Siluva Paatau Telugu lo – 10 గొప్ప సిలువ పాటలు Christian Lyrics & Chords 

Siluva Paatalu -1

యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకే
యెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే
1. నదివోలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే
2. నేడె నీ పాపములొప్పుకో – నీ పాపపు డాగులు తుడుచుకో
నీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో
3. పాప శిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువె సహించెను
నలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని
Lyrics in English:
Yesu chavonde siluvapai – Nee korake Naa Korake
Yenta goppa srama norchenu – Nee korake Naa Korake
1.Nadi vole Yesu rakthamu – Siluvalo nundi pravahinche
Paapamu kadigi malinamu tudiche – Aa prasastha rakthame
2.Nede nee paapamuloppuko – Nee paapapu daagunu tuduchuko
Nee atma tanuvula shuddhi parachuko – Kreesthu Yesu rakthamulo
3.Paapa siksha ponda tagiyuntimi – Mana siksha prabhuve sahinchenu
Nalugagottabade podavabade neekai – Angeekarinchu Yesuni

Jesus Siluva Paatalu -2

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
అమూల్యమైన రక్తము యేసు రక్తము(2)
1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము(2)
సంధి చేసి చేర్చును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము(2)
2. సమాధాన పరచును యేసు రక్తము(2)
సమస్యలన్ని తీర్చును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము(2)
3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము(2)
దుర్ణితినంత బాపును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
నిబంధన నిలపును రక్తము – యేసు రక్తము(2)
4. రోగములను బాపును – యేసు రక్తము(2)
దురాత్మల పారద్రొలును -యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
శక్తి బలము నిచ్చును-యేసు రక్తము(2)

Silvalo Naakai Kaarchenu – Yesu Rakthamu (2)
Shilanaina Nannu Maarchenu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Amoolyamaina Rakthamu – Yesu Rakthamu (2)
1.Samakoorchu Nannu Thandritho – Yesu Rakthamu (2)
Sandhi Chesi Cherchunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Aikyaparachunu Thandritho – Yesu Rakthamu (2)
2.Samaadhaana Parachunu – Yesu Rakthamu (2)
Samasyalanni Theerchunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Sampoorna Shaanthinichchunu – Yesu Rakthamu (2)
3.Neethimanthuluga Cheyunu – Yesu Rakthamu (2)
Durneethi Nantha Baapunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Nibandhana Nilupunu Rakthamu – Yesu Rakthamu (2)
4.Rogamulanu Baapunu – Yesu Rakthamu (2)
Duraathmala Paaradrolunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Shakthi Balamu Nichchunu – Yesu Rakthamu (2)

Kreesthu Siluva Paatalu -3

Siluve naa saranaayenu ra
సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా = సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే /
1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు – విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే /
2. సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే /
3. సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప = కలుషమెల్లను బాపఁగఁ జాలును రా /నీ సిలువే /
4. పలు విధ పధము లరసి – ఫలిత మేమి గానలేక = సిలువయెదుటను నిలచినాడను రా /నీ సిలువే /
5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా = దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా /నీ సిలువే /
రచన: చెట్టి భానుమూర్తి

Lyrics in English:
Siluve naa saranaayenu ra – nee – siluve naa sara naayenuraa – Siluva yande mukti balamun – joochiti raa /nee siluve/
1. Siluvanu vraali Yesu – Palikina palukulandu – Viluvaleni premaamrutamun groliti raa /nee siluve/
2. Siluvanu joochukoladi – Silasamaanamaina manasu = Naligi karigi neeraguchunnadiraa.. /nee siluve/
3. Siluvanu darachi tarachiti – Viluva kandaga raani nee krupa = Kalushamellanu baapaga jaalunu raa /Nee siluve/
4. Palu vidha padhamu larasi – Phalitamemi gaana leka = Siluva yedutanu nilachinaadanu raa / Nee siluve/
5. Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuva = Durita dooruda nee dari jeriti rua / Nee siluve/

Yesu Siluva Paatalu -4

పల్లవి: సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు (2X)
1. నాదు పాప గాయములను – మాపగోరి సిల్వపై
నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి
/సిలువయందె/
2. తండ్రి కుమార శుద్దాత్మలదేవ – ఆరాధింతు ఆత్మతో
హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం
/సిలువయందె/

Siluvalona Nilachi Yesu song Lyrics
సిలువలోన నిలిచి యేసు – పిలిచె నిన్నే క్రైస్తవా /2/
విలువకందని నీదు ప్రేమ – తలువగా నా తరముకాదు /సిలువ/
1. దేవుని కుమారుడనియు -ధరణినేలే రాజరాజని /2/
కోరాడ దెబ్బలు కొట్టుచు – క్రీస్తు నల్లరి జేసిరా /సిలువ/
2. ఎన్ని శ్రమలనొందిన – మన్నించు తండ్రి వీరలన్ /2/
అన్న యేసుని సిలువ గాధ – వినుమా నా ప్రియ క్రైస్తవ /2/సిలువ/
3. నా కలుషములకై యేసువా – నలిగిపోతివ సిలువలో /2/
విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్
నే విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్ /సిలువ/

