యెహోవా, ….నా ఆశ్రయదుర్గము నీవే. (కీర్త 142:5)
సమస్తమును మీవి, మీరు క్రీస్తువారు; క్రీస్తు దేవునివాడు. (1కొరిం 3:22,23)మన రక్షకుడునైన యేసుక్రీస్తు … తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. (తీతు 2:13,14) క్రీస్తు … సంఘమును ప్రేమించి,అది కళంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని … దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. (ఎఫె 5:25-27) యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను.
(కీర్త 34:2)ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి యున్నాడు.కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. (యెష 61:10)
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిదేదియు నాకక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. (కీర్త 73:25,26)నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును. యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము.నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను. (కీర్త 16:2,5,6)
ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. (సామె 14:12)
తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. (సామె 28:26)
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. (కీర్త 119:105) మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించు కొనుటకై నీ నోటిమాటనుబట్టి నన్ను నేనుకాపాడుకొనియున్నాను. (కీర్త 17:4)
నీ మధ్యను ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని పుట్టి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల, అతడు నీతో చెప్పిన …మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాటవిని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను. (ద్వితీ 13:1-4)
నీకు ఉపదేశము చేసెదను.నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. (కీర్త 32:8)