దేవుని నామం వ్రాయబడిన విధానం Names Of GOD From BIBLE & Meanings

తెలుగు మరియు ఇంగ్లీషు బైబిళ్ళలో దేవుని నామం వ్రాయబడిన విధానం

తెలుగు బైబిలులో దేవుడు అని వ్రాయబడిన చోట మూల భాషయైన హెబ్రీ భాషలో మాత్రం, ఎల్, ఎలోహ, ఎలోహీం అని సందర్భానుసారంగా ఏక వచన లేదా బహువచన రూపంలో వ్రాయబడింది. ప్రాముఖ్యమైన ఉదాహరణగా ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’ (ఆది 1:1) అని వ్రాయబడి నప్పుడు, (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు) యిమిడియున్న దేవుని సంయుక్త నామముగా దేవుడు (ఎలోహీం) అని వివరించబడింది.

‘దేవుడు .. సృజించెను’ ‘దేవుడు, మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము’ (ఆది 1:26) అని వ్రాయబడిన రీతిగా, త్రిత్వమైయున్న దేవుడు ఆ కార్యమును జరిగించెను అను భావం అందులో వ్యక్తమైయున్నది. దేవుని నామంలో గల యిట్టి లోతైన మర్మాలు బైబిలులో అనేకములున్నాయి.

హెబ్రీ, గ్రీకు భాషలలో నుండి తర్జుమా చేయబడిన తెలుగు బైబిలులో దేవుడు, ప్రభువు లేక యెహోవా అని దేవుని నామములు వ్రాయబడగా, ఇంగ్లీషు బైబిలులో God, GOD, Jehovah, LORD, THE LORD, Lord, Lord GOD, LORD God అని పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాల కూర్పుతో మరి కొంత వివరంగా దేవుని నామములు ప్రస్తావించబడినాయి.

తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో దేవుని నామం వ్రాయబడిన విధానం:

దేవుడు – God = ఎలోహీం (Elohim)
యెహోవా – GOD = జెహోవా (Jehovah)
దేవుడు – GOD = ఎల్ (El)
దేవుడు – GOD = ఎలోహ (Eloah)
ప్రభువు – LORD = యెహోవా (Jehovah)>br>ప్రభువు – THE LORD = జె యె హెచ్ (Jah)
ప్రభువైన – Lord = అదోనాయ్ (Adonai)
ప్రభువైన – LORD = అదోనిం (Adonim)
సర్వ శక్తిగల – ALMIGHTY = షద్దయ్ (Shaddai)
సర్వోన్నతుడు – MOST HIGH = ఎలియోన్ (Elyon)
ప్రభువైన యెహోవా – Lord GOD = అదోనాయ్ జెహోవా (Adonai Jehovah)
యెహోవా దేవుడు – LORD God = జెహోవా ఎలోహీం (Jehovah Elohim)
సర్వోన్నతుడైన దేవుడు – MOST HIGH GOD = (Elyon El)

పాత నిబంధన గ్రంథం నందలి దేవుని నామముల విశ్లేషణ:

OLD Testament Names of GOD

దేవుడు = ఎలోహ లేక అలాహ్ (Eloah or Ehlah) మరియు ఎలాహ (ELAH, or ELAHAH) – దేవుని ఏక రూపం లేదా ఏక వచన నామం. కొన్నిసార్లు త్రియేక దేవుని ఒకే సంయుక్త నామంగాను లేదా తండ్రియైన దేవుని పేరుగాను సందర్భానుసారంగా ఎలోహ అని 56 సార్లు, ఎలాహ అని 77 సార్లు బైబిలు గ్రంథంలో వ్రాయబడింది.
దేవుడు = ఎలోహీం (ELOHIM) – ఏక వచన రూపమైన ఎలోహ (Eloah) అను నామానికి బహువచనంగా ఎలోహీం అను నామము వ్రాయబడింది. అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, అను మూడు మూర్తిమంతములు ఏకమైయున్న రూప నామం. దేవుడు త్రిత్వమైయున్న దేవుడు అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు బైబిలులో వ్రాయబడినాయి. ‘మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము’ (ఆది 1:26) ‘.. ఆదాము మనలో ఒకనివంటివాడాయెను’ (ఆది 3:22) దేవుడు అనగా ఎలోహీం అను నామం 2500 సార్లు బైబిలు గ్రంథంలో వ్రాయబడింది.
దేవుడు = ఎల్ (EL) – (ఏకవచన రూపం) సర్వోన్నతుడైన, సర్వ శక్తిమంతుడైనవాడు, భూమ్యాకాశములు తన స్వాధీనంలో గలవాడు. (యింగ్లీషు బైబిలులో GOD అని వ్రాయబడి యుంటుంది) దేవుని సంయుక్త నామంగా వివరించడానికి ఈ నామం బైబిలులో 250 సార్లు ఉపయోగించబడింది. ఉదా: El Bethel (ఎల్ బేతేల్) – బేతేలు దేవుడు; El Elyon (ఎల్ ఎలియోన్) – సర్వోన్నతుడగు దేవుడు; El Emunah (ఎల్ ఎమునః) – నమ్మదగిన దేవుడు; El Gibbor (ఎల్ గిబ్బార్) – The Mighty God (బలవంతుడైన దేవుడు; El Hakabodh (ఎల్ హకబోద్) – మహిమగల దేవుడు; El Ra’i (ఎల్ రా’ యి) – చూచుచున్న దేవుడు; El Sela (ఎల్ సెల) – నా ఆశ్రయ దుర్గమైన దేవుడు; El Shaddai (ఎల్ షద్దయ్) – సర్వశక్తిగల దేవుడు.
యెహోవా (Jehovah): సర్వ సృష్టికి మూలకర్తగా దేవుడు (ఎలోహీం – Elohim) అని బైబిలు గ్రంథములో వివరించబడి యుండగా, దేవుని నిత్యత్వమును సూచించు నామము యెహోవా. ‘నిత్యదేవుడైన యెహోవా’ (ఆది 21:33) అను సంకేత నామము. దేవుడు, తాను సృజించిన వారితో ఏర్పరచిన నిబంధనను (Covenant) వెల్లడి పరచే దేవుని నామమే యెహోవా. యెహోవా అనగా, తన ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు (God of Israel) అందుకొరకే, యెహోవా అంటేనే, నా దేవుడు అని అర్ధం గనుక, నా దేవా (My God) అని అనవచ్చును గాని, నా యెహోవా (My Jehovah) అని అనకూడదు. బైబిలు గ్రంథములో 7600 సార్లు కనబడే ఈ నామము ఎక్కువ సార్లు ప్రభువు (The LORD) అని మరియు తక్కువ సార్లు యెహోవా (Jehovah) అని తర్జుమా చేయబడింది.

యెహోవా = జె యె హెచ్ (JAH): దేవుని స్తుతించి ఆరాధించు సమయంలో నిర్గమ కాండము, కీర్తనలు మరియు యెషయా గ్రంథాలలో మొత్తం 49 సార్లు మాత్రమే ఉపయోగించబడిన నామం. తెలుగు బైబిలులో యెహోవా అని చెప్పబడింది.

