గరుకైన శిలువ! పుస్తక పరిచయం:
‘ఆయన (యేసు క్రీస్తు ప్రభువు) అందరితో ఇట్లనెను. ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను. (లూకా 9:23) ‘తన సిలువను ఎత్తికొని, నన్ను వెంబడింపనివాడు, నాకు పాత్రుడు కాడు.’ (మత్త 10:38) శ్రమలకు, వేదనలకు, కష్టాలకు మరియు శోధనలకు చిహ్నం శిలువ. క్రైస్తవ జీవితం పూల బాట కాదు. అది ముళ్ళ బాట. అయినా, క్రీస్తు ప్రభువులో జీవించేవారికి ఆ ముళ్ళే పువ్వులకు మించిన దేవుని శక్తిని, ఆత్మ సంతృప్తిని మరియు పరలోక నిత్యానందాన్ని కలిగిస్తాయి. కాని, అవి కేవలం విశ్వాసులకు వ్యక్తిగత అనుభవాలే.
‘సిలువను గూర్చిన వార్త, .. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.’ (1 కొరిం 1:18) ‘పాపాత్ములు తనకు వ్యతిరేకముగ (తమ స్వంత హానికే) చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన, ఆయనను తలంచుకొనుడి. (హెబ్రీ 12:,3) శిలువపై ప్రభువు పలికిన మాటలను అనునిత్యం విశ్వాసి స్మరణ చేసుకుంటూ తమ జీవితాలలో ఎదురయ్యే సమస్యలను, శోధనలను, యిరుకులను, యిబ్బందులను మనోధైర్యంతో అధిగమించు ఉద్దేశంతో ఈ పుస్తకం సిద్ధం చేయబడింది. ఈ కారణంగానే ఈ పుస్తకానికి గరుకైన శిలువ అని పేరుపెట్టబడింది.
శిలువపై ప్రభువు పలికిన ఏడు మాటలను ఒక కథలాగ చదవాలనుకొనే వారికి పుస్తకంలో వ్రాయబడిన కొన్ని రిఫరెన్సు వాక్యాలు లేక వివరాలు కొంత అవ్యవస్థగా అనిపించవచ్చు. ఒక వివరణతో కూడిన కథవలె కాకుండ, శిలువపై ప్రభువు పలికిన ఏడు మాటలను విశ్వాసులు తమ జీవితాలకు అన్వయించుకొనే విధంగా వివరణాత్మకమైన పద్ధతిలో ఈ పుస్తకం సిద్ధం చేయబడింది. పుస్తకం చదివే సమయంలో ఈ విషయం గమనించి దేవుని స్వరాన్ని విశ్వాసులు వినగలుగునట్లుగా మన ప్రభువైన యేసు క్రీస్తు సహాయం చేయును గాక! ఆమేన్!
విషయ సూచిక
ప్రభువు సిలువ పైవిలాసం
(రోమాయి, హెబ్రాయిమరియు గ్రీకు భాషలలో) … 7
సిలువపై ప్రభువు పలికిన ఏడు మాటలు
(తెలుగు, ఇంగ్లీషు, రోమాయిమరియు గ్రీకు భాషలలో) … 8
సిలువ నేర్పే పాఠం – కీడుకు ఎదురాడకుము … 10
సిలువ – విశ్వాసి అనుభవాలకు ప్రతీక … 20
సిలువపై యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఏడు మాటలు – ఉపోద్ఘాతం … 37
V 1. మొదటి మాట – తండ్రీ, వీరేమిచేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించుము … 61
V 2. రెండవ మాట – నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువు … 86
V 3. మూడవ మాట – అమ్మా, యిదిగో నీ కుమారుడు, .. యిదిగో నీ తల్లి … 118
V 4. నాల్గవ మాట – ఏలీ, ఏలీ, లామా సబక్తానీ … 130
V 5. ఐదవ మాట – దప్పిగొనుచున్నాను … 148
V 6. ఆరవ మాట – సమాప్తమైనది … 156
V 7. ఏడవ మాట – తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను చున్నాను … 174
ముగింపు … 188
అనుబంధము 1 – పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రవచనాలుమరియు వాటి నెరవేర్పు … 199
VIII. అనుబంధము 2 – సంగీతము: The Old Rugged Cross (సిలువ విలువ) … 223
XI. బైబిలు సంవత్సరం – సంవత్సర కాలంలో బైబిలు గ్రంథ పూర్తి
అధ్యయన ప్రాణాళిక … 227