అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించు చున్నాడు. (పర 2:6)
శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము.నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును. (ద్వితీ 33:27)గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. (మత్త 14:30-31)
ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. (కీర్త 37:23-24)
బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజములమధ్య అతడు నివసించును. (ద్వితీ 33:12)ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. (1 పేతు 5:7) మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడవును. (జక 2:8)
అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు. (యోహా 10:28-29)
చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛ కళలు గలదై జెండాలతో వచ్చు సైన్యము వలె భీకర రూపముగల ఈమె ఎవరు?(పర 6:10)
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. (అ కా 20:28)
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. (ఎఫె 5:25-27)
పరలోకమందు ఒక గొప్ప వింత కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ కనబడెను. (ప్రక 12:1)గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొని యున్నది. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమె కియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. (ప్రక 19:7-8)అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. (రోమా 3:22)
నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. (యోహా 17:22)