Telugu Christian Songs 1 Nadipinchu Na Naava Lyrics Chords నడిపించు నా నావా

Telugu Christian Songs 1 Nadipinchu Na Naava Lyrics Chords నడిపించు నా

Nadipinchu Na Naava Lyrics – TELUGU scrip6t

 

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||

నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||

ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||

లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||

Telugu Christian Songs 1 Nadipinchu Na Naava Lyrics Chords నడిపించు నాTelugu Christian Songs 1 Nadipinchu Na Naava Lyrics Chords నడిపించు నా నావా

తెలుగు క్రిస్టియన్ సాంగ్స్

Nadipinchu Na Naava Lyrics – English script

Nadipinchu Naa Naavaa – Nadi Sandramuna Devaa
Nava Jeevana Maargamuna – Naa Janma Thariyimpa ||Nadipinchu||

Naa Jeevitha Theeramuna – Naa Apajaya Bhaaramuna
Naligina Naa Hrudayamunu – Nadipinchumu Lothunaku
Naa Yaathma Virabooya – Naa Deeksha Phaliyimpa
Naa Naavalo Kaalidumu – Naa Seva Chekonumu ||Nadipinchu||

Raathranthayu Shramapadinaa – Raaledu Prabhu Jayamu
Rahadaarulu Vedakinanoo – Raadaayenu Prathiphalamu
Rakshinchu Nee Siluva – Ramaneeya Lothulalo
Rathanaalanu Vedakutalo – Raajillu Naa Padava ||Nadipinchu||

Aathmarpana Cheyakaye – Aashinchiti Nee Chelimi
Ahamunu Preminchuchune – Arasithi Prabhu Neekalimi
Aasha Nirashaye – Aavedha Nedhuraye
Aadhyathmika Lemigani – Allade Naa Valalu ||Nadipinchu||

Prabhu Maargamu Vidachithini – Prardhinchuta Maanithini
Parbhu Vaakyamu Vadhalithini – Paramardhamu Marachithini
Prapancha Natanalalo – Praveenyamunu Pondhi
Phala Heenudanai Ipudu – Paatinthu Nee Maata ||Nadipinchu||

Lothaina Jalamulalo – Lothuna Vinabadu Swaramaa
Lobadutanu Nerpinchi – Lopambulu Savarinchi
Lonunna Eevulalo – Lothaina Naa Brathuku
Lopinchani Arpanagaa – Lokesha Cheyumayaa ||Nadipinchu||

Prabhu Yesuni Shishyudanai – Prabhu Premalo Paadukoni
Prakatinthunu Lokamulo – Parishudhdhuni Prema Katha
Paramaathma Prokshanatho – Paripoorna Samarpanatho
Praanambunu Prabhu Koraku – Praanaarpanamu Chethu ||Nadipinchu||

Nadipinchu Na Naava CHORDS – TELUGU script

Style: 4/4
Tempo: medium
Key:D major

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
Bm A G A G D
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప /నడిపించు/
D Bm A G
1.నా జీవిత తీరమున నా అపజయ భారమున
A G D Bm A D
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
D A D
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
Bm A G A G D
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము /నడిపించు/
2.రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ /నడిపించు/
3.ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు /నడిపించు/
4.ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట /నడిపించు/
5.లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా /నడిపించు/
6.ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు /నడిపించు/

Nadipinchu Na Naava CHORDS – ENGLISH script

 

E B E
Nadipinchu Naa Naava – Nadi Sandhramuna Deva
C#m A B E
Nava Jeevana Margamuna – Naa Janma Thariyimpa

Verse 1 :
E C#m B A
Naa Jeevitha Theeramuna – Naa Apajaya Bharamuna
B A E C#m B E
Naligina Naa Hrudayamunu – Nadipinchumu Lothunaku
E B E
Naa Aathma Virabhuya – Naa Deeksha Phaliyimpa
C#m A B E
Naa Naavalo Kaalidumu – Naa Seva Jekonumu

Verse 2:
E C#m B A
Rathranthayu Shramapadina – Raaledu Prabhu Jayamu
B A E C#m B E
Rahadarulu Vedhakinanu – Radayenu Pratiphalamu
E B E
Rakshinchu Nee Siluva – Ramaneeya Lothulalo
C#m A B E
Ratanalanu Vedhukutalo – Rajillu Naa Padava