Siluva Paatalu Telugu lo-5

siluvapai o snehituda
సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా /2/
నా పాపముకై నా దోషముకై బలియైన నా యేసయ్య /2/సిలు/
1. నా కొరకు త్యాగమూర్తివై బహు విలువైన నీ రక్తము /2/
ధారలుగా నా భారముగా చిందించావులే నా యెదుట /2/
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము/2/సిలు/
2. కఠినముగా ఈ లోకము నీదేహాన్ని దాహంతో నలిపారుగా /2/
మౌనముగా మనసు గాయముతో కరిగిపోయావులే నా యెదుట /2/
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము /2/సిలు/
Lyrics in English:
Siluvapai o snehituda..
Ninnentagaano himsinchitiraa.. /2/
Naa paapamukai – Naa doshamukai
Baliyeina na Yesayya.. /2/Siluvapai/
1. Naa koraku tyaagamurthivai
Bahu viluvaina nee rakthamu
Dhaaraluga – naa bhaaramuga
chindinchaavule naa yeduta /2/
Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/
2. Kathinamuga ee lokamu
Nee dehaanni daahamto nalipaaruga /2/
mounamuga mansu gaayamuto
Karigipoyaavule naa yeduta /2/
Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/

Siluva Paatalu in Telugu language – 6

సిలువలోన నిలిచి యేసు – పిలిచె నిన్నే క్రైస్తవా /2/
విలువకందని నీదు ప్రేమ – తలువగా నా తరముకాదు /సిలువ/
1. దేవుని కుమారుడనియు -ధరణినేలే రాజరాజని /2/
కోరాడ దెబ్బలు కొట్టుచు – క్రీస్తు నల్లరి జేసిరా /సిలువ/
2. ఎన్ని శ్రమలనొందిన – మన్నించు తండ్రి వీరలన్ /2/
అన్న యేసుని సిలువ గాధ – వినుమా నా ప్రియ క్రైస్తవ /2/సిలువ/
3. నా కలుషములకై యేసువా – నలిగిపోతివ సిలువలో /2/
విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్
నే విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్ /సిలువ/

Good Friday Siluva Paatalu Telugu lo- 7

Siluvalo saagindi yaatra Telug worship song lyrics
సిలువలో సాగింది యాత్రా – కరుణామయుని దయగల పాత్ర #2#
ఇది ఎవరికోసమో… ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే # సిలువలో#
1. పాలు గారు దేహము పైన – పాపాత్ముల కొరడాలెన్నో#2#
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి #2#
నోరు తెరువలేదాయే ప్రేమా… బదులు పలుకలేదాయె ప్రేమ#2#
2. చెళ్ళుమని కొట్టింది ఒకరు – ఆ మోముపైన ఊసింది మరియొకరు#2#
బంతులాడినారు – బాధలలో వేసినారు #2#నోరు తెరువ#
3. వెనుకనుంచి తన్నింది ఒకరు- తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు#2#
గేలి చేసినారు – పరిహాసమాడినారు#2# నోరు తెరువ#
4. దాహమని అడిగింది ప్రేమా – చెడు దాహం ఇచ్చింది లోకం#2#
చిరకనిచ్చినారు – మరి భారిసెతో గుచ్చారు #2# నోరు తెరువ#

Jesus Christ on Cross – Feel good Siluva Paatalu Telugu lo- 8

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా 2
వెలియైన యేసయ్యా- బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా #సిలువలొ#
1. నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు2
కొరడాలు చెళ్ళని చీల్చెను – నీ సుందర దేహమునే2
తడిపెను నీ తనువును – రుధిర౦పు ధారాలే2#వెలి#
2. వధకు సిద్దమైన గొర్రెపిల్లవోలె
మోమున ఉమ్మివేయ – మౌని వైనావే2
దూషించి అపహిసి౦చి హింసించిరా నిన్ను2
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా2#వెలి#

Emotional Good Friday Songs Telugu lo- 9

సిలువ శ్రమలు నాకై ఓర్చితివా – కలువరి గిరి మెట్టపై
సిలువ శ్రమలు నాకై ఓర్చితివా…
కలువరి గిరి మెట్టపై – కలుషమెల్లను బాపగ
ఇల వేల్పుగా బలిఐతివా
సిలువ శ్రమలు నాకై ఓర్చితివా..
1. దారి తెలియని దీన ప్రజలను – దరికి చేర్చి బ్రోచినావ /2/
కారుచీకటి తెరలు తొలిగే సిలువలో /2/
నుర్వి జనుల జీవజ్యోతిగా /సిలువ/
2. మానవాళిని ఆదరించిన – మాన్యుడా ఓ పూజ్యుడా /2/
అనవరతము తలతు నీదు సిలువను /2/
కన్నతండ్రివి నీవని /సిలువ/

Sad Good Friday Siluva Paatalu Telugu lo- 10

సిలువ చెంత చేరిన నాడు – కలుషములను కడిగివేయు2
పౌలు వలెను సీల వలెను2 – సిద్దపడిన భక్తులజూచి2
1. కొండలాంటి బండలాంటి- మొండి హృదయంబు మండిచును
పండి యున్న పాపులనైన – పిలచుచుండే పరముచేర2
2. వంద గొర్రెల మందలోనుండి – ఒకటి తప్పి ఒంటరి యాయె
తొ౦బది తొమ్మిది గొర్రెల విడచి 2- ఒంటరియైన గొర్రెను వెదకెన్2
3. తప్పిపోయిన కుమారు౦డు – తండ్రిని విడచి తరలిపోయె2
తప్పు తెలసి తిరిగి రాగా2 – తండ్రి యతని చెర్చుకొనెను 2
4. పాపి రావా పాపము విడచి – పరిశుద్దుల విందులో చేర2
పాపుల గతిని పరికించితివా 2- పాతాలంబే వారి అంతము2

Leave a Comment