Lent Day 10 Good God Images in Telugu:
Gospel for the Day in Telugu:
వివేకియై దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు. (కీర్త 14:2,3) శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. (రోమా 8:8)ఇచ్ఛ నాకు తటస్థమైయున్నది గాని, దానిని చేయుట నాకు తటస్థమగుటలేదు.నేను చేయ నిచ్చయించు మేలుచేయక యిచ్చయింపని కీడు చేయుచున్నాను. (రోమా 7:18,19)మేమందరము అపవిత్రుల వంటి వారమైతివిు. మా నీతి క్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను. మేమందరము ఆకువలె వాడిపోతివిు. గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను. (యెష 64:6) యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపమునకు లోనైనవారినిగా నెంచెను. (గల3:22)దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు కొనును. (2కొరిం 5:19) మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడునై యున్నాడు