Verse 3:
E C#m B A
Aathmarpana Cheyakaye – Aashinchiti Nee Chelimi
B A E C#m B E
Ahamunu Preminchuchune – Arasithi Prabhu Neekalimi
E B E
Aasha Nirashaye – Aavedha Nedhuraye
C#m A B E
Aadhyathmika Lemigani – Allade Naa Valalu

Verse 4:
E C#m B A
Prabhu Maargamu Vidachithini – Prardhinchuta Maanithini
B A E C#m B E
Prabhu Vaakyamu Vadhalithini – Paramardhamu Marachithini
E B E
Prapancha Natanalalo – Praveenyamunu Pondhi
C#m A B E
Phala Heenudanai Ipudu – Paatinthu Nee Maata

Verse 5:
E C#m B A
Prabhu Yesu Shishyudanai – Prabhu Premalo Paadhukoni
B A E C#m B E
Prakatinchunu Lokamulo – Parishudhuni Premakatha
E B E
Paramaathma Prokshanalo – Paripoorna Samarpanatho
C#m A B E
Praanambunu Prabhukoraku – Paanarpanamu Jethu

Nadipinchu na naava Author – About Lyric Writer

Abel Boanerges Masilamani isa the proud writer of this song. He was Born on 30 November 1914 Pitapuram, East Godavari, Andhra Pradesh, India
Other compositions by Masilamani

Original songs in Telugu by Masilamani
– అందాల తార – Andala Tara,
Hymn 96 – ‘దేవుని నీతి ప్రతాపం – Devuni Neethi Pratapam’,
Hymn 135 – ‘రండి సువార్త సునాదముతొ – Randi Suvartha Sunaadamu’
Hymn 278 – ‘జీవాహారము రమ్ము- Jeevaharamu Rammu’,
Hymn 307 – ‘హే ప్రభుయేసు – He Prabhu Yesu’,
Hymn 349 – ‘సంతొషింపరె ప్రియులార – Santoshimpare Priyulara’,
Hymn 367 – ‘దేవా! వెంబడించితి నీ నామమున్ – Deva vembadinchithi née naamamun’,
Hymn 378 – ‘కఱుణాపీఠము జేరరె – Karuna peetamu jerare’,
Hymn 661 – ‘నడిపించు నా నావ – Nadipinchu Naa Naava’ This is a well known song among Telugu Christians. Sakshi, a popular Telugu Daily Newspaper in India, noted that it is highly unlikely you will find a Telugu Christian or a Telugu Christian Church who has never sung this song.[58]
English Hymns translated into Telugu
Hymn 65 – The Love of God (original writer unknown),[16]
Hymn 606 – Blest be the tie that binds (John Fawcett)

Original Christian Writings in India in Telugu:

Original writings in Telugu
A Telugu Theological Glossary, 1965,
Consequences, 1969,[46]
Awareness (కనువిప్పు), 1980,
Worship with Flowers, 1981
Sermon Waves (ప్రసంగ వాహిని), 1982,
Stream of Sermons (ప్రసంగ తరంగాలు), 1982,
The Awakening (మేలుకొలుపు), 1984,
Zionism, 1984

God is good all the time.  He will help us in our distress. When we feel low and lonely He is our only hope and He is our only fort. ♥️ The love for us will never fade away  and nothing can separate us from our Lord Jesus Christ.

Daily Bible Verses in Telugu ++ బైబిల్ వాక్యాలు సువర్తస్వరం

Telugu BIBLE Verses

Daily Bible Verses in Telugu are here. For you we present బైబిల్ వాక్యాలు below

యోహా 14:1

మీ హృదయమును కలవరపడనియ్యకుడి. దేవునియందు విశ్వాసముంచుచున్నారు. (లేక దేవునియందు విశ్వాసముంచుడి) నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు. లేనియెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి, మీకు స్థలము సిద్ధపరచిన యెడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరల వచ్చి, నాయొద్ద నుండుటకు, మిమ్మును తీసికొని పోవుదును. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము, మీకు తెలియునని చెప్పెను.

కీర్తనలు 31:1-6

యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి, నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు, నాకు ఆశ్రయ శైలముగాను, ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.  నా కొండ, నాకోట, నీవే. నీ నామమునుబట్టి త్రోవ చూపి, నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై, శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి, నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించు చున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.  నేను యెహోవాను నమ్ముకొని యున్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు.

