What are LENT Days – LENT Season Meaning – Telugu

శ్రమల కాలం (Lent Days)
ఈ బుధవారంతో ఉపవాసకాలం మొదలవుతుంది. ఈ శ్రమల దినములను అందరూ ఆచరిస్తూ, ఎక్కువ సమయం ప్రార్ధనలో గడుపుతూ, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ, ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమల కాలం ఎంతో ఉపయోగపడును. ఈ రోజు మార్చి 1 మొదలుకొని ఈస్టర్ వరకు ఏప్రిల్ 14 వరకు గల ఈ 40 దినాలనే శ్రమల కాలం అంటారు. మధ్యలో గల ఆదివారాలు లెక్కించరు. ఇవి 40రోజులే ఎందుకు అంటే బైబిల్ లో 40 కి చాలా ప్రాముఖ్యత ఉంది.
▶ నోవహు కాలములో జలప్రళయం 40 దినాలు.
▶ మోషే దైవ సన్నిధిలో గడిపినది 40 దినాలు.
▶ ఏలీయా 40 రోజులు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడు.
▶ మోషే సినాయి కొండ మీద 40 రోజులు గడిపి 10 ఆజ్ఞలు పొందాడు.
▶ అరణ్య యాత్ర 40 సంవత్సరాలు.
▶ కనాను లో వేగులవారు పర్యవేక్షణ 40 దినాలు
▶ నినివే వారికీ హెచ్చరిక 40 దినాలు
▶ గోల్యాతును ఇశ్రాయేలీయులు ఎదుర్కొనినది 40 దినాలు.
▶ యేసుక్రీస్తు దేవుని పరిచర్యకు ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నారు.
📝 ఇందును బట్టి క్రీ.శ. 6వ శతాబ్దములో పోప్ ది గ్రేట్ గ్రెగరి (Gregory the Great) లెంట్ కాలమును క్రమపరచెను. మన ఆచారము ప్రకారము యేసు క్రీస్తు శ్రమల కాలము తరువాత సిలువ మరణం పొందలేదు. లెంట్ డేస్ తరువాత దేవుని పరిచర్య ప్రారంభించెను.
📝 Lent అను పదము Anglo-Saxon పదమైన Leneten నుండి పుట్టినది. Leneten అను పదానికి చీల్చు, పగులగొట్టు, చిగురించుటకు ఆరంభం, వసంతకాలం అను అర్ధాలు ఉన్నాయి. లెంట్ కాలము అనగా ఉపవాస కాలము అని అర్ధముగా చెప్పుకొనుచున్నాము.
📝 ఉపవాసకాలం అనుమాట సంస్కృత పదము నుండి పుట్టినది. ఇది రెండు ధాతువుల సమ్మేళనం. ఉప+వాసము. ఉప = తగ్గి, వాసము = నివాస స్థలము అనగా తగ్గి నివసించుట లేదా పస్తుండుట.
📝 భస్మము లేక బూడిద (Ash) అనునది అగ్నినుండి గాని యజ్ఞములో దహించబడిన జంతువు నుండి మిగిలిన అవశేషము బూడిద అంటారు. అబ్రాహాము సొదొమ, గొమొఱ్ఱ పట్టణములో నుండి లోతు కుటుంబమును రక్షించుటకు ప్రభువుతో మొర విడినది బూడిదయు ధూళిననునది అంటే తగ్గింపు జీవితమునకు గుర్తు.
📝 శ్రమ దుఃఖ విషయములకు బైబిల్ లో గోనెపట్ట కట్టుకొనుట, బూడిదలో కూర్చుండుట, బూడిద రాసుకొనుట, తలపై చల్లుకొనుట మొదలగునవి గుర్తుగా చెప్పబడినవి. “ప్రతిదినము దేవాలయములో అర్పింపబడు బలుల అవశేషము ప్రతి సాయంత్రము పట్టణము నుండి బయట పారవేయబడుదురు. ఇందుకు బూడిద వేయబడు లోయ కలదు (యిర్మీయా 31:40)
గోనె పట్ట కట్టుకొనిన కొందరు:
▶ నీనివే పట్టణస్థులు (యోనా 3:6)
▶ ఆహాబు (1రాజులు 21:27)
▶ బెన్హదుదు సేవకులు (1రాజులు20:32)
▶ ఇశ్రాయేలీయుల రాజు (2రాజులు 6:36)
▶ యాకోబు (ఆది 37:34)
▶ మొర్దెకై (ఎస్తేరు 4:1)
▶ దానియేలు (దానియేలు 9:2)
