communion of Saints; The Forgiveness of
sins; The Resurrection of the body; And the life everlasting. Amen.

Matalleni Pustakanni- Christian Color Book Song for Kids

Matalleni Pustakanni- Christian Song for Kids

Matalleni Pustakanni English Lyrics – EVERGREEN SONG FOR KIDS

Maatalleni pusthakaanni maruvakandi pillalu
Manasaara dhyaaninchudi rangulalona nannu

Hrudaya shuddi galawaare devuni chuchedaru

Bangaaram paralokamunaku guruthu
Pillallantivaaridhe paralokamane prabhuvu

Telupu parishuddhataku guruthu

Nalupu papqmunakuguruthu
Paapamunaaku jeethamu maranamu jqgartha

Aakupacha edugudalaku guruthu
Vaakyamu dhyaqninchi edugudaamu raarandi

Yerupu yesurakthamu guruth
Prathi papamu nundi pavithruluga cheyunu

Matalleni Pustakanni- Christian Song for Kids

Matalleni Pustakanni Telugu Lyrics

మాటల్లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు
మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను

బంగారం పరలోకమునకు గురుతు
పిల్లల్లాంటివారిదే పరలోకమనే ప్రభువు

తెలుపు పరిశుద్ధతకు గురుతు
హృదయ శుద్ధి గలవాఁరే దేవుని చూచెదరు

నలుపు పాప్క్మునకుగురుతు
పాపమునకు జీతము మరణము జెక్గర్థ

ఆకుపచ్చ ఎదుగుదలకు గురుతు
వాక్యము ధ్యక్నించి ఎదుగుదాము రారండి

ఎరుపు యేసురక్తము గురుత్
ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును

 

తెలుగు క్రైస్తవ పిల్లల పాటలు . చాలా లోతైన మరియు మంచి పాTA. ఇది మీ పిల్లలు ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మంచి పాటలు కోసం మా వెబ్ సైట్ ను చూస్తూ ఉండండి.

Easter Verses in Telugu- Punarudhaana Dinamu Resurruction Day

అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు, చనిపోయినను బ్రదుకును. బ్రదికి, నాయందు విశ్వాసముంచు ప్రతివాడును, ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. యోహాను సువార్త 11:26

 

1 Corinthians 15:21
1 కొరింథీయులకు 15:21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక, మనుష్యుని ద్వారానే, మృతుల పునరుత్థానమును కలిగెను.

 

అపోస్తలుల కార్యములు 4 33 ఇదియు గాక, అపొస్తలులు బహు బలముగా, ప్రభువైన యేసు (కొన్ని ప్రాచీన ప్రతులలో క్రీస్తు అని కూర్చబడియున్నది) పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.

ఫిలిప్పీయులకు 3 10 ఏ విధము చేతనైనను, మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును, ఎరుగు నిమిత్తమును,
1 పేతురు 1 4 మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన, జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున, మనలను మరల జన్మింపజేసెను.
రోమీయులకు 8 34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును, ఆయనే. {రోమా 5:8-11; హెబ్రీ 7:25}
రోమీయులకు 10 9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు, మృతులలోనుండి ఆయనను లేపెనని, నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
1 థెస్సలొనీకయులకు 4 14 యేసు, మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము, యేసునందు నిద్రించిన వారిని, దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. {అ కా 7:59,60; రోమా 8:11; 1 కొరిం 15:20-23}

లూకా సువార్త 24 6 ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు. ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు,
లూకా సువార్త 24 7 మనుష్య కుమారుడు, పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని, ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని, వారితో అనిరి. {లూకా 9:22}
రోమీయులకు 6 9 మరణమునకు ఇకను, ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని, నమ్ముచున్నాము.
రోమీయులకు 6 8 మనము క్రీస్తుతో కూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు, ఇకను చనిపోడనియు, {గల 2:20; 2 తిమో 2:11}
రోమీయులకు 6 9 మరణమునకు ఇకను, ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని, నమ్ముచున్నాము.
రోమీయులకు 6 10 ఏలయనగా, ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని, ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు.
రోమీయులకు 6 11 అటువలె మీరును, పాపము విషయమై మృతులు గాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులు గాను, మిమ్మును మీరే యెంచుకొనుడి.

