Lent Day -14 Sramala Dinaalu 17/03/2022 Good Friday Bible Quotes

Good Friday Bible Quotes

నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను.
మన వ్యసనములను వహించెను. అయినను, మొత్తబడినవానిగాను, దేవునివలన బాధింపబడినవానిగాను, శ్రమనొందినవానిగాను, మనమతని ఎంచితివిు.
(యెష 53:4)

వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. (కీర్త 93:3)
విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. (కీర్త 93:3,4)యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడి యున్నావు. సముద్రపు పొంగు నణచువాడవు నీవే. (కీర్త 89:8,9)
నిత్యనిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా?నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. (యిర్మి5:22)
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును. నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు.(యెష 43:2)
పేతురు … యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను. గాని గాలినిచూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి, అతని పట్టుకొని, అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో అనెను. (మత్త 14:29,30,31)
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. (కీర్త 56:3)

Lent Day -12 Sramala Dinaalu 1 wallpaper whatsapp status christian telugu quotes

Good Friday Songs from BIBLE

యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
1. ప్రతి ఘోర పాపమును కడుగును – మన యేసయ్య రక్తము (2X)
బహు దు:ఖములో మునిగెనే – చమట రక్తముగా మారనే (2X)
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
2. మనః సాక్షిని శుద్ధి చేయును – మన యేసయ్య రక్తము (2X)
మన శిక్షను తొలగించెను – సంహారమునే తప్పించెను(2X)
యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును – మన యేసయ్య రక్తము (2X)
మన ప్రధాన యాజకుడు – మన కంటె ముందుగా వెళ్ళెను (2X)
యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము
గొప్ప సిలువ పాటలు

Leave a Comment