Christian Whatsapp Status of the Lent Day 7
Bible Portion for the Lent Day 7
నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.(యిర్మి 31:34)
నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని; నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. (యెష 54:7,8)
తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు. (కీర్త 32:1,2)అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.(1యోహా 1:7)
నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి. (యెష 38:17)
అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. (మీకా7:18,19)
Bible Sad Song on Lent
యెంత ఘోరము – యెంత భారము
సిలువలో.. యేసుని మరణము – సిలువలో యేసుని మరణము /2/
యెంత ఘోరము …
1. పరము వీడి – నరుల గావ – అవనికేతెంచిన /2/
పరిశుద్ధునికిదియేమి – భా…రము
కదలలేక – పధమురాక – జాలిగా ప్రభు సాగుట
జాలిగా ప్రభు సాగుట … /ఎంత/
2. లోక పా..పములనుమోయు – గొర్రెపిల్ల ఆయనే /2/
కలువరిలో బలియా…యెను
కనులు తెరచి – గతము మరచి – ప్రభు మార్గము నడువరే
ప్రభు మార్గము నడువరే… /యెంత/