Christian Lullabies 4 Kids | దేవ Jesus Lullaby Lyrics

Telugu Christian Lullabies Kids Song 1

లాలి లాలి లాలి లాలమ్మ లాలీ

లాలియని పాడరే బాలయేసునకు… లా…లీ…

1. పరలోక దేవుని తనయుడో యమ్మా….

పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా…. లాలీ

2. ఇహ పరాదుల కర్త యీతడో యమ్మా….

మహి పాలనము జేయు మహితుడో యమ్మా…. లాలీ

3. ఆద్యంతములు లేని దేవుడో యమ్మా….

ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా…. లాలీ

4. యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా….

యూదు లాతని తోడ వాదించి రమ్మా…. లాలీ

5. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా….

గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా…. లాలీ

 

Telugu Lullabies 

Laali laali Laalamma laali Song Lyrics in English

Laali Laali Laali Laalamma laali

Laali yani paadare baala Yesunaku… Laa..lee..

1. Paraloka Devuni tanayudoyamma..

Pudamipai Blaaluduga buttenoyamma.. Laali..

2. Iha paraadula kartha eetadoyamma…

Mahipaalanamu jeya mahitudoyamaa.. Laali..

3. Aadyantamulu leni Devudoyamma..

Aadaamu doshamunakaddupadenamma.. Laali..

4. Yudula raajuga buttenoyamma..

Yudulaatanitoda vaadinchiramma.. Laali..

5. Naragorrela manda kaaparoyamma…

Goriyala praanambu Kreesthu taanamma.. Laali..

Watch this on YouTube

 

Song 2

Deva Kavave Nedu Mammulan Song

Andhra Kraisthava Keerthanalu Song number 540

 

దేవ కావవే – నేడు మమ్ములన్ = నీవెరాత్రి కాచినావు – నీకు స్తోత్రము ||దేవ||

 

1. ఆపదలు మమున్ – అంటకుండను = కావుమయ్య నేడు నీదు – కఱుణ తోడను ॥దేవ||

 

2. నేటి కార్యముల్ – నేడె చేయగా = సూటియైన త్రోవ మాకు – చూపుమోప్రభో ||దేవ||

 

3. చెడ్డ కార్యముల్ – చేయకుండను = దొడ్డబుద్ధినిచ్చి మమ్ము నుద్ధరించుము దేవ॥దేవ||

Song 3

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా

మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2)

 

యేసయ్యా యేసయ్యా యేసయ్యా

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

 

శాంతి జలములందు పచ్చ గడ్డిలో

కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా||

 

ఒక్కటే ఆశ కలదు యేసయ్యా

చక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా||

 

శత్రువైన సాతాను ఎదుటను

విందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా||

 

అంధకార లోయలో అండగా

ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా||

 

Chinna Gorrepillanu Nenu Yesayyaa

Mellamellagaa Nadupu Yesayyaa (2)

 

Yesayyaa Yesayyaa Yesayyaa

Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)

 

Shaanthi Jalamulandu Pachcha Gaddilo

Kaanthi Baatalo Nadupu Yesayyaa (2) ||Yesayyaa||

 

Okkate Aasha Kaladu Yesayyaa

Chakkanaina Nee Illu Chereda (2) ||Yesayyaa||

 

Shathruvaina Saathaanu Edutanu

Vindu Chesinaavu Naaku

Yesayyaa (2) ||Yesayyaa||

Andhakaara Loyalo Andagaa

Undugaaka Nee Siluva Yesayyaa (2) ||Yesayyaa||

Song 4

అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం

దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన

బాలుఁడేసు ||ననుకరించెద||

Telugu Children Lullabies

1. పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును

జయించిన స చ్చరితుఁడైన యోసేపు ||ననుకరించెద||

2. తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి

నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||

3. పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ

బూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద||

4. శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు

రచించిన సుందరుండౌ దావీదు ||ననుకరించెద||

5. పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ

వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||

6. యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య

మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద|

7. అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి

ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||

8. ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని

సమాచార మిడిన రొదే ||ననుకరించెద||

9. భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది

సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||

Song 6

 

 

1.ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి
సమయమున ప్రార్థన చేతుము మా దేవా||

2.చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా
ప్రభువా గావుము గావుము నీ నీడన్||

3.చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే
గొలిచి నిద్రించున్||

4.చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా
చెన్నుగ యేసూగావుమా||

5.నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి
విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్||

6.రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును
గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా||

7.తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్
మేల్కొల్పుము నా ప్రియతండ్రి||

8.జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము
నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్||

1.aakaashmbu bhoomiyu amthata cheekati yaayenu praakedu cheekati
samayamuna praarThana chaethumu maa dhaevaa||

2.chakkani chukkalu miMtanu chakkagaa mammunujoodaga prakkaku raave vaegamugaa
prabhuvaa gaavumu gaavumu nee needan

3.chinna chinna pakShulu chinna chinna poovulu ennoa ennoa jeevulu ninnae
golichi nidhrimchun

4.chinna chinna paapalu chinna chinna padakalaloa chinna kannulu mooymgaa
chennuga yaesoogaavumaa

5.naelanu boayedi bMdlaloa neetanu boayedi oadalaloa gaali
vimaanMbulaloana kaavumu dhaevaprayaaNikulan

6.raathriloa needhu dhoothalu ramymbaina rekkalathoa chithrmbuga mammunu
gramman nidhriMchedhamu maadhaevaa||

7.thellavaarujaamuna thelivomdhi mamandharamu mellagalaechi nuthiyiMpan
maelkolpumu naa priyathmdri

8.janaka thanayaa shudhDhaathmaa jayamu mahima sthoathramulu anishamu
neekae chellunugaa anishamu chellunu nee kaamen