Lent Day -18 Sramala Dinaalu 22/03/2022 Christian Telugu Images

అక్కడ రాత్రి యుండదు. (ప్రక 21:25)
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును.నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. (యెష 60:19)
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. (ప్రక 21:23)దీపకాంతిగాని సూర్యకాంతిగానివారికక్కరలేదు.దేవుడైన యెహోవాయే వారిమీద ప్రకాశించును. (ప్రక 22:5)
మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. (1పేతు 2:9) తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. … ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. (కొల 1:12-13) మీరు పూర్వమందు చీకటియై యుంటిరి.ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి (ఎఫె 5:8-10)
మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. (1థెస 5:5)
పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. (సామె 4:18)

Lent Day -18 Sramala Dinaalu 1 wallpaper whatsapp status

నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. (సామె 3:9
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును. (2కొరిం 9:6)ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. (1కొరిం 16:2)మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. (హెబ్రీ 6:10)
సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. (రోమా 12:1)
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము. (2కొరిం 5:14-15)
మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. (1కొరిం 10:31)

Leave a Comment