ఉండునను వాడు: (యెహ్యే అషెర్ యెహ్యే – Ehyeh asher ehyeh – I will be that I will be) ఒక్క మాటతో దేవుని మూడు కాలముల నిత్యత్వాన్ని గురించి ప్రస్తావించబడిన నామం. ‘నేను ఉన్నవాడను, అను వాడనైయున్నాను’ ‘ఉండునను వాడు’ (నిర్గ 3:14) ఈ నామం ప్రత్యేకమైన నామం. అది నిత్యత్వమును సూచించు నామం. ‘నిత్యము ఉండువాడనైన నేను, ఆలాగున కొనసాగుచున్న వాడను మరియు మార్పు లేకుండా అలాగుననే కొనసాగు వాడను’ (I that ever will be, I continue to and will what I continue to be and will be) ‘వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాడు’ (ప్రక 1:4) అని ప్రకటించిన దేవుని స్పష్టమైన నామం.

సర్వశక్తిగల దేవుడు (Almighty God) – El Shaddai (ఎల్ షద్దయ్) :– సర్వశక్తిగల దేవుడు మరియు సర్వసమృద్ధి గల దేవుడు అని అర్ధం కలిగిన దేవుని నామం సుమారుగా 48 సార్లు బైబిలులో వ్రాయబడింది.
ప్రభువు (Lord) – అదోన్ (Adon) = ఇది దేవుని ఏక వచన నామంగా సుమారుగా 30 సార్లు బైబిలులో వ్రాయబడింది. ప్రభువు (Lord), సర్వాధికారియైన ప్రభువు (Sovereign-Lord) యజమానుడు (Master), హక్కుదారుడు (Proprietor) అను భావం కలిగియున్న నామం. ఉదా: ‘సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరు, ప్రభువైన యెహోవా (అదోన్ జెహోవా – Adon Jehovah) సన్నిధిని కనబడవలెను’ (నిర్గ 23:17)

ప్రభువు (Lord) – అదోనయ్ (Adonahy) = ఇది దేవుని బహు వచన నామం. సుమారుగా 290 సార్లు బైబిలులో వ్రాయబడింది. లోక పాలకునిగా సర్వాధికారియైన ప్రభువు, (Sovereign-Lord) యజమానుడు, (Master) హక్కుదారుడు, (Proprietor) అను భావం కలిగిన నామం. ఉదా: ‘ప్రభువైన యెహోవా’ (ఆది 15:2) స్పష్టంగా అర్ధం చేసుకోవాలంటే, అదోన్ (ప్రభువు) అనగా పాలకుడని, అదోనిమ్ (ప్రభువు) అనగా యజమానుడని అదోనయ్ (ప్రభువు) అనగా ఆశీర్వాదకారకుడని చెప్పుకోవచ్చు.

కొత్త నిబంధన గ్రంథములో దేవుని నామములు: New Testament Names of GOD

దేవుడు [God – థియోస్ (Theos)] – హెబ్రీ భాషలోని ఎల్ (El) ఎలోహ (Eloah) ఎలోహీం (Elohim) అను నామములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఒక్కొక్కరి లేదా, సంయుక్తముగాను వివరించడానికి ఏక వచన లేదా బహు వచన రూపంలో దేవుడు [God – థియోస్ (Theos)] అని గ్రీకు భాషలో వ్రాయబడింది.

తండ్రి [Father – పాటర్ (Pateer)] – దేవుడైన యెహోవా (Jehovah) నామం క్రొత్త నిబంధనలో తండ్రి అని గ్రీకు భాషలో వ్రాయబడింది.

ప్రభువు [Lord – డెస్పోటెస్ (Despotees)] – సర్వాధికారియైన ప్రభువు అని తండ్రియైన దేవుని మరియు కుమారుడైన దేవుని నామంగా గ్రీకు భాషలో క్రొత్త నిబంధన యందు వ్రాయబడింది.

ప్రభువు [Lord – క్యూరియోస్ (Kurios)] – యజమానుడు, కర్త అని దేవుడైన యెహోవా మరియు కుమారుడైన యేసు క్రీస్తు గురించి గ్రీకు భాషలో క్రొత్త నిబంధన యందు వ్రాయబడింది.

యేసు – [Jesus – ఈసస్ (Ieesous)] – యెహోషువా లేదా యెషువా అను హెబ్రీ నామం యొక్క గ్రీకు రూపమే యేసు. యెహోవా సహాయకునిగా నున్నవాడు, యెహోవాయే రక్షణ, యెహోవాయే విజయము, యెహోవాయే భాగ్యశాలునిగా చేయువాడు, యెహోవాయే రక్షకుడు, విమోచకుడు, సహాయకుడు, వర్ధిల్లజేయువాడు, యెహోవా ద్వారానే విమోచన అని యెహోషువా లేదా యెషువా అను హెబ్రీ నామమునకు అర్ధం. ‘ప్రజలకు యెహోవా రక్షకుడు’ అని క్రీస్తు యొక్క జన్మ నామం యేసు. ‘తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ (మత్త 1:21)

క్రీస్తు = క్రైస్ట్ (Christ) – క్రిస్టోస్ (Christos) = మెస్సియా (The Messiah) అని హెబ్రీ భాషలో వ్రాయబడిన మాటకు అభిషక్తుడు (The Anointed) అని అర్ధం కలిగిన గ్రీకు భాష నామమే క్రిస్టోస్.

దేవుని తలంపును బట్టి ఒక మానవుని లక్షణ స్వభావాలు ఎలాగుండాలో చూపించబడిన వ్యక్తియే యేసు. అలాగే అట్టి తలంపుయొక్క సంపూర్ణతయే క్రీస్తు. ఉన్నవాడను అను దేవుని దృశ్యరూపకమైన మూర్తిమంతమే యేసు క్రీస్తు.
మనిషికి దిశా నిర్దేశము చేస్తూ, మానవునిలో నున్న ‘నేను’ (I) అను వ్యక్తిత్వం, దైవ సంబంధమైన గ్రహింపు లోనికి, అటుపిమ్మట ‘నేను ఉన్నవాడను’ (I Am) అను స్థాయికి చేరిన ఒక మానవుని యొక్క రూపమే యేసు క్రీస్తు. శ్రమలు, శోధనలు, మానసిక కల్లోలాలు తన జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ, పాపరహితునిగా జీవించిన యేసు క్రీస్తు దేవుడు కోరుకున్న ఒక మాదిరికరమైన నరునికి చిహ్నం.

యేసు క్రీస్తు [జీసస్ క్రైస్ట్ (Jesus Christ)] – ఈ లోకంలో జీవించి, మరణించినవాడు లేదా విధేయుడై లోకంలో జీవించి పిమ్మట మహిమపరచబడి అభిషక్తుడైనవాడు అని వివరించడానికి ఉపయోగించబడిన నామం. (యేసు యొక్క ఈ లోక జీవితం ఈ నామానికి గల ప్రాముఖ్యత.)

క్రీస్తు యేసు [క్రైస్ట్ జీసస్ (Christ Jesus)] – మృత్యుంజయుడై మహిమపరచబడి, పరలోకపు యాజకత్వం నిమిత్తం అభిషేకం (క్రీస్తు) పొందుట కొరకు విధేయుడైన యేసు అను భావం కలిగిన నామం. (అభిషక్తుడైన యేసుగా ఈ నామం యొక్క ప్రాముఖ్యత.)

మన ప్రభువైన యేసు క్రీస్తు లేక మన ప్రభువు యేసు క్రీస్తు (Jesus Christ our Lord, or our Lord Jesus Christ) – మరణ పర్యంతం విధేయత చూపి, తన స్వరక్తంతో తన ప్రజలను విమోచించి, ప్రభువుగా ఉన్నత స్థానంలో నిలిచియున్నవానిగా గుర్తించబడినవాడు.

Message on Names of GOD

క్రీస్తు యొక్క యెహోవా దేవునికి సంబంధించిన నామములు

“యేసు-అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (యోహ 8:58)

క్రీస్తు యొక్క దైవత్వమునకు సంబంధించిన వివరములు బిబ్లె నందు ఎన్నో వివరించబడియున్నప్పటికీ, బహుషా దేవునితో గుర్తించబడిన ఏసుప్రభువు యొక్క నామములు మాత్రమే ఆది సంఘములో ఎంతో అభిలాషణీయమైన నామములుగా వున్నవి.

మోషే కాలముకంటే ముందుగానే యెహోవా అను నామము ఉపయోగిన్చబడినప్పటికి , సాటిలేని దాని భావమును మోషే కాలములోనే దాని దేవుడు బయల్పరచి యున్నాడు (నిర్గ6:3). అది పాతనిబంధనలో దేవుని యొక్క నిబంధన నామము. అది క్రియా పదము “ఉన్నవాడు” (to be) యొక్క రూపమై యుండి రెండు మార్లు ఉపయోగించబడినది. ఇశ్రయెలియులయొద్దకు వెళ్లి మీ పితరుల దేవుడు మే యొద్దకు నన్ను పంపెనని చెప్పినప్పుడు – ఆయన పేరేమి అని వారు అడిగినఎదల వారితో నేనేమి చెప్పవలెనని మోషే దేవుని అడిగినప్పుడు-“నేను ఉన్నవాడను, అనువాడనై యున్నానని దేవుడు మోషే తో చెప్పియున్నాడు. “నేను ఉన్నవాడను” (‘నేనే’) (Iam) అనగా యెహోవా దేవుడే. ఇంగ్లీషు బిబ్లె లో ని ఈ నామము “దేవుడు” (లార్డ్-LORD) అని పెద్ద అక్షరములు (capital letters) లో వ్రాయబడియున్నది.

పాతనిబంధన గ్రంధమునందు యెహోవా(Jehovah) అను నామము దేవునియోక్క నామములన్నిటిలో అత్యంత ఘనమైన నామము. లేఖనముయోక్క ప్రతులను శాస్త్రులు తయారు చేస్తున్న్నప్పుడు ఈ పేరు వ్రాయవలసి వచినప్పుడు వారు శుచులై వారి బట్టలు మార్చుకొని మరి క్రొత్త కాలము(పెన్ను) మరియు సిరా(ink) ఉపయోగించి ఈ నామమున్ వ్రాసేవారు. గ్రంధములు చదువ వలసి వచిన్నప్పుడు ఈ పేరు ఉచ్చరిమ్పవలసి వస్తే దానికి బదులుగా ‘అదోనాయ్’ (Adonai) అని పలికే వారు. ఈలాగు గౌరవ సూచకముగా ఈ పేరు బదులుగా వేరుపెర్లు వాడుకలోనికి వచ్చినందున, ఈ నామము యొక్క ఉచ్చారణ విషయములో చాల చాల సరియైన తర్జన భర్జనలు జరిగియున్నవి.అనేక మంది మితవావద వేదాంత పండితులు ఈ నామమును యెహోవా (Je-hov-ah) అని పలకాలని వాదించినా, ఉదారవాద భోధకులు ఈ నామమును యెహ్ వ (Yah-weh) అని పలకాలని వాదిస్తుంటారు. తరతరాలుగా ఈ నామము ఉచ్చారణలో లేని కారణముగా ఈ కాలములో ఎ చర్చ ను పరిష్కరించడం చాల కష్ట సాధనమైనది. హెబ్రీ భాషకు అచ్చులు (Vowels) కలిపినప్పటికీ, ఈ నామము ఎలా  ఉచ్చరించాలోనని నిర్ణయించడం అసాధ్యమైనది. ఉచ్చారణ లేదా మాటతీరు (Dialects)మారుతుంటాయి. ఉదాహరణకు మనం పలికే ఒక మాట సుమారుగా ఎప్పటినుండి 200 సంవత్సరాల తర్వాత పూర్తిగా మారిపోయి పలుకబదవచ్చు. ప్రాంతీయ చరిత్ర మనకు తెలియకపోయినట్లయితే, అమెరికా లో ఆగ్నేయ దిక్కు (South East) ప్రాంతములోని వలసదారులు ఇంగ్లీషు బాషను బ్రిటన్ యాస తో మాట్లాడడాన్ని మనము నమ్మలేకపోతాము. వారు మొదటగా వలస వచ్చినప్పటినుండి ఎన్నో సంవత్సరాలు మరియు తరములు గతించి, వారిదైన ఒక ప్రత్యేకమైన ఇంగ్లీషు వాడుక భాషను సంతరించుకున్నారు. సుదీర్ఘ కాలములో అదే విశ్స్యము హెబ్రీ భాషకు కూడా జరిగియుంటుందని ఎట్టి అనుమానము లేకుండా చెప్పవచును.

యోహాను సువార్త యందు 8 సందర్భాములయందు నేను (ఉన్నవాడను- Iam) అని యేసు ప్రభువు ప్రకటించి షుమారుగా యెహోవా దేవుని గుణ లక్షణములు గలవాదానని బయలుపరచియున్నాడు. ఈ సందర్భములో యోహాను ఉపయోగించిన గ్రీకు మాట ఎగో ఎమి (ego eimi). ఆలాగు వారిద్దరుగురించిన ప్రాముక్యతను ఆయన నిర్దారించినాడు. యేసు ప్రభువు తనను తాను “నేను (Iam) అని చెప్పియున్న యోహాను సువార్త లోని ఎనిమిది సందర్భములు ఈ క్రింది విధముగా నున్నవి. దీనినే మనము ఈ అధ్యాయములో చర్చిన్చుచునాము.