మత్త 23:1-14

అప్పుడు యేసు, జనసమూహములతోను, తన శిష్యులతోను ఇట్లనెను. శాస్త్రులును, పరిసయ్యులును, మోషే పీఠమందు కూర్చుండువారు, గనుక, వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి. అయినను, వారి  క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని, చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి, మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని, తమ వ్రేలితోనైన, వాటిని కదలింప నొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తము, తమ పనులన్నియు చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దవి గాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, ​సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు, కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు, గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు, మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించుకొను వాడు, తగ్గింపబడును. తన్నుతాను తగ్గించుకొనువాడు, హెచ్చింపబడును. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల యెదుట పరలోక రాజ్యమును మూయుదురు. ​మీరందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింప నియ్యరు.

కీర్తనలు 113:1-9

యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యెల్లకాలము, యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని, సూర్యాస్తమయము వరకు, యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి యెదుట మహోన్నతుడు. ఆయన మహిమ, ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది. ఉన్నతమందు ఆసీనుడైయున్న, మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగి, చూడననుగ్రహించు చున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో, వారిని కూర్చుండబెట్టుటకై, ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పమీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

Telugu BIBLE Verses

మార్కు 13:14-23

మరియు నాశకరమైన హేయ వస్తువు, నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు, చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దెమీద ఉండువాడు, ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై, దిగి, అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు, తన వస్త్రము తీసికొనిపోవుటకు, ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును, పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి, ఇదివరకు అంత శ్రమ కలుగలేదు. ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని యెడల, ఏ శరీరియు తప్పించు కొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా, తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము, ఆయన, ఆ దినములను తక్కువ చేసెను. కాగా, ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని, యెవడైనను మీతో చెప్పిన యెడల, నమ్మకుడి. ఆ కాలమందు, అబద్ధపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైన యెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై, సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో, సమస్తమును, మీతో ముందుగా చెప్పియున్నాను.

మార్కు 14:22-25

వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి, విరిచి, వారికిచ్చి, మీరు తీసికొనుడి. ఇది నా శరీరమనెను. పిమ్మట, ఆయన గిన్నె పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దాని వారి కిచ్చెను. వారందరు దానిలోనిది త్రాగిరి. ప్పుడాయన, ఇది నిబంధన విషయమై (కొన్ని ప్రాచీనప్రతులలో – క్రొత్త నిబంధన విషయమై అని పాఠాంతరము) అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో, ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు, ఇకను దానిని త్రాగనని, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

Telugu Bible Online – Study PC Mobile

Telugu Bible Online - Study PC Mobile

Telugu Bible Online is a place to read whole Bible in Telugu on PC or on your computer. Many people think Telugu Bible online is to buy but it is not true. It is totally free to read and download on your pc tablet phone or laptop. Bible study is the best way to communicate with God and know his plans for us in our lives. Telugu Bible keerthanalu are included in this for you to read the scriptures. Here we present not Telugu catholic Bible but a protestant Bible.

Telugu Bible Online - Study PC Mobile

Telugu Bible download for pc అనేది అందరికి ఒక మంచి అవకాశం బైబిల్ చదవడానికి. ఆన్లైన్ లో బైబిల్ మీకొరకు పొందు పరిచయము ఇక్కడ . త్వరలో మీకొరకు Telugu Bible dictionary ని కూడా మన వెబ్సైటు నందు పెట్టుకుతస్కు ప్రయత్నిస్తున్నము . దేవిని వాక్యమును ధ్యానించి దాని యందు మనము నడుకుందాం. అది మనకు మన పిల్లలకు ఆశీర్వాదకరం . వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెనను సత్యము మనకు అందరికి తెలుసు. అది మాత్రమే మానాలనుయ్ నిత్యాగ్ని నుండి రక్షింపగలడు. అందుకని వాక్యమును అశ్రద్ధ చేయకుండా ప్రతిదినము చదువుదాం. దానిని అభ్యాసము చేద్దాం. మీకొరకు ఇక్కడ పెట్టబడిన తెలుగు బిల్ ను మీరు చదివి ఆశీర్వాదము పొందుతారని నమ్ముతున్నాం.

