Christian Whatsapp Status of the Day =Lent Day 6 Good Friday
యేసుక్రీస్తు శ్రమల Song- Good Friday Lent Season Song
ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తిపాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా|| ఏ పాప ||
కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా|| ఏ పాప ||
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా|| ఏ పాప ||
ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా|| ఏ పాప ||
పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా|| ఏ పాప ||
బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము|| ఏ పాప ||
కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి|| ఏ పాప ||
Scripture of the Day = Lent Day 6
నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును. (2సమూ 22:33-35)మా సామర్థ్యము దేవుని వలననే కలిగి యున్నది. (2కొరిం 3:5)
యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును. (కీర్త 34:7) ఎలీషాచుట్టును పర్వతము అగ్ని,గుఱ్ఱములచేతను రథముల చేతను నిండియుండెను. (2సమూ 6:17)
వారిని గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి. … బలహీనులుగా ఉండి బలపరచబడిరి.యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారదోలిరి. (హెబ్రీ 11:32-34)
విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము. (1తిమో 6:12)
ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. (2కొరిం 7:5)భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారు. (2 రాజు 6:16) ప్రభువుయొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. (ఎఫె 6:10)
నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. (1సమూ 17:45)దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు