Lent Day -8 Sramala Dinaalu 10/03/2022 Wallpaper Whatsapp Share

Lent Day 8 Good Friday

Lent Day 8 Good Friday Pic:

Lent Day 8 Good Friday

Bible Verse for the LENT Day 8

నేను నమ్మిన వాని ఎరుగుదును … ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. (2తిమో 1:12)
మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగలవాడు. (ఎఫె 3:20)
అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. (2కొరిం 9:8)
శోధింపబడువారికి సహాయము చేయగలవాడు. (హెబ్రీ 2:18)
తన ద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించు చున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. (హెబ్రీ 7:25)
తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట అధికానందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును శక్తిగలవాడు. (యూదా 24)
నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడు. (2తిమో 1:12)
సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. (ఫిలి 3:21)
నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? … నమ్ముచున్నాము ప్రభువా….. మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. (మత్త 9:28,29)

Good Friday Cross song in Telugu

సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా = సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే /
1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు – విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే /
2. సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే /
3. సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప = కలుషమెల్లను బాపఁగఁ జాలును రా /నీ సిలువే /
4. పలు విధ పధము లరసి – ఫలిత మేమి గానలేక = సిలువయెదుటను నిలచినాడను రా /నీ సిలువే /
5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా = దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా /నీ సిలువే /

Siluve naa saranaayenu ra – nee – siluve naa sara naayenuraa – Siluva yande mukti balamun – joochiti raa /nee siluve/
1. Siluvanu vraali Yesu – Palikina palukulandu – Viluvaleni premaamrutamun groliti raa /nee siluve/
2. Siluvanu joochukoladi – Silasamaanamaina manasu = Naligi karigi neeraguchunnadiraa.. /nee siluve/
3. Siluvanu darachi tarachiti – Viluva kandaga raani nee krupa = Kalushamellanu baapaga jaalunu raa /Nee siluve/
4. Palu vidha padhamu larasi – Phalitamemi gaana leka = Siluva yedutanu nilachinaadanu raa / Nee siluve/
5. Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuva = Durita dooruda nee dari jeriti rua / Nee siluve/