Ash Wednesday = Lent Day 1 Bhasma Bhudhavaaramu Sramala Diamulu

Picture of the Day =Lent Day 1

Lent Day -1 Sramala Dinaalu 1 wallpaper whatsapp status

 

Song of the Day = Lent Day 1

యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకే
యెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే
1. నదివోలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే
2. నేడె నీ పాపములొప్పుకో – నీ పాపపు డాగులు తుడుచుకో
నీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో
3. పాప శిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువె సహించెను
నలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని
Lyrics in English:
Yesu chavonde siluvapai – Nee korake Naa Korake
Yenta goppa srama norchenu – Nee korake Naa Korake
1.Nadi vole Yesu rakthamu – Siluvalo nundi pravahinche
Paapamu kadigi malinamu tudiche – Aa prasastha rakthame
2.Nede nee paapamuloppuko – Nee paapapu daagunu tuduchuko
Nee atma tanuvula shuddhi parachuko – Kreesthu Yesu rakthamulo
3.Paapa siksha ponda tagiyuntimi – Mana siksha prabhuve sahinchenu
Nalugagottabade podavabade neekai – Angeekarinchu Yesuni

 

Scripture of the  Day += Lent Day 1

దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. (2తిమో 4:18)

కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. (2కొరిం 1:3-5)
ఆయన వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. (మలా3:3) ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత,ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. (1 పేతు 1:6,7) ప్రభువు నా పక్షమున నుండి నన్ను బలపరచెను. (2తిమో 4:17)
కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. (హెబ్రీ 4:9)
అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు. (యోబు 3:8) బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు. (యోబు 3:17,18)
ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు … వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదుందుదురు. వారి క్రియలు వారివెంట పోవును. (ప్రక 14:13)
మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు … యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. (యోహా 11:11-13)
ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. (2కొరిం 5:3) ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ స్వీకృత పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము (రోమా 8:23)
నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితివిు. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు. … మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము గదా? (రోమా 8:24-25)

Leave a Comment