జీవాహారముము నేనే

 

Iam the Bread of Life 6:35
నేను లోకమునకు వెలుగును

 

Iam the Light of the World 8;12
నేనే ద్వారమును

 

Iam the Door 10:9
నేను గొర్రెలకు మంచి కాపరిని

 

Iam the Good Shepherd 10:11
పునరుద్దానమును జీవమును నేనే

 

Iam the Resurrection and the Life 11:25
నేనే మార్గమును సత్యమును జీవమును

 

Iam the Way, theTruth and the Life 14:6
నేనే నిజమైన ద్రాక్షావల్లిని ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు

 

Iam theTrue Vine 15:1,5
నేనేఆయనను-నేను ఉన్నాను- ఆయనను నేనే-నేనేఆయనాను

 

Iam … Iam 4:26, 8:58, 18:5,6,8

 

జీవాహారము-Bread of Life

మెస్సయ్యా వచ్చినప్పుడు యిర్మియా దాచిఉంచిన మందసము పోగొట్టియుండగా ఆయన దానిని కనుగొని అందులో దాచ్యుంచబడిన మన్నా గల పాత్రను ఆయన బయటకు తీయగలడని దానిని బట్టి మెస్సియ్యను గుర్తించగలుగుదునని యూదులు బలంగా నమ్మేవారు, అందును బట్టియే మన్నా లేదారొట్టెగా మెస్సియ్యను గుర్తించేవారు. అంతేకాకుండా మోషే  వంటి ప్రవర్త యని యూదులు నమ్మిన్చినందున (ద్వితీ 18:15) దాని భావము ఆయన పరలోకము నుండిఆహారము (రొట్టె) తేగలదని వారు భావించారు. యూదుల రబ్బీ కీ సంబంధించిన నానుడి యీలాగున్నది. “ఆది విమోచాకునివలె అంతమందలి విమోచాకుడున్డును,తరువాతి విమోచాకుడు కూడా మన్నా కురిపించాగలదు.” అంతే కాకుండా మన్నా దేవుని రాజ్యములోని ఆహారమని యూదులు తలన్చేవారు. మెస్సియాను గూర్చిన ఆశలయందు మన్నా ఒక భాగమని యూదుల మనస్సులో ఒక భావన ఉండేది.

ఇటువంటి ఆలోచన నేపధ్యములో, ఏదో ఒక రోజున యేసుప్రభువును మెస్సియగా గుర్తించేవారు మరుసటి రోజున మన్నా ను గూర్చిన ప్రస్తావన లేవనెత్తుతారనుటలో ఆశ్చర్యపదవలసైన విషయమేమియు లేదు. ఆయన జన సమూహముతో సంభాషించిన రెండు మారులు భుజించుటకొరకు ఆహారము అనగా మన్నా వారు కోరుకొన్నారు. (యోహా 6:30-31-34).

అందుకు ఏసుప్రభువు తానే పరలోకమునుంది వచ్చిన మన్నా అని “జీవాహారము నేనే” (యోహా 6:35) అని ప్రకటించియున్నాడు.ఇట్టి వివరణ ఇచ్చిన సందర్భములో యిట్టి ఎహోవాదేవునికి సంభందించిన తన నామమును బయల్పరచి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నదనియు జీవాహారము నేనే యనియు యోహా 6:32-34) నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగోనడనియు the bread of satisfying life యోహా 6:30-31-34).ఈ ఆహారము భుజించిన వాడేల్లప్పుడు జీవిన్చుననెడి పునరుద్ధాన జీవాహారమనియు the bread of everlasting life (యోహా 6:48-59) అనియు ప్రకటించుచున్నాడు.

తన భౌతిక ప్రాణమును కాపాడుకొనుటకును ఒక వ్యక్తి ఆహారమును యెట్లు భుజించునో, ఆలాగే ఒక క్రైస్తవుడు తన ఆత్మ సంభందమైన జీవమును కాపాడుకోనుటకై జీవాహారమును తప్పక భుజించవలయును. ఆహారము అనగా రెండు వేరువేరు భావములు కలుగునట్లుగా ఏసుప్రభువు భుజించుట గూర్చి రెండు వేరువేరు క్రియాపదములను ఉపయోగించినాడు. మొదటగా నిత్య జీవమును సూచించు విధముగా అది ఎల్లప్పుడు అనిస్చితకాలమును సూచించు విదముగా ‘ఫాగెయిన్’ (phagein)అను క్రియాపదమును ఏసుప్రభువు ఉపయోగించినాడు. (యోహా 6:50,51,52,53) ఒకడు క్రీస్తును తన స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు,అతడు, అట్టి సందర్భములో ఆయన శరీరమును భుజించుచున్నాడు. ఇవి ఒకేఒక్క సారి (once for all) మరియు శాశ్వతమైన రక్షణ గురించిన ప్రస్తావనయై యున్నది. రెండవ క్రియాపదము ‘ట్రోగోన్’ (Trogon) ఎప్పుడు లేదా అలవాటుప్రకారం భుజించుతాను సూచించు వర్తమాన అసమాపక క్రియ. అది మనము నమిలి భుజించు పండ్లు కూరగాయలు లేదా త్రుణధాన్యముల విషయములో ఉపయోగించెడి మాట. కాలమార్పు (change in tense) తద్వారా క్రియారూపక మార్పు (change in verb) నిరంతరము లేదా అలవాటు ప్రకారము ఎల్లప్పుడు జీవాహారమును భుజించ్త ద్వారా మన ఆత్మ సంబందమైన ఆకలిని నిరంతరము త్రుప్తి పరచుకోనడాన్ని సూచించుచున్నది. (యోహా 6:54,56,57,58) ఒక్కమారే(once- for- all)ఆయన శరీరమును భుజించుట శాశ్వితమైన రక్షణ గురించినదైన మొదటి చర్య కాగా, అనుదిన ఆహారము నిరంతరము భుజించుట క్రీస్తుతో మన ఎడతెగని సహవాసమునకు సూచనగాయున్నది.

లోకునకు వెలుగు (Light of the World)

ఎన్నో సందర్భాలలో యుదా మతాదిపతులు యేసుప్రభువును చంపాలని చూశారు. అలాంటి ఒక సందర్భములో యేసుప్రభువు మీద నేరము మోపవలేననిఆయనను శోదిoచుటకు వారు వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీ ని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి ధర్మశాస్త్రములో రాళ్ళు రువ్వి చంపవలెనని ఉన్నదానిని బట్టి నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగియున్నారు. ప్రభువును ఇరకాతములో పెట్టాలని వారు అలా అడిగియున్నారు. ధర్మశాస్త్రము ప్రకారము ఆమెకు శిక్ష విధింపవలెనని ఆయన చెప్పియున్నట్లయితే, ప్రజలు నిరాశపడి ఆయనను వెంబడిoచడం మానేసేవారు. ఆయన గనుక ధర్మశాస్త్రమును సమర్ధించకపోయినట్లయితేమోషే ధర్మశాస్త్రమునకు ఆయన విరుద్ధమని ఆయనపై నేరము మోపి, సినగోగు నుండి ఆయనను బయటకు వెళ్ళగొట్టి దైవదుషణకై ఆయన రాళ్ళతో కొత్తబడియుoడేవాడు. ఆ స్త్రీ పై నేరారోపణ చేసిన వారిలో మార్పు కలిగించి మరియు వ్యభిచారమునందు పట్టుబడిన స్త్రీ కీ రక్షణ అనుగ్రహించుట ద్వారా ధర్మశాస్త్రము యొక్క నిజమైన స్ఫూర్తిని యేసుప్రభువు ఎత్తిచూపియున్నాడు.అదే సమయములో సామాన్య ప్రజలలో ఆయనకు గల ప్రాచుర్యమును మరింత పెంపొందించుకొనియున్నాడు.

