యేసుక్రీస్తు శ్రమల పాటలు
Lent Day Songs Telugu Lyrics & Chords
Andhra Kraisthava Keerthanalu Song number -182
ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా
యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు
ఎంతో దిగులయ్యా నాకు ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ గా ||నెంతో||
వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాఁడనుచు నిన్ను మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా ||యెంతో||
సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను ||ఎంతో||
కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము ||నెంతో||<
నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ జూపినావా ||యెంతో||
చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా ||యెంతో||
అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన నన్ను ఎన్నఁ డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా ||యెంతో||
Andhra Kraisthava Keerthanalu Song number – 183
సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా యాత్మలోఁ బలుమాఱు దలఁపఁగాఁ దాలిమి లేదాయెను హా యీ జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువఁజాల ||సిలువ||
ఘోరమైనట్టి యీ భారమైన సిలువ ధరియించి భుజముపైని నా దురితముల్ బాపను కరుణచేఁ జనుదెంచి మరణము నొందితివా ||సిలువ||
కలువరి మెట్టపైఁ కాలు సేతు లెల్ల చీలలతోఁ గ్రుచ్చిపట్టి యా సిలువకుఁ గొట్టఁగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా ||సిలువ||
మెట్టపైన నిన్నుఁ పెట్టిన బాధ నేఁ బట్టి తలంపఁగను ఆహా పట్టైన నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను ||సిలువ||
పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపఁగను హానా మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి ||సిలువ||
Andhra Kraisthava Keerthanalu Song number – 184 ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము
ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార ఆ మహాత్ముఁడు మరణ మగు రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క జనుని చందము గాదు ఈ మహిని గల పాప జీవుల పై మహాకృపఁ జూపి నిత్య క్షేమ మొసఁగెడు కొరకు బలు శ్రమ చే మృతుండైనాఁడు స్వేచ్ఛను ||ఏమాశ్చర్యము||<
కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేఁడెను ||ఏమాశ్చర్యము||
కడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు పట్టు వడె దానంతట తాను చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్లఁ బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా ||ఏమాశ్చర్యము||<slide>
ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థలఁ బెట్టిరి నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి వారిఁ గరుణించి యెరుఁగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేఁడు కొనియెను ||ఏమాశ్చర్యము||
Andhra Kraisthava Keerthanalu Song number – 185 అపు డర్చకాదు లుప్పొంగిరి
అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు సిల్వమానిపైఁ బ్రభుని వేయుట కొప్పి ||రపు డర్చ||
యెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమ సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ గొట్టి ||రపు డర్చ||
చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తము నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె ||నపు డర్చ||
గడి దొంగ లిరువురుని బట్టిరి ప్రభుని కుడి యెడమలను సిల్వఁ గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు బాధలను మరియ కొడు కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె ||నపు డర్చ||
Andhra Kraisthava Keerthanalu Song number – 186 ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి
ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||యే పాప||
ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||యే పాప||
కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా ||యే పాప||
చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకుఁ కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా ||యే పాప||
ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా ||యే పాప||
పలువిధంబుల శ్రమలు చెలరేగఁ దండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా సిలువపైఁ బలుమాఱు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా ||యే పాప||
బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కఁ జిల్లిఁ బడఁ బొడిచి నాఁడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగఁ జల్లారెఁగద కోపము ||యే పాప||
కటకటా పాప సం కటముఁ బాపుట కింత పటుబాధ నొంది నావా ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీ శాంతి మెటుల వర్ణింతు స్వామి ||యే పాప||
Andhra Kraisthava Keerthanalu Song number -187 పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో
పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||బాపుల||
యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా రల నోదార్చెను ||బాపుల||
శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||
తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్ కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||
మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ ||బాపుల||
Andhra Kraisthava Keerthanalu Song number -188 చూడరే చూడరే క్రీస్తుని జూడరే
చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో ||చూడరే||
మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది ||చూడరే||
>మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ బ్రాణము లుండునే యిఁకఁ ||జూడరే||
ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ జేసిరి ||చూడరే||
1 thought on “Telugu Christian Good Friday Songs Lyrics & Chords – యేసుక్రీస్తు పాటలు”