📝 లెంట్ లో ఉపవాసముండుట క్రైస్తవ సంఘానికి ఒక సవాలు.ఉపవాస కాలము తరువాత విశ్వాసికి నూతనోత్తేజము, నూతన బలము కలుగును. దేవునికి సమీపస్థులగుటకు ఇది ఒక మార్గము. నెసైయా (Nestia) అను గ్రీకు పదము నుండి ఉపవాసము అను అర్ధము వచ్చును. యూదా జనాంగము సోమవారం, గురువారం ఉపవాసము ఉందురు. పరిసయుడు వారమునకు రెండు పర్యాములు ఉపవాసము ఉందురు. ఈస్టర్ పండుగకు సిద్దబాటుగా ఉపవాసము ఉండు ఆచారము సనాథనముగా ఉండునట్లు తెలియచున్నది. దీని గురించిన ప్రస్తావన ఇరేబియాస్ (Irenaesus 97-202 AD) మరియు టెర్టుల్లియన్ ( Tertullian 186-220 ) అనువారు వ్రాసిన గ్రంధములలో ఈ విషయము కనిపించును.
బైబిల్ లో ఉపవాసము ఉన్న కొందఱు:
▶ యేసుప్రభువు (మత్తయి 4:2)
▶ నెహెమ్య (నెహె 1:4)
▶ ఎస్తేరు (ఎస్తేరు 4:15-17)
▶ మొర్దెకై. (ఎస్తేరు 4:16)
▶ నీనివే వారు (యోనా 3:5-10)
▶ దావీదు (2సమూ 12:16)
▶ దానియేలు (దాని 9:3)
ఉపవాసమనగా,
ఉ = ఉపేక్షించుకొని,
ప = పరీక్షించుకొని,
వా = వాక్య,
స = సందేశముతో,
ము = ముందుకు సాగుట.
ముగింపుగా లెంట్ కాలము సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఆత్మీయతకు దోహదపడు ఉపవాసకాలముగా మనం గుర్తించుచున్నాము. ప్రభువు మానవుడై మన రక్షణకై శ్రమపడిన విధమును జ్ఞాపకము చేసుకొని ఈ ప్రత్యేక దినమును మనము జ్ఞాపకము చెసుకొనుట మనకెంతో ఆశీర్వాదము. పరలోకానికి దారి సిలువ దగ్గరినుండే మొదలవుతుంది. సిలువను నామకర్ధముగా ధ్యానిస్తే దానిలో దాగి ఉన్న యేసయ్య ప్రేమను మనం చూడలేము. మనము ఆ శ్రమలను ఉపవాసము ద్వారా నలుగగొట్టబడి ప్రార్ధనతో ధ్యానిస్తే ఆ సిలువ విజయం మనం పొందగలం. అలా ఈ ఉపవాస కాలములోనైనా దేవునికి దగ్గర కావాలని, ప్రార్ధనతో సిద్ధబడాలి అని కోరుకుంటూ……..

source: FB Bible Mission Gooty

By your blood – Lent Days Songs

By Your blood I can enter the holiest place,

To the throne of my Father and King.

There I find Your acceptance, mercy and grace,

And my life is renewed again.

 

Far away from the stress and the turmoil of life,

I now come to seek Your face.

In the house of the Lord where Your presence is found,

I now come to worship You.

 

I see the King upon the throne,

Jesus, full of majesty.

I will fall down at Your feet,

I will worship You alone.

 

In the light of Your presence I find deepest joy,

There is no other place I would be.

To behold Your beauty is all my desire,

You’re the one my heart longs for,

You’re the one my heart longs for.

6 thoughts on “What are LENT Days – LENT Season Meaning – Telugu”

  • Thank you .. If you want to know more about the CROSS read the GARUKAINA SILUVA BOOK .. details are in the home page Bro

   Reply
 1. Lent Days గురించి చక్కగా వివరించారు. వందనాలు

  Reply
  • Thank you ..Sir If you want to know more about the CROSS read the GARUKAINA SILUVA BOOK .. details are in the home page sir

   Reply
 2. Beautifully written, Thank you for bringing out the hidden secrets. Every follower of Christ should know these facts.

  God Bless you Sir and use you more for his glory.

  Reply

Leave a Comment