ఈ సంఘటన జరిగిన వెంటనే యేసుప్రభువు ఈ లాగు ప్రకటించియున్నాడు-“నేను లోకమునకు వేలుగైయున్నాను.” (యోహ8:12) ఇట్టి ఒక చిన్న ప్రకటనయందు ఈ సువార్తయందు సందర్భానుసారమైన ఎంతో గొప్ప భావము వ్యక్తపరచబడియున్నది. అప్పటివరకు భోదిన్చుచుండిన యేసుప్రభువు వ్యభిచారమునందు పట్టుబడిన స్త్రీ కొరకైన సభలో ఈ మాటలు పలికియున్నాడు. అక్కడ ఆ ప్రాంతములో నాలుగు బంగారు పాత్రలు కలిగిన నాలుగు దీపస్తంభములున్నవి. వారము క్రితము జరిగిన పర్ణశాల పండుగ (feast of tabernacles) సందర్భముగా ఈ పాత్రలన్నీ నూనెతో నింపబడి వెలిగింపబడియున్నవి. అట్టి దీపపుకాంతి  ఎంతో ప్రకాశవంతముగాయుండి యెరుషలేము పట్టణమంతటికిని వేలుగిచ్చియున్నదని సమకాలీన పరిశీలకులు నిర్దారించియున్నారు. యేసుప్రభువు చుట్టూ గుమిగూడిన వారందరూ గత రాత్రి యందలి దీపపు వెలుగును చూచియుంటారనే విషయములో ఇట్టి అనుమానమూ లేదు.

“నేను లోకమునకు వెలుగైయున్నాను” అని తనకు తాను వ్యక్త పరచుకోన్నప్పుడు, అరణ్యములో ఇస్రాయేలియులను నడిపించిన మేఘస్తంభము, అగ్ని స్తంభము విషయమును సూచన ప్రాయంగా యేసుప్రభువు తెలియజేసి యుండ వచ్చును.ఉత్సవాల (పండుగ) సందర్భముగా దేవాలయము ప్రకాశమానముగా చేయుట, మేఘస్తంభము అగ్ని స్తంభమును గురించి ప్రజలకు జ్ఞాపకము తెచ్చుటయే. ఎంతో మంది యూదులు ఇట్టి ప్రక్రియను దేవుని యొక్క స్వయం ప్రత్యక్షత యనెడి దివ్య జ్ఞానముగా పరిగణించియుండవచ్చును. ఎలాంటి పూర్వాపారాలు యేసుప్రభువు మనస్సులో ఉండియున్నట్లయితే, “నేను లోకమునకు వెలుగైయున్నాను” అని ఆయన చెప్పిన మాటలు ఆయన యొక్క దైవత్వనామముగా ప్రస్పుటము చేయబడియున్నది.

యేసుప్రభువు సుర్యొదయము గురించి కూడ సూచించియుండవచ్చు. ఆయన చాల పెందలకడనే ఆయన భోదించుట అంటే సుర్యొదయము కంటే కొంచము ముందుగా ప్రారంభించియున్నాడు. (యోహా8:2). యేసు ఆ మాటలు చెప్పుచున్నప్పుడు అప్పుడే ఉదయించుచున్న సూర్యుడు ఆకాశామునందు  కనబడుచున్దవచ్చు. పాలస్తీనా దేశము కొండలతో కూడి యున్న ప్రదేశము గనుక ఆ దేశములో సుర్యొదయము అకస్మాత్తుగాను ఎంతో వీనుల విన్డైనది గాను వుంటుంది. ఒక గంట లోపే వెలుగు రేఖలలో మార్పు జరిగి రాత్రి చీకట్లు ముగిసిపోయి దిన ప్రకాశము మొదలవుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన సుర్యొదయము కనుకనే “తన అంతఃపురమునుండి బయలుదేరు పెండ్లి కుమారునివలె వున్నాడు.” (కీర్త 19:5) అది దావీదు మహారాజు సురుని సరిపోల్చియున్నాడు.

మేస్సియ్య రాక వెలుగు వచ్చిన్నట్లుoడుననెడి పాత నిభందన ప్రవచానములను బట్టి “నేను లోకమునకు వెలుగైయున్నాను” అని యేసుప్రభువు చెప్పిన విషయమును మనము మరింత గ్రహించుటకు మరిఒక సందర్భముగా మనము భావించ వచ్చును. “నీవును గలిలయుడవా? విచైంచి చూడుము, గలిలయ లో ఏ ప్రవక్త పుట్టదనిరి” (యోహా7:52) అని అంతకు ముందు రాజు సన్హేద్రిన్ (sanhedrin) సభలోని నికోదేము సహచారులు ఆయనను సున్నితముగా దూషించియున్నారు.  అందుచేతనేమో ఇట్టి యుదా మతాదిపతులకు మరచిపోయిన చాలా ప్రాముక్యమైన ప్రవచానములను ( యెష 9:1; 42:6;49:6; 60:1-6, మలా గుర్తుచేయుట కొరకై 4:2) వారికి “నేను లోకమునకు వెలుగైయున్నాను” అని తనను తాను యేసుప్రభువు ప్రకటించుకొని యున్నాడు. వెలుగుప్రకాశము ప్రత్యేకముగా గలిలయ ప్రాంతమునందు జరుగునాను ఈ ప్రవచానములయందు ప్రత్యేకముగా ప్రస్తావించబడి యున్నది.

