Telugu Bible Verse for the DAY
యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను.యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను. (ఆది 21:1)
జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి;ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి; దేవుడు మనకు ఆశ్రయము. (కీర్త 62:8)దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. (1సమూ 30:6)దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి యిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవును.ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చి యున్నాను. ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱ సముద్రములోను, నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలనుచేసి వారిని తోడుకొనివచ్చెను. (అ కా 7:34-36) యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. (యెహో 21:45)
వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. (హెబ్రీ 10:23)ఆయన చెప్పి చేయ కుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యా 23:19)ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలుఏమాత్రమును గతింపవు. (మత్త 24:35)గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును; మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. (యెష 40:8)
సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి. (కీర్త 145:15)
ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. (అ,కా 17:25)యెహోవా అందరికిని ఉపకారి.ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. (కీర్త 145:9)ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. (మత్త 6:26)
ఒక్క ప్రభువే … తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. (రోమా 10:12)
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? (కీర్త 121:1) దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి. (కీర్త 123:2)
యెహోవా న్యాయముతీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు. (యెష 30:18)ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు.మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే.ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము. (యెష 25:9) మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. (రోమా 8:25)