Lent Day -11 Sramala Dinaalu 14/03/2022 Good Friday Images

Christian Telugu Bible words for GOD IS AT HELP

విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. (కీర్త 93:3,4)యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడి యున్నావు. సముద్రపు పొంగు నణచువాడవు నీవే. (కీర్త 89:8,9)
నిత్యనిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా?నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. (యిర్మి5:22)
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును. నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు.(యెష 43:2)
పేతురు … యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను. గాని గాలినిచూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి, అతని పట్టుకొని, అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో అనెను. (మత్త 14:29,30,31)
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. (కీర్త 56:3)

Lent Day -10 Sramala Dinaalu  Images

 

Christian Telugu Sad Worship Song

సిలువ శ్రమలు నాకై ఓర్చితివా – కలువరి గిరి మెట్టపై
సిలువ శ్రమలు నాకై ఓర్చితివా…
కలువరి గిరి మెట్టపై – కలుషమెల్లను బాపగ
ఇల వేల్పుగా బలిఐతివా
సిలువ శ్రమలు నాకై ఓర్చితివా..
1. దారి తెలియని దీన ప్రజలను – దరికి చేర్చి బ్రోచినావ /2/
కారుచీకటి తెరలు తొలిగే సిలువలో /2/
నుర్వి జనుల జీవజ్యోతిగా /సిలువ/
2. మానవాళిని ఆదరించిన – మాన్యుడా ఓ పూజ్యుడా /2/
అనవరతము తలతు నీదు సిలువను /2/
కన్నతండ్రివి నీవని /సిలువ/

Leave a Comment