Telugu Bible Quotes 1 -తెలుగు బైబిల్ వాక్యాలు

Telugu Bible Quotes are presented here for you to get motivated and also to share the Gospel with your friends and family. You can download these Telugu Bible Verses and share on social media platforms like whatsapp Facecebook Twitter Pinterest Instagram for free.

 

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు క్రీస్తు ప్రభువు (హెబ్రీ 12:2)

 

ఏలయనగా, మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము, అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలనే, క్రీస్తులో పాలివారమై యుందుము.

suvarthaswaram Bible verses 4

యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. (కీర్త 19:7)

Telugu Bible Quotes of word of God Faith 1 Telugu Bible Quotes wall paper on Faith 2 Telugu Bible Quotes wallpaper on Word of God 3

చెప్పుచున్నాడు. లేఖనములను పరిశోధించుడి. అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. (యోహా 5:39)

దేవుడు లోకానికి అనుగ్రహించిన గ్రంథాలు రెండే రెండు. మొదటి గ్రంథం దేవుని మహిమైశ్వర్యమును వివరించే సృష్టి కాగా, మానవాళి మేలు కొరకు తన ప్రవక్తలచే వివరించబడి, తరతరాలకు అందించబడిన రెండవ గ్రంథం బైబిలు. సృష్టి పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. (కీర్త 19:2) దేవుని వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగు. (కీర్త 119:105)

యోహాను సువార్త 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది, ఆత్మయునై యున్నది.
హెబ్రీయులకు4:12
ఎందుకనగా, దేవుని వాక్యము సజీవమై బలముగలదై, రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను, విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను, ఆలోచనలను, శోధించుచున్నది.
హెబ్రీయులకు3:15

 

కీర్తనలు 42:1-11

దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను. జనసమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో, నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి, స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా, నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.  నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.  నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది. కావున యొర్దాను ప్రదేశము నుండియు, హెర్మోను పర్వతము నుండియు, మిసారు కొండ నుండియు, నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని, కరడు (అల) కరడును (అలలును) పిలుచుచున్నది. నీ అలలన్నియు, నీ తరంగములన్నియు. నా మీదుగా పొర్లి పారియున్నవి.  అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు, నాకు తోడుగా ఉండును. కావున, నీవేల నన్ను మరచి యున్నావు? శత్రు బాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి, అని, నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయు చున్నాను.  నీ దేవుడు ఏమాయెనని, నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా యెముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త. నా దేవుడు. ఇంకను నేనాయనను స్తుతించెదను.

Leave a Comment