నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. (యోహా 17:15)
మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులు. … మీరు లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు. (ఫిలి 2:14,16)మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. (మత్త 5:13-16)
నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని. (ఆది 20:6)ప్రభువు నమ్మదగినవాడు.ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును. (2థెస 3:3) దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు. (నెహె 5:15)మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము ఆయనమనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. (గల 1:14) తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వ యుగములును కలుగును గాక. ఆమేన్. (యూదా 24,25)
యెహోవాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. (సామె 29:25)
యెహోవా మహా ఘనత నొందియున్నాడు. ఆయన ఉన్నతస్థలమున నివసించు చున్నాడు. (యెష 33:5) యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశములను మించి మహోన్నతమై యున్నది.ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్పమీద నుండి బీదలను పైకెత్తువాడు. (కీర్త 113:4,7,8)
దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సహా మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడియున్నారు. క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ కూర్చుండబెట్టెను. (ఎఫె 2:4,5,7)
తన స్వకీయకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసుద్వారా కనుపరచబడియున్న దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. (రోమా 8:32,38,39)