Lent Day -20 Sramala Dinaalu 24/03/2022 Daily Bible Images

Daily Bible Quotes in Telugu

ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొనవలసినది. (1సమూ 12:24)
నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్త ము, అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొనవలెను. (ద్వితీ 8:2-5)
శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను. (కీర్త 119:67)నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను. (కీర్త 119:71)యెహోవా, నీ తీర్పులు న్యాయమైన వనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. (కీర్త 119:75)యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. (కీర్త 118:18)
ఆయన మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. (కీర్త 103:10-11) మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది.మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు. (కీర్త 103:14)

శుభప్రదమైన నిరీక్షణ, అనగా -మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత. (తీతు 2:12,13)

Daily Bible Images in Telugu

ఈ నిరీక్షణ మన ఆత్మకు నిశ్చలమును, స్థిరమును, తెరలోపల ప్రవేశించునదియు నైన లంగరువలె నున్నది.యేసు అందులోనికి మనకంటె ముందుగా ఆ తెరలోనికి పోయి మన కొరకుప్రవేశించెను. (హెబ్రీ 6:19,20)అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చు పర్యంతము యేసు పరలోక వాసియై యుండుట ఆవశ్యకము. (అ కా 3:21:30)తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరియందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చును. (2థెస 1:9)
సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, … మనముకూడ స్వీకృతపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగు చున్నాము. (రోమా 8:22-23)ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. (1యోహా 3:2)మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. (కొల 3:4)
త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్ ;ప్రభువైన యేసూ, రమ్ము.(ప్రక 22:20)

 

Lent Day -20 Sramala Dinaalu 1 wallpaper whatsapp status

Leave a Comment