యేసుప్రభువు నిజముగా లోకమునకు వెలుగైయున్నాడన్న భావము మరియొక సందర్భములో కూడా ప్రస్పుటము చేయబడి యున్నది. యేసుప్రభువు యొక్క వెలుగు తన పాపముల నిమిత్తము పశ్చ్చాతాప్పపడని పాపి యెద్ద వికర్శింపబడుతుంది కాని , తన పాపముల నిమిత్తము  పశ్చ్చాతాప్పపడు పాపికి మాత్రం ప్రకాశము కలిగించును. యేసుప్రభువు పలికిన ఈ మాటలకు కొద్దిసేపటిముందు వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ విషయములో తీర్పు కొరకు తమంతట తామే నీతిమంతులమనుకొంటున్న యుదా మత పెద్దలలో మార్పు తెచ్చుటకై యేసుప్రభువు సంభాహించియున్నారు.అపోస్థలుడైన యోహాను ఈ సందర్భములో “శిక్షవిదిoపలేదా?” (convicted) అను మాట కొరకు ఎలెగెకోమినోయ్ (elegechomenoi) అను పదమును ఉపయోగించినాడు. (యోహా8:9) దాని అసలైన భావము “వెలుగులొనీ తెచ్చి మరియు బహిర్గతపరచుట”. ఒక వుత్తరమును వెలుగులోనికి తెచ్చి దానిలో ఏమి ఉన్నదో చూచుట అను కార్యమును అది వివరించుచున్నది. మనుష్యులు జీవితము లోని అంతర్గతముగా లోలోపల దాగియున్న పాపము యేసుప్రభువు తన వెలుగును బట్టి బహిర్గత పరచునన్న భావమును బట్టి ఆయన లోకమునకు వెలుగైయున్నాడు. ఈ మనుష్యులు పాపము గురించి దోషారోపణ ఆయన చేయుచున్నప్పుడు వారు పశ్చ్చాతాప్పపము పొందుటకు ఇష్టపడని యెడల వారు ఆయన సన్నిధిలో నిలువలేరు. వారి పాపముల నిమిత్తము దోషారోపణ చేయబడి వారు పశ్చ్చాతాప్పపము పొందుటకు అంగీకరించకపోవడము వలన చాలామంది ప్రజలు ఈ కాలమున దేవిని నుండి దూరముగా పారిపోవాలని చూస్తున్నారు.

యేసుప్రభువు లోకమునకు వెలుగైయున్నాడు, మరియు మాములుగా దాగియున్న లేదా కనపడని దానిని వెలుగు ప్రసరింపజేసి బహిర్గత పరచుటయే వెలుగు యొక్క ప్రాధమిక కార్యమై యున్నది. క్రీస్తుయోక్క ప్రకాశము తనను తాను (యోహా8:12-20), తండ్రిని (యోహా8:28-30) బహిరంగ పరచుట కొరకే. మానవునిలోని పాపమును ఆయన బహిర్గతపరచుటయేగాక , సమస్య కూడా, పరిష్కారము కూడా ఆయన చూపిఒంచ గలదు. లోకములోని నైతిక చీకటి ఆయన వెలుగైయున్నాడు.

ద్వారము (The Door)

యేసుప్రభువు నేనే ద్వారమును అని తెలిపినప్పుడు, ఒక ద్వారము యొక్క ఉపయోగము లేదా ఒక ద్వారము యొక్క ప్రణాళిక గురించి తనకు తానుగా అన్వయించుకొని యున్నాడు. (యోహా10:9) గొర్రెలు దొడ్డిలోకి ప్రవేశించు ద్వారము సాధనముగాయున్నది. దీనిని మనము అన్వయించుకొన్నట్లయితే , నేనే ద్వారమును అని సూచించుటనుబట్టి రక్షకుడు ఆయనే తప్ప వేరొక మార్గను లేదనియు అట్టి ఆక్షణ సమూహములో  ప్రవేశించుట కేవలము ఆయనే ద్వారముననియు ఆయన బయలు పరచియున్నాడు. గ్రీకు పదము ‘డైయిమావ్ (diemou)’ అనగా నాద్వారానే తప్ప (‘by Me’) అను మాట మానవులు రక్షణ పొందుటకు ఆయనే ఏకైక మార్గమని సూచించు చున్నది.

ప్రభువు యొక్క ఈ ప్రత్యేకమైన నామము క్రైస్తవుని జీవితములో కనీసం మూడు ప్రాముక్యమైన అనుభవములు కలిగి యుంటాయి. “నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై, లోపలి పోవుచు బయటకి వచ్చుచు మేతమేయుచుండును.” (యోహా10:9). మొదటిగా ద్వారమునైయున్న యేసుప్రభువు మనము ప్రవేశించినప్పుడు మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. రెండవడిగా, లోపలికిపోవుచు , బయటకి వచ్చుచు అనగా రక్షణ కొరకు లోపలి మరియు సేవకొరకు బయటికి వెళ్లి వచ్చుటకు మనకు స్వేచ్చ కలిగియుంటాము. మూడవడిగా, ఆయనయందు మనము ఆత్మ సంభందమైన ఆహారము పొందుకోనగలము.

“గొర్రెలకు మంచి కాపరి”

యేసుప్రభువు రెండుమార్లు “గొర్రెలకు మంచి కాపరిని” అని తన గురించి తాను తెలియజేసియున్నాడు. (యోహా10:11-14) అలా చెప్పిన సందర్భములో కొంత నైతిక సంభంధమైన మూలములు గల “కలోస్” (kalos) అను గ్రీకు పదమును వుపయోగించి యున్నాడు. ఒక సుందరమైన దానిని, ఉపయోగకరమైన దానిని, శుద్ధమైనదానిని, ఉన్నతమైన దానిని, సంపూర్ణమైన దానిని, యోగ్యతగలిగిన దానిని మరియు నీతి విషయములో మేలైనదానిని వివరించుటకు గ్రీకు శాస్త్రీయ భాషయందు ఈ మాటను ఉపయోగిస్తారు. ఇందులో ఏ ఒక్క విశేషమైన సరిపోతాయి. ఈ మాట గొర్రెల కాపరియొక్క అవశ్యకమైన మంచితనాన్ని సూచిస్తున్నది గనుక , అది గమనిన్చేవారికి స్పష్టముగా అనుభవము లోనికి వచ్చి తద్వారా గొర్రెలకాపరి అందరిచే ఆరాదిమ్పబడి, గురవిమ్న్పబడి మరియు ప్రేమించబడతాడు.

యేసుప్రభువు యొక్క ఈ నామము 23వదావీదు కీర్తనలోని ‘యెహోవా రోహి’ (Jehova Rohi) అను నామమునకు సంభందము కలిగియున్నదని చాల మంది బైబిలు వ్యాఖ్యానకారులు విశ్వసిస్తారు. గొర్రెల కాపరి తన మంద కొరకు (తన గోర్రేలకోరకు) తన ప్రాణము పెట్టునని ఈ నామము యొక్క ప్రాముఖ్యతయైయున్నoదున, మూడు గొర్రెల కాపరి కీర్తనలో (కీర్త 22-24) మొదటియైన 22 వ కీర్తన యొక్క సందర్భముతో మనము దానిని మరి ఎక్కువగా అర్ధము చేసుకోన వచ్చును. ‘గొర్రెల కాపరి’ అను యేసుప్రభువు యొక్క నామము ఆయన ‘సంఘము’ కు సంభందించైనా నామమై యున్నందున, పరిశుద్ధ గ్రంధములో సాధారణముగా ‘సంఘము’ దేవుని మందిరముగా గుర్తింపబడు చున్నది.

