యెహోవా నన్ను ఆదుకొనెను. (కీర్త 18:18)
నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్ ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. (యిర్మి 3:23)యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు; నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. (కీర్త 18:2)
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము.నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు. (యెష 12:6)
యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును. నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. (కీర్త 34:7,17)శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము.నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును. (ద్వితీ 32:27) కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను,నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. (హెబ్రీ 13:64)యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?నాకు బలము ధరింపజేయువాడు ఆయనే.నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. (కీర్త 18:31,32)
నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. (1కొరిం 15:10)
మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతివిు. (యెష 53:6)
మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు సత్యము మనయందు లేదు. (1యోహా 1:8)నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు; గ్రహించు వాడెవడును లేడు.దేవుని వెదకువాడెవడును లేడు;అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలిన వారైరి. (రోమా 3:10-12)
మీరు గొర్రెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు పాలకుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు. (1 పేతు 2:25)నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవవిడిచి తిరిగిన యెడల నీ సేవకుని వెదకి పట్టుకొనుము. (కీర్త 119:176)
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు.తన నామమునుబట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. (కీర్త 23:3)
నా గొర్రెలు నా స్వరము వినును,నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు.ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. (యోహా 10:27,28)
మీలో ఏ మనుష్యునికైనను నూరు గొర్రెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెతక వెళ్లడా? (లూకా 15:4)