Lent Day -13 Sramala Dinaalu 16/03/2022 Good Friday Images

నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. (కీర్త 69:26)      

    అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ. (లూకా 17:1) దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయననే మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.       (అ.కా 2:23)  వారు ఆయన ముఖముమీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అర చేతులతో కొట్టి, క్రీస్తూనిన్ను కొట్టినవాడెవడో మాతో చెప్పుమనిరి. (మత్త 26:67,68) ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధాన యాజకులును కూడ ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము అని చెప్పిరి. (మత్త 37:41,42) ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. (అ.కా 4:27,28)                 

    నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. అయినను, మొత్తబడినవానిగాను, దేవునివలన బాధింపబడినవానిగాను, శ్రమనొందినవానిగాను, మనమతని ఎంచితివిు. (యెష 53:4)    

  

Leave a Comment