పునరుత్దానమునందు మరియు జీవము

చనిపోయిన సహోదరుడైన లాజరును తిరిగి బ్రతికించడానికి కొద్దిసేపటిముందు యేసుప్రభువు మార్తను కలిసికోన్నప్పుడు యేసుప్రభువు తన యెహోవా దేవునికి సంభందించిన మరియొక నామమును ఆయన బయల్పరచియున్నాడు. యేసుప్రభువు మార్తతో ఈలాగు చెప్పియున్నాడు “పునరుద్ధానమును జీవము నేనే; నాయందు విశ్వాసమున్చువారు చనిపోయినను బ్రతుకును; బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రహి వాడును యెన్నటికిని చనిపోడు.” (యోహా11:25-26). పునరుత్దానమునందు విశ్వాసమున్చుచున్నానని మార్త సూత్ర ప్రాయంగా తెలియజేసినప్పటికీ, పునరుత్దానమును ఒక వ్యక్తిగా, పునరుత్దానము ఆయనేనని ఆమెకు యేసుప్రభువు యొక్క అనేకమైన నామములలో ‘జీవము’ ఒకటియైయున్నది. మరియు ఆయన జీవమై యున్నాడన్న సంపూర్ణ భావమును బట్టి పునరుత్దానము యేసుప్రభువే.

ఒక విశ్వాసికి ఈ నామము రెండింతల వాగ్ధానము కలిగించుచున్నది. మొదటగా, శారీర మరణానికి గురియైన వారు నిత్యత్వమునకు లేపబడతారు. రెండవదిగా, విశ్వాసముంచిన ఏ ఒక్కరూ రెండవ మరనముచే భాదిన్చాబాడరు. క్రీస్తుయోక్క ఈ నామము మన వాగ్ధానము గుర్తుచేయబడే భూస్థాపన కార్యక్రమములయెద్ద సాధారణంగా మనము విన్నప్పటికీ, అవి నిబంధనలతో కూడిన వాగ్ధానములు మరియు క్రీస్తుయోక్క ఇట్టి నామము కేవలము ఆయనయందు విశ్వాసముంచిన వారికే అర్ధవంతము మరియు ప్రయోజన కారి.

మార్గము సత్యము మరియు జీవము

యేసుప్రభువు ఈ లోకములో శరీరుడుగా జీవించిన చివరి రోజు రాత్రి కాలము ఒంటరిగా తన శిష్యులతో వుండిన సమయములో ఆయన యెహోవాదేవునికి సంభందించిన తన నామములు (Jehovistic Names) మరి రెండు బయల్పరచియున్నాడు. అందులో మొదటిది : “నేనే మార్గమును సత్యమును జీవమును” (యోహా14:6) గ్రీకుమాట ‘హడోస్’(hados) దాని సరియైన భావము ‘మార్గము (రోడ్డు/road) లేదా రహదారి/రాజమార్గము(highway). మనము ప్రయాణము నాకు సంభందించిన మాటల్లో చెప్పాలంటే ‘యేసుప్రభువే పరలోకమునకు రాఝాదారి’ మరి అంతే కాకుండా ఆయన ఒక్కడే పరలోకమునకు రహదారి. క్రీస్తే ఏకైక రక్షకుడని క్రోతనిభందన పదేపదే మరియు ఘంటాపదంగా మనకు తెలియజేస్తున్నది.

తానే ఏకైక రక్షకుడని యేసు క్రేస్థూప్రభువు తెలియజేసియున్నాడు. (యోహా14:6). మరియు ఆయన శిష్యులు దానిని అంగీకరించి ఒప్పుకొనియున్నారు. (అ.కా 4:12) నూతన నిభందన క్రైస్తవ్యమును బట్టి యేసుప్రభువును అనుసరించువారు ‘ఈ మార్గము’ ‘క్రీస్తు మార్గము’ అని వివరించ బడుట క్రీస్తు ప్రభువు యొక్క గునలక్షనముల సరియైన వర్ణణవలెనున్నది. (అ.కా 9:2, 19:23, 22:4, 24:14,22)

క్రీస్తు మార్గమే కాకుండా క్రీస్తు ప్రభావము గల సత్యమే కూడా వున్నాడు. ఆయన సత్యము యొక్క చిహ్నము మరియు ఊటయై యున్నాడు. ఇది యూదులకు చాలా ప్రాముఖ్యమైనది. దేవునియోక్క ముఖ్య స్వభావమును తెలుడుకోనుతకు కొంతమంది యుదా మత భోధకులు గుంపుగా ప్రార్దిస్తుండగా హెబ్రీ భాష యందలి మొదటి, మధ్య మరియు చివరి అక్షరముతో కూడిన ఒక

గ్రంధపు చుట్టాను దేవుడు పరలోకము నుండి వారి మధ్యకు పంపియున్నాడని ఒక యుదు ఇతిహాస వివరిస్తున్నది. ఈ మూడు ఇతిహాసాలు కలిసి ‘సత్యము’ (truth) అని అర్ధమిచ్చు హెబ్రీ మాతయై యుండినది. ఈ కధ బైబెల్ అనుభంద Apocryphal కధగా ఉన్నప్పటికీ, ముఖ్యముగా దేవుని యొక్క స్వభావమును మరియు సత్యము యూదులకు ఎంతో ప్రాముఖ్యమైనదన్న విషయము ఇది సూచించుచున్నది.

మరియు యేసుప్రభువు జీవమై యున్నాడు. ఆయనలోనే జీవమున్నది గనుక ఆయన మనుష్యులన్దరిలో సాటిలేనివాడు. అందుచేతనే ఆయన పునరుత్దానమును వివరించు సందర్భములో ఆయన ‘జీవింపజేయుఆత్మ’ అని పౌలు తెలియజేసియున్నాడు. (I కోరిం15:4 5). ఈయన ఉనికి మరియు స్వరూపము యొక్క మూర్తిమంతము మరియు జీవమై యున్నది కనుక నాలుగవ సువార్త ప్రారంభమందు ‘ఆ జీవము మనుష్యులకు వేలుగైయుండెను’ అని ప్రకటింపబడినది.( యోహ 1:4)

నిజమైన ద్రాక్షావల్లి

యెహోవా దేవునికి సంభందించిన తన మరియొక నామము “నేను నిజమైన ద్రాక్షావల్లిని” ( యోహ 15:1-5) అని ఆ రాత్రి సమయములో ఆ మెడ గదిలో తన శిష్యులకి యేసుప్రభువు తెలియజేసియున్నాడు. ఇశ్రాయేలు దేశము నందు ద్రాక్షా తోటలు విస్తారముగా వుంటాయి గనుక ‘ద్రాక్ష’ ఆ దేశపు ఒక జాతీయ చిహ్నముగా పరిగనిమ్పబడుచున్నది. దేవాలయపు ద్వారా ప్రాంతములో ఒక బంగారు ద్రాక్ష తీగె ఫలకము పై చెక్కబడియున్నవి. మరియు మక్క బీయుల తిరుగుబాటు కాలములో ఆ చిహ్నము నాణేములపై ముద్రింపబడి యున్నది.పాత నిభందన యంతటియందును ఇశ్రాయేలు జాతిని వివరించుచున్నప్పుడు ‘ ద్రాక్షావల్లి’ లేదా ద్రాక్షతోట’ అను స్వరూపమును దేవుడు ఉపయోగించినాడు. (కీర్త 80:8; యేష5:1-7; యిర్మి2:21; యోహ15;19:10;హోష10:1) యేసుప్రభువు తనను తాను ‘నిజమైన ద్రాక్షావల్లిని’ అన్నప్పుడు బహుషా తనకు మరియు ఇశ్రాయేలు జాతి కిని బస సంభంధమును ఆపాదించియుండవచ్చు.

