Easter Verses in Telugu- Punarudhaana Dinamu Resurruction Day

అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు, చనిపోయినను బ్రదుకును. బ్రదికి, నాయందు విశ్వాసముంచు ప్రతివాడును, ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. యోహాను సువార్త 11:26

 

1 Corinthians 15:21
1 కొరింథీయులకు 15:21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక, మనుష్యుని ద్వారానే, మృతుల పునరుత్థానమును కలిగెను.

 

అపోస్తలుల కార్యములు 4 33 ఇదియు గాక, అపొస్తలులు బహు బలముగా, ప్రభువైన యేసు (కొన్ని ప్రాచీన ప్రతులలో క్రీస్తు అని కూర్చబడియున్నది) పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.

ఫిలిప్పీయులకు 3 10 ఏ విధము చేతనైనను, మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును, ఎరుగు నిమిత్తమును,
1 పేతురు 1 4 మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన, జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున, మనలను మరల జన్మింపజేసెను.
రోమీయులకు 8 34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును, ఆయనే. {రోమా 5:8-11; హెబ్రీ 7:25}
రోమీయులకు 10 9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు, మృతులలోనుండి ఆయనను లేపెనని, నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
1 థెస్సలొనీకయులకు 4 14 యేసు, మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము, యేసునందు నిద్రించిన వారిని, దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. {అ కా 7:59,60; రోమా 8:11; 1 కొరిం 15:20-23}

లూకా సువార్త 24 6 ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు. ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు,
లూకా సువార్త 24 7 మనుష్య కుమారుడు, పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని, ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని, వారితో అనిరి. {లూకా 9:22}
రోమీయులకు 6 9 మరణమునకు ఇకను, ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని, నమ్ముచున్నాము.
రోమీయులకు 6 8 మనము క్రీస్తుతో కూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు, ఇకను చనిపోడనియు, {గల 2:20; 2 తిమో 2:11}
రోమీయులకు 6 9 మరణమునకు ఇకను, ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని, నమ్ముచున్నాము.
రోమీయులకు 6 10 ఏలయనగా, ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని, ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు.
రోమీయులకు 6 11 అటువలె మీరును, పాపము విషయమై మృతులు గాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులు గాను, మిమ్మును మీరే యెంచుకొనుడి.

1 thought on “Easter Verses in Telugu- Punarudhaana Dinamu Resurruction Day”

  1. I can’t an English but I am interested in Bible study course in Telugu language please My dear sister’s & brother’s So please help me

    Reply

Leave a Comment