నైసియా విశ్వాస సూత్రము (Nicene Creed) & అపోస్తలుల విశ్వాస సూత్రము

THE NICENE CREED IN TELUGU

నైసియా విశ్వాస సూత్రము (Nicene Creed):
పరలోక భూలోకములకును, దృశ్యాదృశ్యములైన అన్నిటికిని సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రియైన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
2 ఆయన అన్ని లోకములకన్న ముందు, తన తండ్రినుండి జన్మించినవాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైనదేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించినవాడును, తండ్రితో ఏకత్వము గలవాడునైయున్నాడు.
3 సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును, మన రక్షణ కొరకును, పరలోకమునుండి దిగివచ్చి, పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియయందు శరీరధారియై, మనుష్యుడాయెను. ఆయన మనకొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను.
4 ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి, పరలోకమునకెక్కి, తండ్రి కుడిచేతివైపున కూర్చుండియున్నాడు. ఆయన సజీవులకును, మృతులకును తీర్పుతీర్చుటకు మహిమతో తిరిగివచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను.
5 ఆయన ప్రభువును, జీవమిచ్చువాడును, తండ్రి నుండియు కుమారునినుండియు, బయలుదేరువాడును, తండ్రితోను, కుమారునితోను కూడ ఆరాధింపబడి, మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికినవాడునై యున్నాడు.
6 మరియు సార్వత్రికమును, అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాపవిమోచనము కొరకైన ఒక్కటే బాప్తీస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్ధానము కొరకును, రాబోవు యుగము యొక్క జీవము కొరకును ఎదురుచూచుచున్నాను. ఆమేన్.

THE NICENE Apostles CREED in English & Telugu

THE NICENE CREED in English & Telugu

I believe in one God, the Father almighty, maker of heaven and earth and of all things visible and
invisible.
And in one Lord Jesus Christ, the only-begotten Son of God, begotten of the Father before all ages, God
of God, Light of Light, very God of very God, begotten not made, being of one substance with the Father,
through Whom all things were made: Who for us men and for our salvation came down from heaven, was
incarnate by the Holy Spirit of the virgin Mary, and was made man: Who for us, too, was crucified under
Pontius Pilate, suffered, and was buried: the third day He rose according to the Scriptures, ascended into
heaven, and is seated on the right hand of the Father: He shall come again with glory to judge the living
and the dead, and His kingdom shall have no end.
And in the Holy Spirit, the Lord and Giver of life, Who proceeds from the Father and the Son: Who
together with the Father and the Son is worshiped and glorified: Who spoke by the prophets.
And I believe one holy, Christian, and apostolic Church.
I acknowledge one baptism for the remission of sins, and I look for the resurrection of the dead and life of
the age to come.
Amen.

THE APOSTLES CREED IN TELUGU

అపోస్తలుల విశ్వాస సూత్రము:
1 పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును, మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
2 ఈయన పరిశుద్ధాత్మ వలన, కన్యయగు మరియ గర్భమున ధరింపబడి, ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి, సిలువ వేయబడి, చనిపోయి, పాతిపెట్టబడి, అదృశ్య లోకములోనికి దిగెను.
3 మూడవ దినమున తిరిగి లేచి, పరలోకమునకెక్కి, సర్వశక్తిగల తండ్రియైన దేవుని కుడిచేతి వైపున కూర్చుండియున్నాడు. సజీవులకును, మృతులకును తీర్పుతీర్చుటకు అక్కడనుండి ఆయన వచ్చును.
4 పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, పునరుత్ధానమును, నిత్యజీవమును నమ్ముచున్నాను. ఆమేన్.

THE APOSTLES CREED in English

I believe in God the Father Almighty, Maker of heaven and earth.
And in Jesus Christ, His only Son, our Lord; Who was conceived by the Holy Spirit; Born of the Virgin
Mary; Suffered under Pontius Pilate; Was crucified, dead and buried; He descended into Hell; The third
day He rose again from the dead; He ascended into heaven; And sitteth on the right hand of God the
Father Almighty; From thence He shall come to judge the living and the dead.
I believe in the Holy Spirit; The Holy Christian Church, the Communion of Saints; The Forgiveness of
sins; The Resurrection of the body; And the life everlasting. Amen.

Leave a Comment