తప్పుడు మరియు అవాస్తవానికి విరుద్ధముగా, వాస్తవికత మరియు అసలైన లేదా సరియైనది యేసుప్రభువేనని వివరించి చెప్పుటకై నిజమైన(true) అని అర్ధము వచ్చు గ్రీకు పదము ఎలెధీన్ (alethine) అనేక మార్లు యోహాను సువార్తయందు ఉపయోగించబడినది. పాత నిభందన  యందు దేవుడు ఇశ్రాఏలును ద్రాక్షావల్లి అని అన్నప్పటికీ , దాదాపుగా దీని స్వభావము ఏళ్ళప్పుడు వ్యతిరేఖ భావముతోనే కనబడుచున్నది. దానికి బదులుగా యేసుప్రభువు వ్యవసాయకునిచే చక్కగా పెంచి పోషింపబడి పనికిరాని తీగెలు తీసి పారవేయబడి బహుగా ఫలించేడి నిజమైన లేదా అసలైన ద్రాక్షావల్లియైయున్నాడు. ఇశ్రాయేలు ఆలాగు ఎన్నడు వుండియుండలేదు, ఆ జాతి కృత్రిమమైన ద్రాక్షావల్లియై యుండి కారు ద్రాక్షాలు కాయుచుండినది.

నేనే…..నేనే (Iam….Iam)

అహః అను భావముగల గ్రీకు మాట ఏమి (eimi) పైన ఒఎర్కొన్న యేసుప్రభువు తెలియజేసిన యెహోవా దేవుని సంభంధమైన ప్రతి నామము నందు అర్ధం చేసుకోబడినది. తనకును మిగతా విషయానికి సరిపోల్చుకొనడానికి యేసుప్రభువు కేవలం క్రియాపదము ఏమి (eimi) ఉపయోగిస్తే సరిపోయి వుండేది గాని , ఆ మాటతో పాటుగా ‘అహః’ అను భావాన్ని కలిపినందుకు అది నొక్కివాక్కాణిoచినట్లవుచున్నది. యేసుప్రభువు ఎన్నో మార్లు ఈ నామమును తెలియజేసినప్పటికీ ( యోహ 4:26, 8: 58; 18:5, 6,8) పాత నిభందనయందు నిర్గ3:14 ప్రకారము “నేను ఉన్నవాడను అనువాడనైయున్నానని మరియు ఆయన ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని “ఇశ్రాయేలీయులతో చెప్పవలెనని యెహోవా దేవుడు మోషే తో చెప్పియున్నoత పూర్తి వాక్యము వాలే యేసుప్రభువుతోనే యెహోవానని చెప్పియుండలేదు.

అయినప్పటికీ, కనీసం ఒక్క సందర్భములో ఆయన మాటలు విని అట్టి భావముతో అర్ధంచేసుకొని, ఆయన దైవదూషణ గురించి ఆయనను చంపవలెనని రాళ్ళు ఎత్తిపట్టుకున్నారు. ( యోహ 8:58-59) మరియొక సందర్భములో ఈ నామమును యేసుప్రభువు ఉచ్చరించిన సందర్భములో ఆయన మహిమ ప్రత్యక్షము కాబడి ఆయనను పట్టుకోనడానికి వచ్చిన సైనికులు వెనుకుకు తగ్గి నేలమీదపడిపోయారు. ( యోహ 18:5-8). తాను కేవలం యెహోవా దేవుని పోలియున్నాననుటకు కాక తానే యెహోవా దేవుడనని నిరూపించుటకై యేసుప్రభువు ఈ నామమును వుపయోగించియున్నారు.

ముగింపు

యేసుప్రభువే పాతనిబంధనలోని యెహోవా దేవుడు. పాతనిబంధనలోగల యెహోవా దేవుని నామములన్ని చట్టబద్ధంగా ఆయనకు వర్తిస్తాయి.(అనుబంధము చూడండి) ఆయన మన ప్రతి అవసరము తీర్చగల నిత్యుడైన సమకాలీనుడైయున్నాడు. ‘ఉన్నవాడును’(Iam) యెహోవా దేవుని నామమును ప్రయోగాత్మకముగా పూర్తిగా అర్ధం చేసుకో క్రియారూపమైన ‘అనువాడు’ (to be) ను “మార్పుచెందు”(to become) అని అనువాదము చేసుకున్నచో  వచ్చానని G కాంప్ బెల్ మోర్గారోన్ అను ప్రాముఖ్య వ్యక్తి తెలియజేసియున్నాడు. మనకు సరిగ్గా ఏమి అవసరమో మరియు మనకు అట్టి అవసరత గురించిన భావము మనకు కలుగుతుందో ఆలాగే జరుగుతుంది అనేది యెహోవా దేవుని (యేసుప్రభుని) ఇట్టి నామముయెక్క ప్రాముఖ్యతయైయున్నది. ఈ మధ్యకాలములో యేసుప్రభువు నీకేమైయున్నాడు?

చర్చకొరకు

 

  1. యెహోవా దేవుని సంభందమైన క్రీస్తుప్రభువు యొక్క 8 నామములలో (IAM) ‘నేనే’ (ఉన్నవాడను) అను నామముయోక్క ప్రాముఖ్యత ఏమిటి?అది ఆయన దైవత్వమును ఏలాగు ప్రతిబింపజేస్తున్నది?
  2. రొట్టె యొక్క ఉపయోగమేమైయున్నది? విశ్వాసులలో ఈ ఉద్దేశామును యేసుప్రభువు ఏలాగు నేరవేర్చుచున్నాడు?
  3. ‘వెలుగు’అని క్రీస్తు ప్రభువు తనను తాను వివరించి యున్నప్పుడు ఆయన ఉద్దేశమేమియున్నది?
  4. క్రీస్తు సువార్త సేవ యందు ‘నేనే ద్వారమును’ అన్న దాని యొక్క విధి ఏమైయున్నది? లోపలి వెళ్ళు మరియు బయటికి వచ్చు అన్న మాటలయోక్క భావము ఏమైయున్నది?
  5. క్రీస్తు ప్రభువు ఏలాగు మంచి కాపరియైయున్నాడు?
  6. ‘పునరుద్దానమును, జీవమును’ అన్న క్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి రెండింతల వాగ్ధానము మనకు ఏలాగు దొరుకుచున్నది?
  7. ‘నేనే…నేనే’ అని క్రీస్తు ప్రభువు అన్నప్పుడు ఆయన భావము ఏమైయున్నది? యెహోవా దేవుని సంబంధమైన క్రీస్తు ప్రభువు నామములను బట్టి ఆయన గురించి మీకు ఏమి తెలియుచున్నది?