దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము.దరిద్రులమైనట్లుం
మనము … దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడు చున్నాము. అంతే కాదు … అతిశయ పడుదము. (రోమా 5:2-4) నాకు చాల అతిశయము కలదు.ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. (2కొరిం 7:4)మీరు విశ్వసించుచు …చెప్ప నశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. (1 పేతు 1:9)
వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. (2కొరిం 8:2)శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. (ఎఫె 3:9-10)
ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? (యాకో 2:5) అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. (2కొరిం 9:8)
రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును.రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. (కీర్త 41:3)
వారి యావద్బాధలో ఆయన బాధనొందెను.ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను.ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను.పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. (యెష 63:9)నీవు ప్రేమించువాడు కాయిలాపడి యున్నాడు. (యోహా 11:3)నా కృప నీకు చాలును.బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది.కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే అతిశయపడుదును. (2కొరిం 12:9)
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. (ఫిలి 4:13)మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. (2కొరిం 4:16)
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. (అ కా 17:28)సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే.శక్తిహీనులకు ఆయనే బలాభివృద్ధి కలుగజేయును. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవ్వనస్థులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. (యెష 40:29-31)శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము.నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును. (ద్వితీ 33:27)