Lent Day -9 Sramala Dinaalu 11/03/2022 Good Friday Images

Lent Day 9 Good Friday Pic:

Good friday Image Lent Day -9

 

క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. (ఎఫె 5:2)విశ్వసించుచున్న మీకు ఈ ఘనత కలదు. (1 పేతు 2:7)ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, … దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలి 2:10,11)దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. (కొల 2:9)నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. (యోహా14:15)మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. (రోమా 5:5)ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. (యోహా 12:3)వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి. (అ కా 4:13)
యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి యందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. (కీర్త 8:1)ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. (మత్త 1:23)ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెష 9:6) యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. (సామె 18:10)
ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. (2కొరిం 5:3)
ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు. .. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి.నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి. (కీర్త 38:9,4) అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? (రోమా 7:24)
సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము (రోమా 8:22,23) ఆవశ్యమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగు చున్నది. (1పేతు 1:6)
నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చును. (2 పేతు 2:13) క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసి యున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించు కొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడియున్న వాక్యము నెరవేరును. (1కొరిం 15:53,54)

Telugu Christian Song lyrics

వధియింపబడిన గొర్రెపిల్ల – సింహాసనాసీనుడ.. /2/
నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి – మమ్ములను కొన్నావే
ప్రతి జనములో నీ ప్రజలను – నీ యాజక రాజ్యము చేసావే
రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే..
రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే ..
అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/
1. అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు
అధికారము ఇచ్చే మహా దేవుడవు
ఆకాశ భూములయందు – ఈసృష్టి సర్వమునందు
నీ చిత్తము జరిగించే మహారాజు నువు
నీ రాజ్యము నిలుచును నిరతము – నీదేగా సర్వాధికారము
నీవెవ్వరికి ఇత్తువో వారిదే అవును భూరాజ్యము ..
మహోన్నతుడు యేసుని శుద్ధులదె ఈఅధికారము..
{రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే..
రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే ..
అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/}
2. దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజలజీవులు
అన్నియును నీయందే సృజియింపబడెన్
సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారమును
అందరును నీశాసనమునకు లోబడును
నీమాటతో ఎలేడి ప్రభుడవు – నీవొకడివే సృష్టికి కర్తవు
పరలోక పెద్దలందరు తమ కిరీటముల్ తీసి నిన్ను కొలుతురే ..
భూరాజులు నివాసులు తమ మహిమనంత తెచ్చి నిన్ను పూజింతురే …
{రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే..
రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే ..
అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/}
3. దావీదు చిగురువు నువ్వు యుదా స్తుతి సింహము నువ్వు
దావీదు తాళపుచెవి యజమానుడవు
నువ్ తలుపులు మూసావంటే -తెరిచేటి వారేలేరు
నువ్ తెరిచిన తలుపులు మూసే వారెవరు..
నీ భుజములపై రాజ్య భారము – నీదేగా నిత్య సింహాసనము
భూ రాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము…
నిను విశ్వసించు వారికే చెల్లుతుంది – నీ సత్య రాజ్యము …
{రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే..
రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే ..
అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/}
4. సేరాపులు కేరుబులచే పరిశుద్ధుడు పరిశుద్ధుడని
తరతరములు కొనియాడబడే శుద్దుడవు..
నీ స్తుతిని ప్రచురము చేయ – మమ్మును నిర్మించావయ్యా
మా ఆరాధనకు నీవే యోగ్యుడవు
నీ నామము బహుపూజనీయము – ప్రతి నామమునకు పై నామము
ప్రతివాని మోకాలును ప్రభుయేసు నామమందున వంగును …
ప్రతినాలుక యేసుడే – అద్వితీయ ప్రభువని ఒప్పును…
{రక్షణ -జ్ఞానము -స్తోత్రము -శక్తియు ఐశ్వర్యము నీదే.. హే..
రాజ్యము -బలము -ప్రభావము – మహిమ ఘనత నీదే ..
అర్హుడా యోగ్యుడా – క్రుతజ్ఞతకు పాత్రుడా.. /2/వధి(2)/}

Leave a Comment