Telugu Bible Online

బైబిలు దేవుని యందు భక్తి విశ్వాసాలను పెంచుతుంది. ‘వీరు (బెరయ సంఘములోని వారు) థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు, ఆలాగున్నవో లేవో అని, ప్రతి దినమును, లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత, వారిలో అనేకులును, ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను, పురుషులలోను, చాల మందియు విశ్వసించిరి’ (అ కా 17:11-12)

కుటుంబ ప్రార్ధనలలో లేదా వ్యక్తిగతంగా ప్రతి రోజు, అనుకూల సమయంలో బైబిలు గ్రంథంలోని ఏదో ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఒక సంవత్సర కాలంలో బైబిలు గ్రంథాన్ని పూర్తిచేయాని విశ్వాసులు అనుకొంటారు.  బైబిలును ఒక గ్రంథాలయమని అనుకున్నప్పుడు, ఆ గ్రంథాలయంలోని గ్రంథాలను చదవడం ఎలా? కేటలాగు లేదా పుస్తకాల పట్టికను బట్టి మొదటి గ్రంథం నుండి అలా వరుసగా చివరివరకు బైబిలు చదవడం వలన అవగాహనలో యిబ్బంది కలుగవచ్చు. ఈ రోజు ఏ అంశం చదివితే బాగుంటుందని అనుకొంటూ, పేజీలు తిప్పి వెదకే అనుభవం కొందరు కలిగియుంటారు. అలా చదవడం వలన వారికి ఆసక్తి కలిగించిన వాక్య భాగం లేదా కీర్తన ఎన్నో మార్లు చదవబడి, కొన్ని ప్రాముఖ్యమైన వాక్య భాగాలు అనుభవం లోనికి రాకుండా పోతాయి. మరి యెలా చదివితే బాగుంటుంది?

We are trying to get the Telugu Bible audio for you on our website and we will help you for sure if you really need it. Bible index in Telugu will also be made available for you in the near future on our platform suvarthaswaram.com.

Complete Bible Study Telugu – One Year BIBLE

One year Telugu Bible

When you are looking for Bible Study Telugu Complete BIBLE in 365 Days we are here to give you the best. One Year Bible Study needs to cover Complete BIBLE in 365 Days of a year. This One Year Planner will guide you in a perfect planner to study scriptures in an orderly manner.

ప్రతిరోజు కేవలం 5 నిముషాలు బైబిల్ చదువుకొని, ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తిచేయవచ్చు!

ఇది స్పీడ్ యుగం. బైబిలు చదవాలని మనస్సులో ఉన్నప్పటికీ, సమయం కేటాయించలేక పోతున్నామని, కాల చక్రంలోని చాలామంది క్రైస్తవ విశ్వాసులు బాధపడుతుంటారు. వారి కోసమే ఈ యాప్. (పుస్తకం.) ప్రయాణాలలోనైనా, పని స్థలం, బడి లేదా కాలేజీలలో బ్రేక్ సమయంలోనైనా, బైబిలు చదువుకోవాలనుకొంటే, ఆ సమయంలో బ్యాగులో నున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడడానికి, కొందరికి బైబిలు హేళన చేయబడుతుందేమో నన్న భయం, మరి కొందరికి మొహమాటం. అలా సమయా భావం లేదా బిడియం గలవారి కోసం కేవలం 5 నిముషాలు మాత్రమే తీరిక చేసుకొని తమ మొబైల్ ఫోనులో చదివి, ఒక సంవత్సర కాలంలో బైబిలు పూర్తిచేయడానికి సహాయపడేదే ఈ యాప్. (పుస్తకం.)

