Best Telugu Easter Songs Lyrics PDF – List -PPT

పల్లవి: గగనము చీల్చుకొని – యేసు ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి – వేగమె రానుండె
1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో /గగ/
2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను
కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో /గగనము/
3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు /గగనము/

గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము
యేసురాజు లేచెను – హల్లెలుయా – జయ మర్భాటించెదము#2#గీతం#

1. చూడు సమాధిని మూసిన రాయి – దొరలుచు పోరలిడెను
అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు #2#గీతం#

2. వలదు వలదు ఏడువవలదు – వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి#2#గీతం#

3. అన్న కయప వారల సభయును – ఆదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి#2#గీతం#

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయవీరుడు రాగా
మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి #2#గీతం#

 

లేచినాడురా సమాధి గెలిచినాడురా – యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా
అ.ప. లేతునని తా జెప్పినట్టు – లేఖనములలో పలికినట్టు /లేచి/
1. భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న
2. ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి
భళిర దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు
3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ
4. చూడవెళ్లిన స్త్రీలను దూత – చూచి యపుడే వారితోడ
లేడు గలలియ ముందుగ పోతున్నాడు – అపుడె లేచినాడని
5. చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు – చావు అంటే భయపడరాదు
6. నేను చేసే పనులనెరుగు – నేను నడిచే మార్గమెరుగు
నేను చేప్పు మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకు నెరుగు
7. నేను లేచిన యేసునందు – మానక మది నమ్ముకొందు – తాను
నాలోయుండినందున – దయను జేర్చు మోక్షమందు
8. పాపభారము లేదు మనకు – మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు – మరువకండి యేసు ప్రభుని
9. యేసు నందే రక్షణ భాగ్యం – యేసు నందే నిత్య జీవం
యేసు నందే ఆత్మ శాంతి – యేసు నందే మోక్ష భాగ్యం
10. పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు
పాపులను ప్రేమించానాడు – ప్రాణదానము చేసినాడు

1.క్రీస్తు నేడు లేచెను
ఆ ఆ ఆ హల్లెలూయ
మర్త్య దూత సంఘమా
ఆ ఆ ఆ హల్లెలూయ
భూమి నాకసంబులో
ఆ ఆ ఆ హల్లెలూయ
బాడుమిందు చేతను ​
ఆ ఆ ఆ హల్లెలూయ
​ 2. మోక్షమియ్య నాధుడు ​
ఆ ఆ ఆ హల్లెలూయ
యుద్ధమాడి గెల్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ ​
సూర్యుడుద్భవింపగ
ఆ ఆ ఆ హల్లెలూయ ​
​చీకటుల్ గతియించెను
ఆ ఆ ఆ హల్లెలూయ ​
3. బండ, ముద్ర, కావలి
ఆ ఆ ఆ హల్లెలూయ
అన్ని వ్యర్ధమైనవి
ఆ ఆ ఆ హల్లెలూయ​
యేసు నరకంబును
ఆ ఆ ఆ హల్లెలూయ
గెల్చి ముక్తి దెచ్చెను ​
ఆ ఆ ఆ హల్లెలూయ
4. క్రీస్తు లేచినప్పుడు
ఆ ఆ ఆ హల్లెలూయ
చావు ముల్లు త్రుంచెను
ఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్లవారి బ్రోచును
ఆ ఆ ఆ హల్లెలూయ
మృత్యువింక గెల్వదు
ఆ ఆ ఆ హల్లెలూయ
5. యేసు మృతి గెల్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ
మేము కూడ గెల్తుము
ఆ ఆ ఆ హల్లెలూయ
యేసుడుండు చోటకు
ఆ ఆ ఆ హల్లెలూయ
మేము కూడ బోదుము
ఆ ఆ ఆ హల్లెలూయ
6. భూమి నాకశంబులో ​
ఆ ఆ ఆ హల్లెలూయ
యేసు, నీకు స్తోత్రము ​
ఆ ఆ ఆ హల్లెలూయ
మృత్యు సంహారకుండ
ఆ ఆ ఆ హల్లెలూయ
నీదె నిత్య జయము
​ఆ ఆ ఆ హల్లెలూయ

పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము నన్ను నడిపించును- మరల వచ్చి యేసు కొనిపోవును
యేసు చాలును – హల్లెలూయ హల్లెలూయ (2)
ఏ సమయమైన ఏ స్తితికైనా
నా జీవితములోయేసు చాలును
1. సాతాను శోధన లధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్లేదను
లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్లేదను #యేసు#
2. పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును
౩. నరులెల్లరు నను విడచిననూ – శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను #యేసు#

మరణము గెలిచెను మన ప్రభువు
మనుజాళి రక్షణ కోసము (2)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం
జయించె సమాధిని (2) ||మరణము||

పాపపు ఆత్మల రక్షణకై
గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)
ఎంత జాలి, ఎంత కరుణ
యికను మన పైన (2) ||మరణము||

నేడే పునరుద్దాన దినం
సర్వ మానవాళికి పర్వ దినం (2)
పాపపు చెర నుండి విడుదల (2)
ఎంత ధన్యం, ఎంత భాగ్యం
నేడే రక్షణ దినం (2) ||మరణము||

 

 

లేచినాడయ్య మరణపు ముల్లు
విరచి లేచినాడయ్య ॥2॥
పరమతండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమాస్వరూపుడై లేచినాడయ్య ॥2॥
1॰
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతాను ఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥
2॰
శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగిలేచెను ॥2॥
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥
3॰
జీవమార్గము మనకు అనుగ్రహించెను
మనపాపములన్నియు తుడిచివేసెను ॥2॥
ప్రేమయై మనకుజీవమై
వెలుగునై మంచికాపరియై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥

Easter Christian Telugu Songs English Lyrics

easter telugu song lyrics pdf

Gaganamu Cheelchukoni – Yesu Ghanulanu teesukoni
Velaadi dootalato bhuviki – vegame raanunde
1.Paraloka preddalato parivaaramuto kadali
dhara sangha vadhuvunakai- Taralenu varudadigo /Gaganamu/
2.Modataganu gorreganu – Mudamaaraga vachhenu
Kodama simhapureeti – Kadalenu garjanato /Gaganamu/
3. Kanipettu bhakthaali – Kanureppalo maaredaru
Pradhamamuna lechedaru – Parishuddhulu mrutulu /Gaganamu/

Geetham Geetham Jaya Jaya Geetham
Paaduvin Sodhararai Nammal
Yesu Nadhan Jeevikkunnathinal
Jaya Geetham Paadiduveen

1. Papam Sapam Sakalavum Theerpan
Avatharichihei Naranai Daiva
Kopatheeyil Ventherinjavanaam
Rekshakan Jeevikkunnu

2. Ulaka Mahanmarakhilavum Orupol
Urangunnu Kallarayil Nammal
Unnathan Yesu Maheswaran Maathram
Uyarathil Vaanidunnu

3. Kalushathayakatti Kannuneer Thudappeen
Ulsukarayirippeen Nammal
Athma Nathen Jeevikkave Ini
Alasatha Sariyaamo

4. Vaathilukalai Ningal Thalakale Uyarthin
Varunnitha Jayarajan Ningal
Uayarnnirippim Kathakukale
Sareeyesure Sweekarippan

Maranamu Gelichenu Mana Prabhuvu
Manujaali Rakshana Kosamu (2)
Entha Prema Entha Thyaagam
Jayinche Samaadhini (2) ||Maranamu||

Paapapu Aathmala Rakshanakai
Gorrepilla Rudhiram Nithya Jeevamai (2)
Ninnu Nannu Piliche Shree Yesudu (2)
Entha Jaali Entha Karuna
Yikanu Mana Paina (2) ||Maranamu||

Nede Punarutthaana Dinam
Sarva Maanavaaliki Parva Dinam (2)
Paapapu Chera Nundi Vidudhala (2)
Entha Dhanyam Entha Bhaagyam
Nede Rakshana Dinam (2) ||Maranamu||

Pls add more songs in the comment section

Leave a Comment