దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు; పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు.(సంఖ్యా 23:19)
ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయ యైనను లేదు. (యాకో 1:17)యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. (హెబ్రీ 13:8)
ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. (కీర్త 91:4)
దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. (హెబ్రీ 6:17,18)
నీ దేవుడైన యెహోవా తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును, వేయితరములవరకు కృపచూపువాడునై యున్నాడు. (ద్వితీ 7:9) ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్య మయములై యున్నవి. (కీర్త 25:10)ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో,ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. (కీర్త 146:5,6)
శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతగానివాడవగుదువు. (సామె 24:10)
సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు ఆయనే బలాభివృద్ధి కలుగజేయును. (యెష 40:29)నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది. (2కొరిం 12:9)అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తర మిచ్చెదను.శ్రమలో నేనతనికి తోడైయుండెదను. అతని విడిపించెదను. (కీర్త 91:15)శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము. నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును. ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టును. (ద్వితీ 33:27)
కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారి కొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును కానరారైరి. (కీర్త 69:20)
ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై … దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. అతడు ఏమియు తెలియనివారి యెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూప గలవాడై యున్నాడు. అటువలె క్రీస్తు, … కుమారుడై యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, …తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారకుడాయెను. (హెబ్రీ 5:1,2,5-10)నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను.మన వ్యసనములను వహించెను.(యెష 53:4)