లోకానికి దేవుడు అనుగ్రహించిన గ్రంథాలు రెండే రెండు. మొదటి గ్రంథం దేవుని మహిమైశ్వర్యమును వివరించే సృష్టి కాగా, మానవాళి మేలు కొరకు తన ప్రవక్తలచే వివరించబడి, తరతరాలకు అందించబడిన రెండవ గ్రంథం బైబిలు. బైబిలు గ్రంథం కాలంతో నిమిత్తం లేని గ్రంథం. (Age less Book) అది రెండు ఖండాల భూభాగంలో విస్తరించి, మూడు భాషలలో, వందల మంది భక్తులచే, వేల సంవత్సరాల కాలంలో వ్రాయబడిన గ్రంథాల కూర్పు. వాస్తవానికి బైబిలు అను పేరుకు మూల నామమైన గ్రీకు భాషలోని ‘బిబ్లోస్’ అనే మాటకు ‘కాగితపు చుట్టలు’  అని అర్ధం. బైబిలు ఒక గ్రంథం కాదు. అది గ్రంథాల సమూహం. ఒక గ్రంథాలయం.

365 DAYS BIBLE in Telugu one year bible planner

బైబిలు చదవడం తప్పనిసరి: బైబిలు చదవనవసరం లేదన్న మినహాయింపు ఎంతటి భక్తునికై నా, విశ్వాసికైనా లేనే లేదు. ‘మనమాయనయందు (దేవునియందు) బ్రదుకుచున్నాము. చలించు చున్నాము. ఉనికి కలిగియున్నాము. అటువలె, మన మాయన సంతానము’ (అ కా 17:28)

బైబిలులో నిత్యజీవమున్నది: ‘లేఖనములయందు, మీకు నిత్యజీవము కలదని తలంచుచు, వాటిని లేక పరిశోధించుడి. అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి’  (యోహా 5:39) ‘క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా, రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు, శక్తిగల పరిశుద్ధ లేఖనములు’ (2 తిమోతికి 3: 14-15)

బైబిలు ప్రయోజనకరమైనది: ‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును, ప్రయోజనకరమై యున్నది’ (2 తిమోతికి 3:16-17) ‘యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును’  (కీర్త 19:7)

అలాగున ఆలోచించే వారి కోసం బైబిల్ గ్రంథము కాలానుక్రమముగా (Chronologically) కూర్పుచేయబడి, పాత నిబంధన లేదా క్రొత్త నిబంధనలోని వాక్య భాగం మాత్రమే కాకుండా, దేవుని స్తుతించి, ఆరాధించే స్వభావం  కలిగిన దావీదు మహారాజు కీర్తలలలో ఒక కీర్తన గాని, కొంత భాగము గాని ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా ఈ యాప్ (పుస్తకం) సిద్ధం చేయబడింది. ఆత్మసంబంధమైన సౌందర్యం కలిగి, చదవగానే దాని భావాన్ని గ్రహించడం కష్టతరమైన సొలోమోను రచించిన పరమ గీతములు తప్ప ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు అన్ని గ్రంథాలలోని లేఖన భాగాలు ఒక సంవత్సర కాలంలో చదువుకోవడానికి వీలుగా ఈ యాప్ (పుస్తకం) సంకలనం చేయబడింది.

ఒక దినం, 24 గంటలలో కేవలం ఐదు నిముషాలు మాత్రమే వినియోగించి, బైబిలులో యిమిడి యున్న జీవితానికి కావలసియున్న దీవెనలు, ఆశీర్వాదాలు, ధన్యతలు, హెచ్చరికలు పొందుకొనునట్లుగా ఒక సంవత్సర కాలములో బైబిలులోని అన్ని గ్రంథాలను ధ్యానం చేయడానికి  ఈ యాప్ (పుస్తకం) సహాయం చేస్తుంది. సమయం అనుకూలించినప్పుడు, ఆ రోజుకు ప్రస్తావించబడిన వాక్య భాగాన్ని తమ బైబిలులో మరింత విస్తృతంగా చదువుకోవచ్చు. అలాగున దేవుని కొరకైన తమ తృష్ణను సంపూర్ణముగా తీర్చుకోవచ్చు.

One year Telugu Bible

ఈ యాప్ (పుస్తకం) బైబిలు గ్రంథం యొక్క సంగ్రహం (Summary) కాదు. బైబిలు గ్రంథానికి ప్రత్యామ్న్యాయం కాదు. బైబిలు గ్రంథములో యిమిడియున్న అపారమైన సంపదలో కేవలం కొంతమేరకు సంగ్రహించడానికి ఒక భక్తుడు చేసిన ప్రయత్నం మాత్రమే.

‘మీ మనో నేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన, క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న, తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన, మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించును గాక. ఆమేన్! (ఎఫె 1: 17-19)