Best Telugu Easter Songs Lyrics PDF – List -PPT

పల్లవి: గగనము చీల్చుకొని – యేసు ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి – వేగమె రానుండె
1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో /గగ/
2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను
కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో /గగనము/
3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు /గగనము/

గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము
యేసురాజు లేచెను – హల్లెలుయా – జయ మర్భాటించెదము#2#గీతం#

1. చూడు సమాధిని మూసిన రాయి – దొరలుచు పోరలిడెను
అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు #2#గీతం#

2. వలదు వలదు ఏడువవలదు – వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి#2#గీతం#

3. అన్న కయప వారల సభయును – ఆదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి#2#గీతం#

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయవీరుడు రాగా
మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి #2#గీతం#

 

లేచినాడురా సమాధి గెలిచినాడురా – యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా
అ.ప. లేతునని తా జెప్పినట్టు – లేఖనములలో పలికినట్టు /లేచి/
1. భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న
2. ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి
భళిర దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు
3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ
4. చూడవెళ్లిన స్త్రీలను దూత – చూచి యపుడే వారితోడ
లేడు గలలియ ముందుగ పోతున్నాడు – అపుడె లేచినాడని
5. చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు – చావు అంటే భయపడరాదు
6. నేను చేసే పనులనెరుగు – నేను నడిచే మార్గమెరుగు
నేను చేప్పు మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకు నెరుగు
7. నేను లేచిన యేసునందు – మానక మది నమ్ముకొందు – తాను
నాలోయుండినందున – దయను జేర్చు మోక్షమందు
8. పాపభారము లేదు మనకు – మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు – మరువకండి యేసు ప్రభుని
9. యేసు నందే రక్షణ భాగ్యం – యేసు నందే నిత్య జీవం
యేసు నందే ఆత్మ శాంతి – యేసు నందే మోక్ష భాగ్యం
10. పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు
పాపులను ప్రేమించానాడు – ప్రాణదానము చేసినాడు

1.క్రీస్తు నేడు లేచెను
ఆ ఆ ఆ హల్లెలూయ
మర్త్య దూత సంఘమా
ఆ ఆ ఆ హల్లెలూయ
భూమి నాకసంబులో
ఆ ఆ ఆ హల్లెలూయ
బాడుమిందు చేతను ​
ఆ ఆ ఆ హల్లెలూయ
​ 2. మోక్షమియ్య నాధుడు ​
ఆ ఆ ఆ హల్లెలూయ
యుద్ధమాడి గెల్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ ​
సూర్యుడుద్భవింపగ
ఆ ఆ ఆ హల్లెలూయ ​
​చీకటుల్ గతియించెను
ఆ ఆ ఆ హల్లెలూయ ​
3. బండ, ముద్ర, కావలి
ఆ ఆ ఆ హల్లెలూయ
అన్ని వ్యర్ధమైనవి
ఆ ఆ ఆ హల్లెలూయ​
యేసు నరకంబును
ఆ ఆ ఆ హల్లెలూయ
గెల్చి ముక్తి దెచ్చెను ​
ఆ ఆ ఆ హల్లెలూయ
4. క్రీస్తు లేచినప్పుడు
ఆ ఆ ఆ హల్లెలూయ
చావు ముల్లు త్రుంచెను
ఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్లవారి బ్రోచును
ఆ ఆ ఆ హల్లెలూయ
మృత్యువింక గెల్వదు
ఆ ఆ ఆ హల్లెలూయ
5. యేసు మృతి గెల్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ
మేము కూడ గెల్తుము
ఆ ఆ ఆ హల్లెలూయ
యేసుడుండు చోటకు
ఆ ఆ ఆ హల్లెలూయ
మేము కూడ బోదుము
ఆ ఆ ఆ హల్లెలూయ
6. భూమి నాకశంబులో ​
ఆ ఆ ఆ హల్లెలూయ
యేసు, నీకు స్తోత్రము ​
ఆ ఆ ఆ హల్లెలూయ
మృత్యు సంహారకుండ
ఆ ఆ ఆ హల్లెలూయ
నీదె నిత్య జయము
​ఆ ఆ ఆ హల్లెలూయ

పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము నన్ను నడిపించును- మరల వచ్చి యేసు కొనిపోవును
యేసు చాలును – హల్లెలూయ హల్లెలూయ (2)
ఏ సమయమైన ఏ స్తితికైనా
నా జీవితములోయేసు చాలును
1. సాతాను శోధన లధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్లేదను
లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్లేదను #యేసు#
2. పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును
౩. నరులెల్లరు నను విడచిననూ – శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను #యేసు#

మరణము గెలిచెను మన ప్రభువు
మనుజాళి రక్షణ కోసము (2)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం
జయించె సమాధిని (2) ||మరణము||

పాపపు ఆత్మల రక్షణకై
గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)
ఎంత జాలి, ఎంత కరుణ
యికను మన పైన (2) ||మరణము||

నేడే పునరుద్దాన దినం
సర్వ మానవాళికి పర్వ దినం (2)
పాపపు చెర నుండి విడుదల (2)
ఎంత ధన్యం, ఎంత భాగ్యం
నేడే రక్షణ దినం (2) ||మరణము||

 

 

లేచినాడయ్య మరణపు ముల్లు
విరచి లేచినాడయ్య ॥2॥
పరమతండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమాస్వరూపుడై లేచినాడయ్య ॥2॥
1॰
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతాను ఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥
2॰
శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగిలేచెను ॥2॥
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥
3॰
జీవమార్గము మనకు అనుగ్రహించెను
మనపాపములన్నియు తుడిచివేసెను ॥2॥
ప్రేమయై మనకుజీవమై
వెలుగునై మంచికాపరియై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥

Easter Christian Telugu Songs English Lyrics

easter telugu song lyrics pdf

Gaganamu Cheelchukoni – Yesu Ghanulanu teesukoni
Velaadi dootalato bhuviki – vegame raanunde
1.Paraloka preddalato parivaaramuto kadali
dhara sangha vadhuvunakai- Taralenu varudadigo /Gaganamu/
2.Modataganu gorreganu – Mudamaaraga vachhenu
Kodama simhapureeti – Kadalenu garjanato /Gaganamu/
3. Kanipettu bhakthaali – Kanureppalo maaredaru
Pradhamamuna lechedaru – Parishuddhulu mrutulu /Gaganamu/

Geetham Geetham Jaya Jaya Geetham
Paaduvin Sodhararai Nammal
Yesu Nadhan Jeevikkunnathinal
Jaya Geetham Paadiduveen

1. Papam Sapam Sakalavum Theerpan
Avatharichihei Naranai Daiva
Kopatheeyil Ventherinjavanaam
Rekshakan Jeevikkunnu

2. Ulaka Mahanmarakhilavum Orupol
Urangunnu Kallarayil Nammal
Unnathan Yesu Maheswaran Maathram
Uyarathil Vaanidunnu

3. Kalushathayakatti Kannuneer Thudappeen
Ulsukarayirippeen Nammal
Athma Nathen Jeevikkave Ini
Alasatha Sariyaamo

4. Vaathilukalai Ningal Thalakale Uyarthin
Varunnitha Jayarajan Ningal
Uayarnnirippim Kathakukale
Sareeyesure Sweekarippan

Maranamu Gelichenu Mana Prabhuvu
Manujaali Rakshana Kosamu (2)
Entha Prema Entha Thyaagam
Jayinche Samaadhini (2) ||Maranamu||

Paapapu Aathmala Rakshanakai
Gorrepilla Rudhiram Nithya Jeevamai (2)
Ninnu Nannu Piliche Shree Yesudu (2)
Entha Jaali Entha Karuna
Yikanu Mana Paina (2) ||Maranamu||

Nede Punarutthaana Dinam
Sarva Maanavaaliki Parva Dinam (2)
Paapapu Chera Nundi Vidudhala (2)
Entha Dhanyam Entha Bhaagyam
Nede Rakshana Dinam (2) ||Maranamu||

Pls add more songs in the comment section