Daily Bible Verses in Telugu are here. For you we present బైబిల్ వాక్యాలు below
యోహా 14:1
మీ హృదయమును కలవరపడనియ్యకుడి. దేవునియందు విశ్వాసముంచుచున్నారు. (లేక దేవునియందు విశ్వాసముంచుడి) నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు. లేనియెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి, మీకు స్థలము సిద్ధపరచిన యెడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరల వచ్చి, నాయొద్ద నుండుటకు, మిమ్మును తీసికొని పోవుదును. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము, మీకు తెలియునని చెప్పెను.
కీర్తనలు 31:1-6
యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి, నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు, నాకు ఆశ్రయ శైలముగాను, ప్రాకారముగల యిల్లుగాను ఉండుము. నా కొండ, నాకోట, నీవే. నీ నామమునుబట్టి త్రోవ చూపి, నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై, శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి, నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించు చున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని యున్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు.
మత్త 23:1-14
అప్పుడు యేసు, జనసమూహములతోను, తన శిష్యులతోను ఇట్లనెను. శాస్త్రులును, పరిసయ్యులును, మోషే పీఠమందు కూర్చుండువారు, గనుక, వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి. అయినను, వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని, చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి, మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని, తమ వ్రేలితోనైన, వాటిని కదలింప నొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తము, తమ పనులన్నియు చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దవి గాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు, కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు, గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు, మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించుకొను వాడు, తగ్గింపబడును. తన్నుతాను తగ్గించుకొనువాడు, హెచ్చింపబడును. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల యెదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింప నియ్యరు.
కీర్తనలు 113:1-9
యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యెల్లకాలము, యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని, సూర్యాస్తమయము వరకు, యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి యెదుట మహోన్నతుడు. ఆయన మహిమ, ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది. ఉన్నతమందు ఆసీనుడైయున్న, మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగి, చూడననుగ్రహించు చున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో, వారిని కూర్చుండబెట్టుటకై, ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పమీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.
మార్కు 13:14-23
మరియు నాశకరమైన హేయ వస్తువు, నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు, చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దెమీద ఉండువాడు, ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై, దిగి, అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు, తన వస్త్రము తీసికొనిపోవుటకు, ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును, పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి, ఇదివరకు అంత శ్రమ కలుగలేదు. ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని యెడల, ఏ శరీరియు తప్పించు కొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా, తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము, ఆయన, ఆ దినములను తక్కువ చేసెను. కాగా, ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని, యెవడైనను మీతో చెప్పిన యెడల, నమ్మకుడి. ఆ కాలమందు, అబద్ధపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైన యెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై, సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో, సమస్తమును, మీతో ముందుగా చెప్పియున్నాను.
మార్కు 14:22-25
వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి, విరిచి, వారికిచ్చి, మీరు తీసికొనుడి. ఇది నా శరీరమనెను. పిమ్మట, ఆయన గిన్నె పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దాని వారి కిచ్చెను. వారందరు దానిలోనిది త్రాగిరి. ప్పుడాయన, ఇది నిబంధన విషయమై (కొన్ని ప్రాచీనప్రతులలో – క్రొత్త నిబంధన విషయమై అని పాఠాంతరము) అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో, ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు, ఇకను దానిని త్రాగనని, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.