Lent Day -5 Sramala Dinaalu 07/03/2022 Wallpaper Whatsapp status

Status of the Day =Lent Day 5

Lent Day -5 Sramala Dinaalu 1 wallpaper whatsapp status

యేసుక్రీస్తు శ్రమల Song- good Friday Song

ఏ పాప మెరుగని యోపావన మూర్తి – పాప విమోచకుండ = నా పాలి దైవమా – నా పాపముల కొర – కీ పాట్లు నొందినావా
1. ముళ్ళతో గేరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా = ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా
2. కలువరి గిరిదనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా = శిలువ నీతో మోయ – తులువలు వేరొకని – దోడుగా నిచ్చినారా
3. చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా = కడకు కల్వరిగిరి – కడకేగి సిల్వను – గ్రక్కున దించినావ
4. ఆ కాల కర్ములు – భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా = నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది మేకులతొ గ్రుచ్చినారా
5. పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా = సిలువపై బలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా
6. బల్లిదుండగు బంటు – బల్లెమున నీప్రక్క – జిల్లి బడ బొడచినాడా = ఉల్లోలములవలె నల్లనీరుబుకంగ – జల్లారెగద కోపము
7. కటకటా పాప సం – కటము బాపుట కింత – పటుబాధ నొందినావా = ఎటువంటి దీ ప్రేమ – ఎటువంటి దీ శాంత – మెటుల వర్ణింతు స్వామి

Scripture of the  Day += Lent Day 5

క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు;ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. (1 పేతు 2:21-23)
ఓ యెహోవా, నాకు శ్రమకలిగెను; నాకొరకు పూటబడియుండుము.(యెష 38:14)
ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి. (కీర్త 123:1,2)దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము.నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకుమొఱ్ఱ పెట్టుచున్నాను.

Leave a Comment